Breaking News

పెళ్లి ఘనంగా జరిగింది... కానీ వధూవరులు లేరు!

Published on Thu, 07/10/2025 - 10:14

వధూవరులు లేని పెళ్లి గురించి విన్నారా?  అసలు అలాంటి పెళ్లి అనేది ఒకటి ఉంటుందని ఎప్పుడైనా అనుకున్నారా!సూటిగా మ్యాటర్‌లోకి వస్తే... ‘ఫేక్‌ వెడ్డింగ్‌’ అనేది యువతరంలో ఒక ట్రెండ్‌గా మారింది. 

మెట్రో సిటీస్‌లో ఎక్కువగా జరిగే ఈ ఉత్తుత్తి వివాహ వేడుకల్లో బ్యాండ్‌ బాజాలు ఉంటాయి. అతిథులు ఉంటారు. ఘన స్వాగతాలు ఉంటాయి. దండలు మార్చుకోవడాలు (మాక్‌) ఉంటాయి. పురోహితుడి వేదమంత్రాలు ఉంటాయి.అయితే వధూవరులు మాత్రం ఉండరు.

ఢిల్లీ, బెంగళూరు, పుణేలలో ఈ ట్రెండ్‌ ఊపు అందుకుంటుంది. కాలేజి క్యాంపస్‌లలో, రూఫ్‌టాప్‌ బార్‌లలో ఈ వేడుకలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ ఫేక్‌ పెళ్లి వేడుకలకు ఉచిత ప్రవేశాలు ఉండవు. అయిదు వందల నుంచి మూడు వేల వరకు ప్రవేశ రుసుము ఉంటుంది.

సోషల్‌ మీడియాలో కంటెంట్‌ క్రియేషన్‌ కోసం ఈ ఫేక్‌ వెడ్డింగ్‌ ట్రెండ్‌ బాగా ఉపయోగపడుతుంది. విశేషం ఏమిటంటే ఈ లోకల్‌ ట్రెండ్‌ కాస్త దేశ సరిహద్దులు దాటింది. అమెరికాలోని కార్నెల్‌ యూనివర్శిటీలో ఫేక్‌ వెడ్డింగ్‌ ఈవెంట్‌ రెండు రోజుల పాటు ఘనంగా జరిగింది. ఫేక్‌ వెడ్డింగ్‌ ట్రెండ్‌పై సోషల్‌ మీడియాలో భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ‘ఆహా’ అని కొందరు ఆకాశానికి ఎత్తుతుండగా...‘పిదపకాలం పిదప బుద్ధులు’ అని కొందరు విమర్శలు కురిపిస్తున్నారు.
 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)