9 నెలలుగా జీతం ఇవ్వకపోతే ఎలా బ్రతకాలి.. ఏయూలో దళితులపై వివక్ష
Breaking News
పిల్లలకు సమయం కేటాయించాలి
Published on Sun, 05/31/2026 - 08:41
‘పిల్లలకు డబ్బు, ఆస్తులు ఇవ్వడం కాదు, రోజూ తగినంత సమయం కేటాయించడం ముఖ్యం’ అంటున్నారు సైకాలజిస్ట్ పి.జ్యోతిరాజ. ఇరవయ్యేళ్లుగా సైకాలజిస్టుగా చిల్డ్రన్, ఫ్యామిలీ కౌన్సెలర్‌గా ఉన్న జ్యోతిరాజ పిల్లల పెంపకంలో తాను తీసుకున్న జాగ్రత్తలను ఇలా తెలిపారు...
‘‘నిన్నటి తరం పిల్లలు అమ్మనాన్నలు ఏం చెబితే అది విన్నారు. తర్వాతి తరం నిర్ణయాలలో పిల్లల అభిప్రాయాలు తీసుకున్నారు. ఇప్పుడు పిల్లలు ఎంత చెబితే అంత అనే విధంగా ఉంది. ఆరవ తరగతి చదువుతున్న ఒక అమ్మాయిని కౌన్సెలింగ్‌కు నా దగ్గరకు తీసుకువచ్చారు. ఇంట్లో ఆ అమ్మాయికి నచ్చినట్టే తల్లిదండ్రులు ఉండాలి. లేదంటే, ఇంట్లో పెద్ద గొడవ. రెండు విషయాల్లో మరీ సమస్య పెద్దదిగా కనిపిస్తోంది. ‘ఒకటి ఫోన్ వాడకం, రెండవది చదువుకోమని చెప్పడం.’ ఈ రెండింటిలోనూ పిల్లలు అతిగా స్పందిస్తున్నారు.
పిల్లలకు ఇచ్చింది సమయాన్నే..!
నాకు అమ్మాయి, అబ్బాయి ఇద్దరు సంతానం. వారిని మూడో క్లాస్ నుంచి ఒంటరిగా పనులు చేసుకోవడం, బయటకు వెళ్లిరావడం, వారికి కావల్సినవి వారే కొని తెచ్చుకోవడం వంటివి అలవాటు చేస్తూ వచ్చాను. దీని వల్ల పై చదువుల సమయంలో మాకు దూరంగా ఉన్నా పిల్లలు ఇబ్బందులు పడలేదు.
వారికి స్వేచ్ఛగా ఉండే అవకాశం ఇస్తూనే, క్రమశిక్షణనూ అలవాటు చేశాను. పిల్లలు పెద్దవుతున్న కొద్దీ ఇంటి విషయాలలో కూడా వారి అభిప్రాయం తీసుకునేదానిని. అది నచ్చకపోయినా కొట్టిపడేసిన దాన్ని కాదు. వాళ్లు చెప్పినవన్నీ అనుకూలంగా, వాడదగినవిగా ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు వెంటనే ‘నో’ చెప్పకుండా ఎలా చేస్తే బాగుంటుందో కాస్త సమయం తీసుకునైనా చెప్పేదాన్ని. దీని వల్ల పిల్లలు అర్థం చేసుకునేవారు.
అర్థం చేసుకోవడమే ముఖ్యం
పిల్లలు చదువులో టాపర్స్‌గా ఉన్నారా, గ్రేడ్స్ వస్తున్నాయా అని చూసేదాన్ని కాదు. వారు ఆ చదువును ఎంతబాగా అర్థం చేసుకోగలుగుతున్నారు.. అనేదానిపై దృష్టి పెట్టమనేదాన్ని. స్కూల్ నుంచి వచ్చాక ‘టీచర్లు ఏం చెప్పారు, ఏం విన్నావు, ఏం నేర్చుకున్నావు, స్కూల్లో ఏం జరిగింది?’ అని అడిగేదాన్ని. వాళ్లు చెప్పేదంతా వినేదాన్ని. అంతేకానీ, హోమ్‌వర్క్, క్లాస్ వర్క్, మార్కుల గురించి అడిగేదాన్ని కాదు.
మా పిల్లలు చదువుకునే టైమ్‌లో కంప్యూటర్స్ బూమ్‌లో ఉంది. కానీ, మా అమ్మాయి ఆర్కిటెక్చర్ చేస్తానంది. సరే అన్నాను. మంచి ర్యాంక్ తెచ్చుకుంది. మా అబ్బాయిని సైన్స్ వైపుగా వెళతావా అని అడిగాను. లేదు ఇంజనీరింగ్ అన్నాడు. వారి ఇష్టాలను కాదనలేదు. వాళ్ల మాటకు మేం విలువ ఇచ్చాం. వాళ్లూ మా మాటలకు విలువ ఇచ్చారు. లేట్ నైట్స్ బయట తిరగడం మాత్రం ఒప్పుకునేదాన్ని కాదు. రాత్రి సమయాల్లో బయట ఉంటే సమస్యలు ఏ విధంగా వస్తాయో వివరించేదాన్ని.
నేను మీతో ఉన్నాను అనే భరోసా!
