Breaking News

చెడుకు చెక్‌.. పిల్లల్లో ఈ అయిదు ప్రమాద సంకేతాలు

Published on Sat, 07/19/2025 - 10:48

ఉదయం లేచింది మొదలు ఉరుకుల పరుగులు జీవితాలు. పిల్లలను రెడీ చేసి స్కూళ్లకు పంపించి,  తాము రెడీ అయి ఆఫీసులకు వెళుతుంటారు తల్లిదండ్రులు. ఎలాగూ స్కూల్‌కి పంపిస్తున్నాం కదా...అన్నీ అక్కడ టీచర్లే చూసుకుంటారులే అని పేరెంట్స్, పిల్లల ప్రవర్తనను సరిచేయాల్సింది వారి తల్లిదండ్రులే అని టీచర్లు అనుకోవడం సాధారణంగా జరిగిపోతుంటుంది.  మార్కులు, ర్యాంకులు, గ్రేడులు చూసుకొని సంతృప్తి పడిపోతారు. ‘కానీ, పిల్లలు సరైన దారిలో ఉన్నారా, చెడు స్నేహాల్లో తమను దాటిపోతున్నారా అనేది చూసుకోవాల్సింది తల్లిదండ్రులే. 

బిడ్డ చెడు సహవాసంలో ఉందని చెప్పడానికి ఈ 5 హెచ్చరిక సంకేతాలు విస్మరించవద్దు’ అంటున్నారు చైల్డ్‌ సైకియాట్రిస్ట్‌లు, నిపుణులు. ఈ విషయాల సాయంతో మీరు మీ పిల్లల ప్రవర్తనలో మార్పులను గుర్తించవచ్చు.  సకాలంలో వాటిని సరిదిద్దడానికి సరైన చర్యలు తీసుకోవచ్చు. 

ఉపాధ్యాయుల గురించి ఎప్పుడూ చెడ్డగా మాట్లాడటం...: ఒక పిల్లవాడు తన ఉపాధ్యాయుల గురించి పదే పదే చెడుగా మాట్లాడటం లేదా తక్కువ చేసి మాట్లాడటం ప్రారంభించినట్లయితే, అది మీ బిడ్డ తప్పుడు సహవాసంలో ఉన్నాడనడానికి సంకేతంగా గుర్తించాలి. 

స్నేహితుడి తప్పులకు వత్తాసు పలకడం: ఒక పిల్లవాడు తన స్నేహితుడి చెడు ప్రవర్తనకు మద్దతు ఇవ్వడం ప్రారంభిస్తే, అది ఆ పిల్లవాడు ఆ చెడ్డ స్నేహితుడి ప్రభావానికి లోనయ్యా డనడానికి స్పష్టమైన సంకేతంగా గ్రహించాలి. దీనిని తల్లిదండ్రులు హెచ్చరికగా తీసుకోవడం మంచిది.

తరచూ ప్రతికూల చర్చలు : మీ బిడ్డ అకస్మాత్తుగా తన గురించి తాను ప్రతికూలంగా మాట్లాడటం ప్రారంభిస్తే లేదా తక్కువ ఆత్మవిశ్వాసం ఉన్నట్లు అనిపిస్తే, అది అతని తోటివారి ప్రతికూల ప్రభావాల వల్ల కావచ్చని గుర్తించాలి.

రహస్యంగా మాట్లాడటం లేదా చాటింగ్‌...: ఒక పిల్లవాడు అకస్మాత్తుగా తన ఫోన్‌ను దాచి స్నేహితులతో మాట్లాడటం లేదా చాటింగ్‌ చేస్తున్నప్పుడు తన మొబైల్‌ స్క్రీన్‌ను దాచుకోవడం ప్రారంభిస్తే, తల్లిదండ్రులు అలెర్ట్‌గా ఉండాలి.

చదువు నుండి పారిపోవడం...: మీ బిడ్డ ఉన్నట్టుండి స్కూల్‌కి వెళ్లనని మొరాయించడం లేదా హోంవర్క్‌ చేయకుండా మొండికి వేయడం, స్కూల్‌ ఎగ్గొట్టడానికి రకరకాల సాకులు చెప్పడం లేదా చదువుపై ఆసక్తి చూపక΄ోవడం.. వంటివి గమనిస్తే అది సోమరితనం వల్ల మాత్రమే కాదు, చెడు సహవాసం వల్ల కూడా కావచ్చు అని గ్రహించాలి. 

పిల్లల ప్రవర్తనలో పై విధమైన మార్పులు గమనిస్తే సకాలంలో తగు చర్యలు తీసుకోవాలి. ఇందుకు స్కూల్‌ టీచర్ల సాయం తీసుకోవడం, నిపుణుల కౌన్సెలింగ్‌తో.. చెడు సావాసాలను గుర్తించి,  పొరపాట్లను నివారించి, సమస్యను చక్కదిద్దవచ్చు.

ఇదీ చదవండి: నో-షుగర్, నో-మిల్క్: 45 కిలోలు తగ్గింది, ఇప్పటికీ కష్టాలే!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)