పామూ లేదు, దోమా లేదు.. ఎక్కడో తెలుసా?

Published on Mon, 06/23/2025 - 16:33

కాకులు దూరని కారడవులు చీము దూరని చిట్టడవులు గురించి విన్నాం కానీ..భూమిపై దోమలు, పాములు కనిపించని ఏకైక దేశం గురించి ఎపుడైనా విన్నారా?  అవును ఈ భూ ప్రపంచంలో పాములు, దోమలు లేని దేశం ఒకటి ఉంది. కనీసం  జూలో  చూద్దామన్ని కూడా   కనిపించవు. అనేక సరస్సులు, చెరువులు, చిత్తడి నేలలు, దాదాపు 1,300 జంతు జాతులు ఉన్నప్పటికీ, దోమలు అక్కడ మనుగడ సాగించలేకపోయాయి.  మరి భూమిపై దోమలు, పాములు కనిపించని ఏకైక దేశం గురించి తెలుసు కోవాలనుకుంటున్నారా?   అమెరికా, చైనా, జపాన్, టర్కీ, రష్యానో అనుకుంటున్నారా? కానే కాదు. పదండి తెలుసుకుందాం.

ప్రపంచంలో 3,900 కంటే ఎక్కువ రకాల పాములు ఉన్నాయి మరియు భారతదేశంలో 300 కంటే ఎక్కువ జాతుల పాములు కనిపిస్తాయి. వాటిలో ఎక్కువ భాగం విషపూరితం కానివే.  దాదాపు 60 విషపూరిత మైనవి. కొన్ని పాములు కరిస్తే  ప్రాణాపాయం కూడా.  కొన్ని నివేదికల ప్రకారం, ఏ సమయంలోనైనా 110 ట్రిలియన్ దోమలు సజీవంగా ఉన్నాయని అంచనా.

ప్రపంచంలో దోమలు, పాములు కనిపించని ఏకైక దేశం
భారతదేశంలో, కేరళ తీరప్రాంతాలు మొదలు ఢిల్లీ, ముంబై వంటి సందడిగా ఉండే నగరాల వరకు,  చల్లగా ఉండే హిమాచల్, కాశ్మీర్‌లో  కూడా దోమలు సాధారణంగా కనిపిస్తాయి.  కానీ ప్రపంచంలో దోమలు, పాములు కనిపించని ఏకైక దేశం  ఐస్లాండ్. పాములు,ఇతర సరీసృపాలు లేకపోవడానికి కూడా ప్రసిద్ధి చెందింది. అందుకే దీనికి "పాములు లేని దేశం" అనే మరో పేరు కూడా వచ్చింది. అంతేకాదు అనేక సరస్సులు, చెరువులు, చిత్తడి నేలలు , దాదాపు 1,300 జంతు జాతులు ఉన్నప్పటికీ, దోమలు మాత్రం ఇక్కడ జీవించలేవు.  ఐస్‌లాండ్‌లో వేగంగా మారుతున్న వాతావరణం, ఎక్కువశీతల వాతావరణం దీనికి కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.  ఈ వాతావరణం దోమల గుడ్ల అభివృద్ధి ,పొదగడానికి ఆటంకం కలిగిస్తుందట.  అందుకే  దోమలు, పాములు లేని ప్రశాంతమైన, శుభ్రమైన, చల్లగా ఉండే దేశం  ఐస్‌లాండ్‌.

ఎందుకు లేవంటే

దోమలు సాధారణంగా మురుగు నీరు, నిల్వ ఉన్న నీటిలో వృద్ధి చెందుతాయి. దోమల గుడ్లు దోమలగా మారడానికి  స్థిరమైన ఉష్ణోగ్రతలు కూడా అవసరం. అయితే, ఐస్లాండ్‌లో పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. ఐస్‌లాండ్‌ సహజ పారుదల , వేగంగా కదిలే నీటి వ్యవస్థల కారణంగా, దోమల పెంపకానికి అవసరమైన నిలిచిపోయిన నీరు, దోమల పునరుత్పత్తికి అనుమతించేంత కాలం ఉండదు.ఇక్కడి  జనసాంద్రత,  తక్కువ ఉష్ణోగ్రతలు దోమల గుడ్లు లేదా లార్వాల కనుగుణంగా ఉండవు.  దీని వలన దోమలు వృద్ధి చెందడం కష్టమవుతుంది. 

దోమలు తక్కువగా ఉండటానికి ఇతర కారణాలు:
కొన్ని అధ్యయనాల ప్రకారం, ఐస్‌లాండ్‌లోని భూమిలో సల్ఫర్ అధికంగా ఉంటుంది, ఇది దోమల పెరుగుదలను నిరోధిస్తుంది. అలాగే, ఐస్‌లాండ్‌లో దోమల సహజ శత్రువులు కూడా ఉన్నాయి, ఇవి వాటి జనాభాను నియంత్రిస్తాయి ఇస్లాండ్‌లో దోమల్ని పోలిన కీటకాలుంటాయి. కానీ ఇవి కట్టవు, వ్యాధులను వ్యాప్తి చేయవు. అలాగే పాములు నివసించలేని  చల్లని దేశం ఐస్‌లాండ్‌. ఐస్ లాండ్ పేరుకు తగ్గట్టే.. చల్లటి మంచు ప్రదేశంలో వాతావరణం పాముల మనుగడకు ఏమాత్రం అనువుగా ఉండదు.ఈ మంచు ప్రాంతంలో పాములు ఏమాత్రం జీవించలేవు. చుట్టూ నీటితో నిండి ఉండటం కూడా ఒక కారణం. పాములు మహా సముద్రాలను దాటవు. దోమలు అంత దూరం ఎగరవు. అందుకే ఐర్లాండ్‌లో కూడా దోమలు కనిపించ వని చెబుతారు. 

ఇదీ చదవండి: నేచురల్‌ బ్యూటీ లుక్‌ : సీక్రెట్‌ షేర్‌ చేసిన బాలీవుడ్‌ బ్యూటీ
 

కాగా ప్రపంచంలో పాములు లేని ఐర్లాండ్‌,  దేశం న్యూజిలాండ్ , గ్రీన్‌లాండ్‌, అలాస్కా లాంటి ప్రాంతాల్లో కూడా పాములు కనిపించవు. అక్కడి వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమంటారు శాస్త్రవేత్తలు. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)