మా బాబుకి బిట్స్‌లో సీట్ వచ్చేముందు కొంతకాలం హాస్టల్లో ఉండేవాడు. అక్కడ ఉన్నన్ని రోజులూ ఏదో తెలియని ఆందోళన ఫీలవుతున్నట్టు గమనించాను. దీంతో ఇంటికి తీసుకువచ్చేశాను. ఇంట్లోనే చదువు, టెస్ట్.. జరిగేలా ప్రతిరోజూ ప్లాన్ చేశాం ‘ఏం టెన్షన్ పడకు. ర్యాంకు రాకపోయినా పర్వాలేదు. ఇది కాకపోతే మిగతా చాయిస్‌లు కూడా ఉన్నాయి’ అని చెప్పదాన్ని. నీకు నేను ఉన్నాను అని మోరల్‌గా సపోర్ట్ ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ చూశాను. మా అమ్మాయి పెళ్లయ్యి, అమెరికాలో ఉద్యోగం చేస్తోంది.
వాళ్లకు ఒక బాబు. నాలుగేళ్ల వయసు. బోలెడన్ని ప్రశ్నలు వేస్తుంటాడు. పిల్లలు అడిగే సందేహాలకు ఓపికగా సమాధానాలు చెప్పకపోతే నిరుత్సాహపడిపోతారు. వారి ఆలోచనలు మరోవైపుకు మళ్లుతాయి. తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వదగిన ఆస్తి తగినంత సమయం వారితో గడపడమే. మా అబ్బాయి కూడా విదేశాలలోనే జాబ్ చేస్తున్నాడు. ఇద్దరూ వారి వారి జీవితాల్లో సంతోషంగా ఉన్నారు.’’
∙నిర్మలారెడ్డి
మనం వింటే.. వాళ్లు వింటారు..!
ఈ మధ్య ఒక పదమూడేళ్ల అబ్బాయిని వారి తల్లిదండ్రులు కౌన్సెలింగ్‌కు తీసుకువచ్చారు. ఆ అబ్బాయి ధోరణి ఎలా ఉందంటే, పేరెంట్స్ ఏది చెబితే అది రివర్స్ చేస్తాడు. మొదట ఆ అబ్బాయి అడిగిందల్లా ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత క్రమశిక్షణ పేరుతో కఠినంగా ఉండేవారు. అది కాస్తా బెడిసికొట్టింది. ఆ అబ్బాయితో తల్లిదండ్రులు గడపాల్సిన విధానం, సమయం,.. అన్నీ చెబుతూ కొన్ని సెషన్స్ ఇస్తే కొంతవరకు మార్పు వచ్చింది. పేరెంటింగ్ ఒక్కరోజులో పూర్తయ్యే ప్రక్రియ కాదు. ప్రతిరోజూ వారితో కనెక్టివ్‌గా ఉండాలి.
డబ్బులు ఉన్నాయని అడిగినవన్నీ కొనిస్తే అమ్మనాన్నలు డబ్బు మిషన్లలాగే కనిపిస్తారు. మా పిల్లలకు ఏది అవసరమో అదే కొనేదాన్ని. అవసరం లేనిదాని గురించి చెప్పేదాన్ని. డ్యూటీ టైమ్ అయిపోయి ఇంటికి వచ్చానంటే పిల్లలకే సమయం కేటాయించేదాన్ని. ఇప్పటికీ ప్రతిరోజూ ఫోన్ ద్వారా పిల్లలతో కమ్యూనికేషన్లో ఉంటాను. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఓపెన్ కమ్యూనికేషన్ ఉంటే సమస్యలు వచ్చినా సాల్వ్ చేసుకోవడం సులువు అవుతుంది.
మనం వింటే.. వాళ్లు వింటారు..!
ఈ మధ్య ఒక పదమూడేళ్ల అబ్బాయిని వారి తల్లిదండ్రులు కౌన్సెలింగ్‌కు తీసుకువచ్చారు. ఆ అబ్బాయి ధోరణి ఎలా ఉందంటే, పేరెంట్స్ ఏది చెబితే అది రివర్స్ చేస్తాడు. మొదట ఆ అబ్బాయి అడిగిందల్లా ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత క్రమశిక్షణ పేరుతో కఠినంగా ఉండేవారు. అది కాస్తా బెడిసికొట్టింది. ఆ అబ్బాయితో తల్లిదండ్రులు గడపాల్సిన విధానం, సమయం,.. అన్నీ చెబుతూ కొన్ని సెషన్స్ ఇస్తే కొంతవరకు మార్పు వచ్చింది.
పేరెంటింగ్ ఒక్కరోజులో పూర్తయ్యే ప్రక్రియ కాదు. ప్రతిరోజూ వారితో కనెక్టివ్‌గా ఉండాలి. డబ్బులు ఉన్నాయని అడిగినవన్నీ కొనిస్తే అమ్మనాన్నలు డబ్బు మిషన్లలాగే కనిపిస్తారు. మా పిల్లలకు ఏది అవసరమో అదే కొనేదాన్ని. అవసరం లేనిదాని గురించి చెప్పేదాన్ని. డ్యూటీ టైమ్ అయిపోయి ఇంటికి వచ్చానంటే పిల్లలకే సమయం కేటాయించేదాన్ని. ఇప్పటికీ ప్రతిరోజూ ఫోన్ ద్వారా పిల్లలతో కమ్యూనికేషన్లో ఉంటాను. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఓపెన్ కమ్యూనికేషన్ ఉంటే సమస్యలు వచ్చినా సాల్వ్ చేసుకోవడం సులువు అవుతుంది.
డా.పి.జ్యోతిరాజ, సైకాలజిస్ట్
నిర్మలారెడ్డి
(చదవండి: తల్లిదండ్రులే పిల్లలను కష్టపెడుతున్నారు)
Tags : 1