పుట్టగొడుగులను అలానే వండేయొద్దు..! నిపుణుల షాకింగ్‌ విషయాలు

Published on Tue, 07/01/2025 - 16:04

పుట్టగొడుగులు లేదా మష్రూమ్స్‌ రుచికరమే కాకుండా ఆరోగ్యకరం కూడా. అయితే వీటి నుంచి మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందాలనుకుంటే..అలా నేరుగా వండకూడదట. ఈ పుట్టగొడుగులు విటమిన్‌ డీకి సంబంధించిన ఆహారాల్లో ఒకటి. అందువల్ల వాటి నుంచి సమృద్ధిగా విటమిన్‌డీ తోపాటు మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే ఫ్రిజ్‌ నుంచే లేదా మార్కెట్‌ నుంచి కొనుగోలు చేసి నేరుగా వండేయకూడదని పోషకాహార నిపుణుల చెబుతున్నారు. మరి ఎలా వండాలంటే..

పుట్టగొడుగులు(Mushrooms)ను వండడానికి ముందు కొద్దిసేపు ఎండలో వదిలేసి వండితే విటమిన్‌ డీని గణనీయంగా పొందగలుగుతామని చెబుతున్నారు నిపుణుడు. సుమారు 15 నుంచి 30 నిమిషాలు సూర్యకాంతికి గురి చేస్తే విటమిన్‌ డీ స్థాయిలు అనూహ్యంగా పెరుగుతాయని పరిశోధనల్లో కూడా తేలింది. ఎందుకంటే వీటిలో ఎర్గోస్టెరాల్‌ ఉంటుందట. ఇది సూర్యకాంతికి గురవ్వడంతో విటమిన్‌ డీగా మారడాన్ని గుర్తించారట. అందువల్ల ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన విటమిన్‌ డీ కోసం కొద్దిసేపు సూర్యకాంతిలో ఉంచి వండమని సూచిస్తున్నారు. 

కలిగే లాభాలు..

బరువుని అదుపులో ఉంచుతుంది. 

పేగు ఆరోగ్యం, రోగనిరోధక శక్తికి హెల్ప్‌ అవుతుంది

మెదుడు ఆరోగ్యం తోపాటు దృష్టిని మెరుగుపరుస్తుంది. 

కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది

ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది. అలాగే ఎముకల వ్యాధులు దరిచేరవు

ఎలా ఎండబెట్టాలంటే.. 

వీటిని కాంతికి దూరంగా నిల్వచేసినా లేదా ప్రిజ్‌ నుంచి నేరుగా ఉడికించిన ఈ విటమిన్‌ని సమృద్ధిగా పొందలేరట

ఈ పుట్టగొడుగులను ముక్కలుగా కోసి సూర్యకాంతిలో అంటే ఉదయం 10 నుంచి మధ్యాహ్నం రెండు గంటల మధ్యలో ఓ 30 నుంచి 60 నిమిషాలు ఉంచితే చాలట. 

ఏ రోజు వండాలనుకుంటున్నామో ఆ రోజే ఎండలో ఉంచి వండితే మరి మంచిదట

కేవలం 100 గ్రాముల సూర్యరశ్మికి గురైన పుట్టగొడుగులు 10–15 మైక్రోగ్రాముల విటమిన్ డి 2 లభిస్తుందట.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సం‍ప్రదించడం ఉత్తమం

(చదవండి: ఎయిమ్స్‌కు తొలి మహిళా డైరెక్టర్‌ ఆమె..! నాటి ప్రధాని ఇందిరా గాంధీ అంతిమ క్షణాల్లో..)

 

Videos

వచ్చే 4 రోజులు.. వాతావరణ శాఖ హెచ్చరిక

కడప కార్పొరేషన్ పై టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి కక్షసాధింపు

Ambati Rambabu: ఏపీలో ఏడాదిగా శాంతి భద్రతలు క్షీణించిపోయాయి

కూటమి పాలనలో కునారిల్లుతున్న విద్యా వ్యవస్థ

పరవాడ, యలమంచిలిలో కల్తీ మద్యం తయారీ కేంద్రాలు గుర్తింపు

కస్తూర్బా వసతి గృహంలో అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన ఉషాశ్రీచరణ్

ఫారెన్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ YSRCP డిమాండ్

YS Jagan: ఆయన సేవలు చిరస్మరణీయం

పింగళి వెంకయ్యకు వైఎస్ జగన్ నివాళి

National President: బీజేపీకి లేడీ బాస్?

Photos

+5

జిడ్డు ఆముదమే కానీ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా..! (ఫొటోలు)

+5

హైదరాబాద్ : సాయంత్రం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్‌లో చుక్కలు (ఫొటోలు)

+5

ఆషాడమాసం.. విజయవాడ దుర్గ గుడిలో భక్తుల రద్దీ (ఫోటోలు)

+5

ఆరునెలల జ్ఞాపకాలు పంచుకున్న ప్రభాస్‌ సోదరి (ఫోటోలు)

+5

'అఖండ' కోసం తెలుగులో ఎంట్రీ ఇచ్చేసిన నటి హర్షాలీ మల్హోత్రా (ఫోటోలు)

+5

గర్భాలయంలో ఏడడుగుల విగ్రహం.. ఏపీలో ఈ పురాతన ఆలయం గురించి విన్నారా? (చిత్రాలు)

+5

నలుగురు టాప్‌ హీరోయిన్లతో ధనుష్‌ పార్టీ.. ఎందుకో తెలుసా (ఫోటోలు)

+5

చినుకుల్లో డార్జిలింగ్‌ అందాలు.. రా రమ్మని ఆహ్వానించే పచ్చటి కొండ కోనలు!

+5

వైఎస్‌ జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' మూవీ ట్రైలర్‌ లాంచ్ (ఫొటోలు)