Breaking News

'చాలా ఏళ్లుగా ఆ అలవాటు ఉంది'! వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌పై జైశంకర్‌ మాట

Published on Fri, 05/30/2025 - 13:59

భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్‌ ఎస్. జైశంకర్‌కు ఉన్న కుటుంబ నేపథ్యం ఏ మంత్రికీ ఉండకపోవచ్చు. ఆయన తండ్రి కే.సుబ్రహ్మణ్యం.. 1951 ఐఏఎస్ బ్యాచ్ టాపర్. ఆయన్ను చాలామంది కె.ఎస్ అని, సుబ్బు అని పిలుస్తుంటారు.  అంతేగాదు భారత దౌత్య రంగానికి గురువు అని కూడా పిలుస్తారు. ఆ నేపథ్యం నుంచి వచ్చిన  జై శంకర్‌ కూడా అంతే చురుకుగా ఉంటూ.. దూకుడుతో నిర్ణయాలు తీసుకుని అంద‍ర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. మరి అలాంటి వ్యక్తి జీవనశైలి ఎలా ఉంటుందో తెలుసా?.. 

వృత్తిపరంగా అత్యంత బిజీగా ఉండే జైశంకర్‌ రోజు తెల్లవారుజామున రెండు గంటల నుంచే మొదలైపోతుందట. ఎందుకంటే వివిధ దేశాలకు సంబంధించిన అంతర్జాతీయ కాల్స్‌, వార్తపత్రికలు సమాచారం తెలుసుకోవడం, ఆ రోజు ఉన్న ఈవెంట్లు, హాజరుకావల్సిన కార్యక్రమాలు షెడ్యూల్‌ చూసుకోడం వంటి గందరగోళంతో ఉంటుందట. అంత ఫుల్‌బిజీలో కూడా తనకున్న ఒక్క అలవాటే తన ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందట. అదే తన ఆరోగ్య రహస్యమని అంటున్నారు జైశంకర్‌. 

ఎప్పుడే ఏ దేశంలో ఉంటామన్నది తెలియని పరిస్థతి కాబట్టి కచ్చితంగా వ్యాయామాలు, యోగా వంటివి చేయడం కుదరదని చెబుతున్నారు. అందువల్ల ఆయన దినచర్య తానున్న ప్రాంతాన్ని బట్టి మారిపోతుంటుందట. సాధారణ రోజుల్లో మాత్రం చాలామటుకు తన రోజు.. ఉదయం ఆరుగంటల నుంచి మొదలవ్వుతుందట. 

అయితే కచ్చితంగా ఉదయం స్క్వాష్ గేమ్‌ ఆడతారట. ఎంత బిజీ షెడ్యూల్‌ అయినా..ఓ అరగంట అది ఆడాల్సిందేనని చెబుతున్నారు. అలాగే తప భార్యతో కలిసి ఓ అరగంట వాక్‌ చేస్తానన్నారు. ఎందుకంటే తన భార్యతో స్పెండ్‌ చేసేందుకు అదే తనకు తగిన సమయమని చెబుతున్నారు. అదీగాక నిత్యం పర్యటించే జై శంకర్‌కు  కుటుంబంతో గడపడం, ఫిట్‌నెస్‌పై దృష్టిసారించడం అనేవి అత్యంత సవాలుతో కూడినవి. 

కాబట్టి తన లైఫ్‌స్టైల్‌కి అనుగుణంగా ఆరోగ్యకరమైన అలవాట్లకు సంబంధించి కనీసం రెండు అలవాట్లను తప్పనిసరిగా తన దినచర్యలో భాగం చేసుకుంటారట. అలాగే కుటుంబంతో గడపటం కోసం..భార్యతో సంభాషిస్తూ చేసే వాకింగ్‌ అనేది కూడా తప్పనిసరి అని అన్నారు. పర్యటనలో లేకపోతే..తన భాగస్వామితో గడపటానికి తప్పనిసరిగా అరగంట సమాయాన్ని కేటాయిస్తానని చెప్పారు. 

అలాగే తన వర్క్‌ లైఫ్‌ ఉదయం 9.30 గంటలకు మొదలవుతుందట. ఇక అక్కడ నుంచి ఉన్నత స్థాయి సమావేశాలు, సమీక్షలు, మంత్రిత్వ శాఖ ఫైళ్లను క్లియర్ చేయడం, పాశ్చాత్య దేశాలతో ఫోన్‌లో దౌత్య సంభాషణలు జరపడం వంటి కార్యక్రమాల్లో మునిగిపోతానని చెప్పారు. ఇక సినిమాలు చూసే ఛాన్సే లేదని అ‍న్నారు. ఎందుకంటే.. రెండు గంటల్లో అయిపోయే సినిమా ఉండదు కదా అని నవ్వేశారు. 

చివరగా ఆయన విదేశాంగ మంత్రిగా వర్క్‌కి సంబంధించి..24/7 అత్యంత బిజీగా ఉండాల్సిన పరిస్థితి అయినప్పటికీ.. వ్యక్తిగత జీవితం, ఆరోగ్యానికి సంబంధించిన ఆ అలవాట్లను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో మిస్‌ అవ్వనని చెప్పారు. అంతేగాదు ఎంత పని గందరగోళంతో ఉన్నా..జీవితాన్ని అందంగా ఓ నిర్షిష్ట పద్ధతిలో నిర్మించుకోవడంలో విఫలమవ్వకూడదని అన్నారు జైశంకర్‌. 

బిజీ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమే కానీ, జీవితాన్ని అందంగా మలుచుకోవడం అన్నది మన చేతుల్లోనే ఉంటుందని తేల్చి చెప్పారు విదేశాంగ మంత్రి జైశంకర్‌. చెప్పాలంటే వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌ అంటే  అసలైన అర్థం మన విదేశాంగ మంత్రి లైఫ్‌స్టైలే కదూ..! సో.. మనం కూడా  పని జీవితం తోపాటు..మన కుటుంబ జీవితానికి, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇద్దాం..ఆనందకరమైన జీవితాన్ని సొంతం చేసుకుందాం.

(చదవండి: మహిళా సైనికులకు ఇన్ని ఆరోగ్య సవాళ్లు ఉంటాయా..? అందుకే ఇజ్రాయెల్‌..)

 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి