ఇన్‌స్టాగ్రామ్‌ పేరెంటింగ్‌

Published on Tue, 12/02/2025 - 04:53

పేరెంటింగ్‌కు సంబంధించి ఇప్పుడు సరికొత్త ట్రెండ్‌... ఇన్‌స్టాగ్రామ్‌ పేరెంటింగ్‌. కొందరికి నచ్చినా, నచ్చకపోయినా ఇన్‌స్టాగ్రామ్‌ అనధికారికంగా కొత్త పేరెంటింగ్‌ మాన్యువల్‌గా మారింది. పేరెంటింగ్‌కు సంబంధించిన సలహాల కోసం పెద్దలు, ఇరుగు పొరుగువారు, వైద్యులు, పుస్తకాల మీద ఆధారపడడం అనేది ఒక విధానం. దీనికి భిన్నంగా ఆన్‌లైన్‌ దారిలో వెళ్లడమే ఇన్‌స్టాగ్రామ్‌ పేరెంటింగ్‌.

శిశువుకు పాలివ్వడం నుంచి పిల్లలను స్కూలుకు పంపడం వరకు పేరెంటింగ్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో ఎన్నో వీడియోలు ఉన్నాయి. మనసులోని సందేహాన్ని టైప్‌ చేస్తే చాలు సెకన్‌ల వ్యవధిలో వందలాది వీడియోలు పరిష్కారాన్ని కనుగొనడంలో సహాయపడతాయి. ఇన్‌స్టాగ్రామ్‌ పేరెంటింగ్‌ ప్రత్యేకత ఏమిటంటే అది 24/7 అందుబాటులో ఉంటుంది.

బేబీఫుడ్, రెండు సంవత్సరాల పిల్లలకు కలర్‌ఫుల్‌ ప్లేట్స్, సూటబుల్‌ డయపర్స్‌... మొదలైన ఎన్నో విభాగాల ఇన్‌స్టాగ్రామ్‌లు ఉన్నాయి. ‘గతంలో పేరెంటింగ్‌కు సంబంధించి సందేహాలు, సమస్యలు, సవాళ్లు కుటుంబ పరిధిలోనే ఉండేవి. ఇప్పుడు మాత్రం పేరెంట్స్‌ తమ అనుభవాలను షేర్‌ చేసుకోవడానికి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ఉపయోగపడుతున్నాయి. 

ఒకప్పుడు పెద్ద కుటుంబాలు ఉండేవి కాబట్టి సలహాల కోసం ఇతరుల మీద ఆధారపడే అవసరం ఉండేది కాదు. సోషల్‌ మీడియా విస్తృతస్థాయిలో పేరెంటింగ్‌ విధానాలను పరిచయం చేయడంతో, చిన్న కుటుంబాల వారు పేరెంటింగ్‌కు సంబంధించిన సలహాల కోసం సోషల్‌మీడియాపై ఆధారపడుతున్నారు. ట్రెండ్‌ సంగతి ఎలా ఉన్నా, నిజంగా ఇన్‌స్టాగ్రామ్‌ పేరెంటింగ్‌ తల్లిదండ్రులకు సహాయపడుతుందా? లేక ఒత్తిడిని పెంచుతుందా?

‘కంటెంట్‌లో కొంత భాగం పరిశోధన ఆధారితమైనప్పటికీ, ఎక్కువ శాతం ట్రెండ్‌ ఆధారితమైనది. పేరెంటింగ్‌కు సంబంధించి సలహాలు, సూచనలు త్వరగా తెలుసుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రొఫెషనల్, పర్సనలైజ్‌డ్‌ మెడికల్, ఫ్యామిలీ గైడెన్స్‌కు ఇన్‌స్టాగ్రామ్‌ పేరెంటింగ్‌ సమానం కాదు. ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌ శిశువు చరిత్ర, స్వభావం, ఆహార అలవాట్లు, ఆరోగ్య అవసరాలు తల్లిదండ్రుల మానసిక పరిస్థితులను అంచనా వేయదు’ అంటున్నారు నిపుణులు.
 

Videos

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)