Breaking News

అనంత్‌ అంబానీ హల్దీ వేడుక: 150 ఏళ్ల నాటి హైదరాబాదీ వస్త్రధారణలో నీతా..!

Published on Tue, 07/09/2024 - 16:30

ముఖేశ్‌ అంబానీ నీతాల చిన్న కుమారుడు అనంత్‌ రాధికల వివాహ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సంగీత్‌ కార్యక్రమంలో అంబానీ కుటుంబ సభ్యుల వస్త్రధారణ, నగలు నెట్టింట ట్రెండ్‌ అయ్యాయి. సోమవారం జరిగిన హల్దీ వేడుకలో నీతా, శ్లోకామెహతా, ఇషా తమదైన డిజైనర్‌వేర్‌ దుస్తులతో మెరిశారు. ఇషా,శ్లోకా రంగురంగుల లెహంగాలతో అలరించగా..నీతా వారిద్దర్ని తలదన్నేలా సరికొత్త లుక్‌లో కనిపించారు. అదికూడా మన హైదరాబాద్‌కు చెందిన 150 ఏళ్ల చౌగోషియ సంప్రదాయ దుస్తులతో తళుక్కుమన్నారు. ఇది అత్యంత అరుదైన హైదరాబాద్‌ కుర్తా. 

దీనికి ఖాదా దుప్పటా చీర మాదిరిగా అతిపెద్దగా వస్తుంది. చెప్పాలంటే 150 ఏళ్ల నాటి దుస్తుల శైలి. హైదరాబాదీ ముస్లీం మహిళలు తమ నికాహ్‌ లేదా వివాహ వేడుకల సమయంలో ఈవిధమైన దుస్తులను ధరిస్తారు. దీని మూలాలు 17వ శతాబ్దంలో మొఘల్‌ శకంలో ఉద్భవించాయి. ఈ చారిత్రాత్మక సంప్రదాయాన్ని హైదరాబాద్‌లో రాజవంశస్థులైన రాణి, బేగంలు అనుసరించేవారు. అలనాటి సంప్రదాయ వస్త్రధారణ శైలి ఫ్యాషన్‌ నుంచి బయటపడదని మరోసారి తేటతెల్లమయ్యింది. ఏళ్ల నాటి ముస్లిం రాణుల సంప్రదాయ వస్త్రధారణతో సరికొత్త ట్రెండ్‌ని సెట్‌ చేసింది నీతా. 

అందుకు తగ్గట్టు అద్భుతమైన ఆభరణాలను ఎంచుకున్నారు. ముఖ్యంగా ఆమె చెవులకు ధరించిన కమ్మలు మంత్రముగ్దుల్ని చేసేలా ఉండగా, ఆ డిజైనర్‌ వేర్‌కి మ్యాచింగ్‌గా ధరించిన బ్రాస్‌లెట్‌, బిందీ తదితరాలన్ని ఆమె రూపాన్ని మరింత అద్భుతంగా కనిపించేలా చేశాయి. చివరిగా స్టైలిష్‌ స్ట్రాపీ హీల్స్‌తో తన రాణి మాదిరి లుక్‌ని తెప్పించింది. పైగా ముఖానికి లైట్‌ మేకప్‌ని ఎంచుకున్నారు. మొత్తం ఈ హల్దీ వేడుకలో ఆమె ఏళ్ల నాటి సంప్రదాయాన్ని సరికొత్తగా గుర్తు చేశారు ఆమె. ముఖ్యంగా మన హైదరాబాదీ సంప్రదాయన్ని అంబానీలు అనుసరించడం విశేషం. 

 

(చదవండి: అనంత్‌ రాధికల హల్దీ వేడుక: కలర్‌ఫుల్‌ లెహంగాలో శ్లోకా, ఇషా..!)
 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)