Breaking News

పానీ పూరీలానే...ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా రెసిపీ వైరల్‌

Published on Tue, 10/07/2025 - 16:10

ప్రముఖ వ్యాపారవేత్త,  RPG ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్  హర్ష గోయెంకా (Harsh Goenka) ఆహార ప్రియుడు. తరచుగా సోషల్ మీడియాలో తనకు ఆహారం పట్ల ఉన్న ప్రేమ గురించి పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా  ఆహార ప్రియులకు ఎంతో ఇష్టమైన పానీ పూరీని గుర్తు చేసుకుంటూ ఆసక్తికర రెసిపీని పంచుకున్నారు. అందులోనూ తనకిష్టమైన ట్రీట్‌లలో ఒకదాని రెసిపీని పంచుకోవడం విశేషంగా నిలిచింది.

>

పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తాజా ఇన్‌స్టా పోస్ట్‌లో ఆయనలోని  భోజన ప్రియుడు మరోసారి మనకు దర్శనమిస్తాడు. వ్యాపారానికిమించి, తరచూ ఆసక్తికర విషయాలు, వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ  అభిమానులతో టచ్‌లో ఉండటం  హర్ష గోయెంకాకు బాగా అలవాటు.  పాపులర్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ (Street Food) పానీ పూరీ (Pani Puri)ని గుర్తు చేస్తుందీ అంటూ ఆలూ రెసిపీ షేర్‌ చేశారు. అదే బంగాళాదుంపలను ఉపయోగించి తయారుచేసిన క్రిస్పీ ఫ్రైడ్ ఫ్రెంచ్ డెలికేసీ రెసిపీ.

విదేశాలకు వెళ్ళినప్పుడు పోమ్మెస్ సౌఫ్లీస్ అనే ఫ్రెంచ్ ఫ్రైడ్ బంగాళాదుంప వంటకాన్ని ఆస్వాదించినట్టు హర్ష గోయెంకా   తెలిపారు.  ఈ క్రిస్పీ డిలైట్‌ను పానీ పూరితో పోల్చారు. "ఇవి మన పానీపూరీల్లాగే ఉంటాయి. కానీ ఎవరూ వాటిని ఎందుకు తయారు చేయరా.. అని నాకు ఆశ్చర్యంగా ఉంటుంది’’ అన్నారు. టేస్ట్‌ పానీ పూరీలా ఉండకపోవచ్చు..కానీ గాలిమాత్రం ఉంటుంది అంటూ చమత్కరించారు.

చదవండి: 84 ఏళ్ల వయసులో తల్లి, కూతురి వయసు మాత్రం అడక్కండి: గుర్తుపట్టారా!

ఇంతకీ దీని రెసిపీ ఏంటంటే..
లండన్ లేదా పారిస్‌లో  హర్ష గోయెంకాకు ఇష్టమైన వాటిలో ఒకటి - పొమ్మెస్ సౌఫిల్స్.
ఎలా తయారు చేయాలి:
బంగాళాదుంపలను చాలా సన్నగా ముక్కలుగా కట్‌ చేసిన బాగా ఆరబెట్టాలి..
మీడియం-వేడి నూనెలో (150°C) తేలికగా సెట్ అయ్యే వరకు ఒకసారి వేయించాలి.
వాటిని నూనె నుండి బయటకు తీసిన తర్వాత, కొద్దిసేపు  ఆరనివ్వాలి.
మళ్ళీ వేడి నూనెలో (190°C) వేయించాలి . దీంతో అవి అద్భుతంగా ఉబ్బుతాయి!
  వీటిపై సాల్ట్‌ చల్లుకొని  వేడిగా  ఆరగించడమే. 
దీనిపై నెటిజన్ల కామెంట్లతో ఈ పోస్ట్‌  వైరల్‌గా మారింది. 

ఇదీ చదవండి : రెండేళ్ల శ్రమ ఒక మినిట్‌లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్‌వీడియో 

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)