Breaking News

విషాదం: ఫార్చ్యూనర్ కోసం ‘కరిష్మా’కు భవిష్యత్తే లేకుండా చేశారు

Published on Tue, 04/02/2024 - 12:47

ఆధునిక సమాజంలో కూడా వరకట్న హత్యలు మహిళల జీవితాల్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి.  లక్షలకు లక్షలు కట్నం పోసి పెళ్ళిళ్లు చేసినా  ఆడబిడ్డల తల్లిదండ్రులకు కడుపుకోత తప్పడం లేదు. తాజాగా   ఖరీదైన  కారు, అదనపు కట్నం కోసం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన కలకలం రేపింది. దేశ రాజధాని నగరం న్యూఢిల్లీ నడిబొడ్డున  ఉన్నగ్రేటర్ నోయిడాలో   ఈ విషాదం చోటు చేసుకుంది

టయోటా ఫార్చ్యూనర్ కారు, మరో రూ.21 లక్షల కోసం కోడలు కరిష్మాను దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం రూపింది. బాధితురాలు  కరిష్మా సోదరుడు దీపక్‌ సమాచారం ప్రకారం 2022, డిసెంబరులో  కరిష్మా, వికాస్‌కు వివాహమైంది. పెళ్లి సమయంలో వరుడి కుటుంబానికి  రూ. 11 లక్షల విలువైన బంగారంతో పాటు ఒక SUVని ఇచ్చింది. అయినా వికాస్ కుటుంబం కొన్నేళ్లుగా మరింత  కట్నం డిమాండ్ చేస్తూ వచ్చింది. ఆమెను శారీరకంగా, మానసికంగా  తీవ్ర వేధింపులకు గురిచేసింది. దీనికితోడు  ఆడపిల్ల పుట్టిందనే సాకుతో వారి వేధింపులు మితి మీరి పోయాయి. దీంతో గ్రామ పెద్దల మధ్య రెండు కుటుంబాలు విభేదాలూ  పరిష్కారానికి ప్రయత్నించాయి. దీంతో కరిష్మా కుటుంబం రూ. 10 లక్షలు చెల్లించిన వారి వేధింపులు ఆగలేదు, చివరికి  ఆమెను పొట్టన బెట్టుకున్నారని దీపక్ ఆరోపించాడు.

ఈ మేరకు కరిష్మా సోదరుడు దీపక్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో,  తన భర్త వికాస్‌, అతని తల్లిదండ్రులు , తోబుట్టువులు తనను కొట్టారని  వాపోయిందని  తెలిపారు. ఏమైందో తెలుసుకుందామని ఆమె ఇంటికి చేరుకునే సరికే ఆమె శవమై కనిపించిందని ఆరోపించాడు.   దీపక్‌ ఫిర్యాదు మేరకు వికాస్, అతని తండ్రి సోంపాల్ భాటి, అతని తల్లి రాకేష్, సోదరి రింకీ, సోదరులు సునీల్, అనిల్‌లపై వరకట్న హత్య కేసు నమోదైంది. వికాస్‌,   తండ్రి అరెస్ట్‌  కాగా మిగిలినవారు పరారీలోఉన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)