Breaking News

ఓపెన్‌ జిమ్‌: కసరత్తు.. ఆరోగ్యం మా సొత్తు!

Published on Mon, 04/28/2025 - 09:52

జీవనశైలి మారింది. మారుతున్న కాలంతో పాటు జీవనంలో వేగం పెరిగింది. దీంతో అలసట, ఒత్తిడి అధికమైంది. ఆహార పానీయాలు తీసుకోవడంలో కూడా ఎన్నో మార్పులొచ్చాయి.   దీంతో ఎన్నో వ్యాధుల బారిన పడాల్సిన పరిస్థితి. వాటిని అధిగమించడానికి వ్యాయామం తప్పనిసరైంది. అందుకు ఓపెన్‌ జిమ్‌లు ఎంతో ఉపయోగపడుతున్నాయి.  

అక్కన్నపేట(హుస్నాబాద్‌): జిమ్‌లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేయకుండా గ్రామాల్లోనే ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రత్యేక చొరవతో దాదాపు అన్ని గ్రామాల్లో ఓపెన్‌ జిమ్‌లను నిర్మించారు. వాటి నిర్మాణానికి సుమారు రూ.5లక్షలు కేటాయించారు. మండలంలో 31 గ్రామాలు ఉండగా ఇటీవల మరో ఆరు గ్రామాలు ఏర్పడ్డాయి. దీంతో ప్రస్తుతం మొత్తం 37 గ్రామాలు ఉన్నాయి.        

అందులో సగానికిపైగా గ్రామాల్లో ఓపెన్‌ జిమ్‌లను ఏర్పాటు చేశారు. జిమ్‌లను ఉదయం, సాయంత్రం వినియోగించుకొంటున్నామని,  ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిమ్‌ల ఏర్పాటు విషయంలో చొరవ తీసుకొన్న మంత్రి పొన్నంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని స్థానికులు చెప్పారు.  

కొత్త అనుభూతి 
బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన జిమ్‌లలో కసరత్తు చేయడం కొత్త అనుభూతిని కలిగిస్తుందని పర్యావరణ వేత్తలు అంటున్నారు. ప్రైవేటు జిమ్‌లకు వెళ్లే స్తోమతలేని పేద, మధ్యతరగతి ప్రజలకు ఈ జిమ్‌లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ప్రతి రోజు వ్యాయామం చేయడంతో ఫిట్‌నెస్‌తో పాటు ఆరోగ్యం కూడా సొంతం చేసుకొంటున్నారు. 
  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)