Breaking News

ప్రవాస భారతీయులకు ఆధార్‌ కార్డ్‌ తప్పనిసరి కాదు!

Published on Wed, 09/09/2026 - 05:43

నేను భారత సంతతి అమెరికా పౌరుడిని. నాకు ఓవర్‌సీస్‌ సిటిజెన్‌ ఆఫ్‌ ఇండియా కార్డు ఉంది. మేము ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఒక ఆస్తిని విక్రయించాలనుకుంటున్నాము. అయితే, ఈ అమ్మకాన్ని పూర్తి చేయడానికి ఆధార్‌ కార్డు తప్పనిసరి అని రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మేము సంప్రదించిన ఒక ఏజెంట్‌ చె΄్పాడు. రిజిస్ట్రార్‌ కూడా అది తప్పనిసరి అని చె΄్పారు. ఈ నేపథ్యంలో సంబంధిత రిజిస్ట్రార్‌ లేదా ఇతర అధికారులకు సమర్పించేందుకు వర్తించే చట్టపరమైన నిబంధనలను స్పష్టంగా తెలియజేయగలరని కోరుతున్నాను. – సుహాస్, అమెరికా (చిత్తూరు)

భారత పౌరులు కానప్పుడు ఆధార్‌ కార్డు మీకెలా వస్తుంది? ఆధార్‌ చట్టంలోని ’resident’ నిర్వచనం ప్రకారం, గత 12 నెలల్లో కనీసం 182 రోజులు భారతదేశంలో నివసించిన వ్యక్తి నివాసకులు/ ’resident’గా పరిగణించబడతారు. కేవలం OCI కార్డు గ్రహీతగా ఉండటం వల్ల ఆధార్‌ కార్డు పొందడం తప్పనిసరి కాదు, మీ కేసులో వీలు కూడా లేదు.

ఫెమా నిబంధనల ప్రకారం OCI కార్డు గ్రహీత భారతదేశంలో (ప్రత్యేక పరిస్థితులలో తప్ప) వ్యవసాయ భూమి, తోటలు లేదా ఫాం హౌస్‌ మినహా ఇతర స్థిరాస్తుల కొనుగోలు; విక్రయాలు చేయవచ్చు. ఈ లావాదేవీకి ఆధార్‌ను తప్పనిసరి పత్రంగా RBI/FEMA నిబంధనలు ఎక్కడా నిర్దేశించలేదు.
భారతదేశంలో ఆస్తిని విక్రయించడానికి ఎన్నారైలకు ఆధార్‌ కార్డు తప్పనిసరి కాదు. ఎన్నారైకి ఏదైనా భారతీయ బ్యాంకులో NRO ఖాతా ఉండటం ముఖ్యం.

అధికారికంగా అవసరమైన–సూచించిన పత్రాలతోపాటు (1) ఆస్తి పత్రాలు – ఆస్తిపై అప్పులు లేవు అని ధ్రువీకరించే Encumbrance Certificarte (EC); (2) గుర్తింపు ధ్రువీకరణ కోసం పాస్‌పోర్టు – పాన్‌ కార్డు వంటివి ఉంటే సరిపోతుంది. అయినప్పటికీ, రిజిస్ట్రార్‌ ఆధార్‌ కార్డు తప్పనిసరిగా సమర్పించాల్సిందే అని పట్టుబడితే, ఆధార్‌ కార్డు సమర్పించనందుకు రిజిస్ట్రేషన్‌ పత్రాన్ని తిరస్కరిస్తూ, అందుకు గల కారణాలను – ఏ చట్టం, నిబంధన, జీఓ Government Order) లేదా ఏ ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా ఆధార్‌ కోరుతున్నారో లిఖిత పూర్వకంగా ఇవ్వాలని కోరండి. రిజిస్ట్రార్‌ లిఖితపూర్వకంగా తిరస్కరణ ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం, ఆ ఉత్తర్వులపై జిల్లా రిజిస్ట్రార్‌ లేదా Inspector General of Registration (IG Registration) ముందు అప్పీల్‌/పిర్యాదు చేసుకొని, ఆధార్‌ లేకుండానే రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసేలా సంబంధిత సబ్‌–రిజిస్ట్రార్‌కు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరవచ్చు. హై కోర్టుకి కూడా వెళ్ళవచ్చు.

- శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది
మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.conకు మెయిల్‌ చేయవచ్చు. 

ఇవీ చదవండి: హిమధీర

Videos

DSC అక్రమాలపై లోకేష్‌ జైలుకు వెళ్లడం పక్కా

సెప్టెంబర్లోనే నా పాదయాత్ర రాసిపెట్టుకోండి హిస్టరీ రిపీట్ చేద్దాం

మిడ్ నైట్ గుస గుసలు.. ఆటను రామ్ ప్రసాద్ మారుస్తున్నాడా?

2019 హిస్టరీ రిపీట్ చేద్దాం.. జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం

సాక్షి సంచలన రిపోర్ట్...బయటపడ్డ మరో వ్యక్తి

భారీగా తగ్గిన బంగారం ధరలు తులం ఎంతంటే?

చిన్న శ్రీను పార్టీ మారడంపై బొత్స హాట్ కామెంట్స్

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

వైఎస్ జగన్ 27% IR ఇస్తామన్నారు, ఇచ్చారు...! నువ్వు ఏం ఇచ్చావ్ బాబు

అసలు గేమ్ ఇదేనా..? అడ్డంగా దొరికిపోయింది.. ఇక నందన చాప్టర్ క్లోజ్!

Photos

+5

ఉదయ బాను నిర్మాతగా.. ‘పంచనామా’ సిరీస్‌ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)