Breaking News

వారానికి ఒక్క డోస్.. షుగర్, వెయిట్ అన్నీ కంట్రోల్!

Published on Sun, 06/07/2026 - 13:11

న్యూ ఓర్లీన్స్‌: ఫార్మా రంగంలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమయ్యింది. ఊబకాయం సమస్యతో బాధపడేవారికి సరికొత్త ఆశలు రేకెత్తిస్తూ ప్రముఖ ఫార్మా దిగ్గజం ‘ఎలి లిల్లీ’ ఒక అద్భుతమైన మందును కనుగొంది. శనివారం (జూన్ 6) న్యూ ఓర్లీన్స్‌లో జరిగిన అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ కాన్ఫరెన్స్‌లో కంపెనీ తన తాజా క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను వెల్లడించింది. ‘రెటాట్రుటైడ్’ (Retatrutide) అని పిలిచే ఈ నెక్స్ట్-జనరేషన్ ఊబకాయం డ్రగ్.. ఒక్క బరువు తగ్గించడమే కాకుండా.. ప్రాణాంతక స్లీప్ అప్నియా (నిద్రలో శ్వాస ఆడకపోవడం), తీవ్రమైన మోకాళ్ళ నొప్పులను సైతం సమర్థవంతంగా నివారిస్తుందని పరిశోధనల్లో తేలింది.

మూడో దశ ట్రయల్స్‌లో సంచలన ఫలితాలు
ఎలి లిల్లీ నిర్వహించిన ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ ఫలితాల ప్రకారం.. ఊబకాయంతో బాధపడుతున్న వయోజనులకు వారానికి ఒకసారి ఈ ‘రెటాట్రుటైడ్’ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా, వారిలో తీవ్రమైన అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా సమస్య ఏకంగా 60.6 శాతానికి పైగా తగ్గినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. అంతేకాదు మోకాళ్ళ కీళ్లనొప్పుల తీవ్రతను ఈ డ్రగ్ గరిష్టంగా 73.1 శాతం వరకు తగ్గించిందని వైద్య నిపుణులు తెలిపారు. ఇప్పటికే ఈ సంస్థకు చెందిన ‘జెప్‌బౌండ్’ అనే పాత డ్రగ్‌కు ఈ తరహా చికిత్స కోసం అనుమతులు ఉండగా, ఇప్పుడు ‘రెటాట్రుటైడ్’ మరింత మెరుగైన ఫలితాలను చూపించింది.

ట్రిపుల్ జి ఫార్ములా విశేషాలు
ఈ ప్రయోగాత్మక ఔషధం మానవ శరీరంలో బరువు, మధుమేహాన్ని నియంత్రించే కీలక హార్మోన్లను టార్గెట్ చేస్తుంది. అంతకుముందు జరిగిన అధ్యయనాల్లో ఈ మందు వాడిన రోగులు తమ శరీర బరువులో 28 శాతం వరకు తగ్గడమే కాకుండా, టైప్-2 డయాబెటిస్ బాధితుల్లో రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గినట్లు ఎలి లిల్లీ గతంలోనే వెల్లడించింది.

లాన్సెట్ జర్నల్ నివేదిక - మార్కెట్ పోటీ
ప్రఖ్యాత 'ది లాన్సెట్' జర్నల్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం, ఈ డ్రగ్ అత్యల్ప మోతాదు తీసుకున్న రెండు శాతం మంది డయాబెటిస్ రోగుల్లో గుండె జబ్బులకు సంబంధించిన కొన్ని ప్రతికూల సంఘటనలు నమోదయ్యాయి. అయితే ఇవి నేరుగా ఈ మందు వల్లే సంభవించాయని చెప్పలేమని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన గిరాకీ ఉన్న ఊబకాయం, మధుమేహం మందుల మార్కెట్‌ను శాసించేందుకు ఇండియానా కేంద్రంగా పనిచేసే ఎలి లిల్లీ సంస్థ, డెన్మార్క్‌కు చెందిన నోవో నార్డిస్క్ సంస్థల మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది.

ఇది కూడా చదవండి: వాట్సాప్‌లో ‘బొద్దింకల పార్టీ’: క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)