Breaking News

నలుగురితో కలిసే వ్యక్తా కాదా? ఇట్టే చెప్పేయొచ్చు ఇలా..!

Published on Wed, 06/25/2025 - 15:54

ఒకే చిత్రాన్ని ఒక్కో వ్యక్తి ఒక్కో దృష్టితో చూస్తాడట. అందరికి ఆ చిత్రం ఒకేలా అనిపించదు. చెప్పాలంటే అందరికీ ఒకటే ఎలా నచ్చదో అలానే మన దృష్టి కోణాల్లో కూడా చాలా భేదాలు ఉంటాయట. అవే మన భావోద్వేగ స్థితిని, ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తాయని చెబుతున్నారు మానసిక నిపుణులు. శాస్త్రీయంగా ఇవి కచ్చితమైనవి అనేందుకు ఆధారాలు లేకపోయినా..కొన్ని అధ్యయనాల్లో ఆ ఫలితాలు చాలా ఆలోచింపచేసేలా ఉన్నాయి. పైగా ఇలాంటి ఫజిల్‌ చిత్రాలు సోషల్‌ మీడియాలో ప్రజాదరణ పొందడమే కాకుండా ఆకర్షణీయంగానూ, ఉత్సుకతను రేకెత్తించేలా ఉంటాయి. అలాంటి ఒక చిత్రం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇది మీరు ఎలాంటి స్వభావం గలవారో ఇట్టే చెప్పేస్తుందట. మరీ ఆ చిత్రం చెప్పే చిత్తరువు స్వభావం ఏంటో చూద్దామా..!.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో మొట్టమొదటిసారిగా ఏం చూశారో చెప్పండి దాన్ని బట్టి అవతలి వారి స్వభావం ఈజీగా తెలుసుకోవచ్చు. 

 

మొదట జీబ్రాలు చూసినట్లయితే..
మొదటగా జీబ్రాలనే చూస్తే..మీరు బహిర్ముఖుడని అర్థం. దీని అర్థం అందరితో స్నేహపూర్వకంగా ఉంటారని. ప్రజలతో మమేకం కావడానికే ఇష్టపడతారు. అంతేగాదు మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో ఉత్సాహంగా గడిపేందుకు ఎక్కువగా ఇష్టపడతారని అర్థం. అలాగే నచ్చిన హబీలో ముందుకు సాగడం, పార్టీలు చేసుకోవడం, కొత్త వ్యక్తులను కలవడం, స్నేహితులను చేసుకోవడం, వారితో గడిపే స్వభావం కలవారని చెబుతుందట. 

మొదట సింహాన్ని చూసినట్లయితే
అలాంటి వారు అంతర్ముఖులని అర్థం. ప్రజలతో అంత తేలిగ్గా కలవరు. వాళ్లు ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్న వ్యక్తులతోనే కలిసి మెలుగుతారు. ఇంట్లోనే బంధువులు లేదా సన్నిహితులతో కలిసి సినిమాలు చూడటం, చదవడం, యోగా వంటి కార్యకలాపాల్లో పాల్గొనడం వంటివి చేస్తారు. ఈ వ్యక్తులు ఇతర వ్యక్తుల సహవాసాన్ని అంతగా కోరుకోరట.

సరదాగా ఉండే ఈ దృశ్య పజిల్‌ మనకు అవతలి వ్యక్తుల స్వభావాన్ని ఇట్టే పసిగట్టేలా చేయడమే గాక అలాంటి వాళ్లతో ఎలా నడుచుకోవాలో తెలియజేస్తుంది కదూ..!. ఇంకెందుకు ఆలస్యం మీక్కూడా ఏం కనిపిస్తుందో చెక్‌చేసుకోండి మరి..!.

(చదవండి: ఇ​జ్రాయెల్‌ ప్రధానికి భారత్‌ అంటే ఇంత ఇష్టమా..! ఇక్కడ ఫుడ్‌ తోపాటు అమితాబ్‌తో..)

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)