Breaking News

Nita Ambani: కోడలికి గిఫ్ట్‌గా కోట్ల విలువైన 'ఖాందానీ హార్‌'! ప్రత్యేకత ఇదే

Published on Tue, 01/28/2025 - 10:23

కోట్లకు పడగలెత్తితే..ఆ కుంటుంబాల్లో ఇచ్చే బహుమతులు, కానుకలు వార్తల్లో నిలుస్తాయి. డబ్బుంటే ఆ రేంజ్‌కి తగ్గ బహుమతులతో ప్రేమను కురిపిస్తారు. బడా వ్యక్తుల మధ్య ప్రేమ కూడా అత్యంత విలాసవంతంగా ఉంటుంది. అలాంటి కోవలో మొదటి స్థానంలో నిలిచేది అంబానీల కుటుంబమే. ఇటీవల ​కాలంలో ఆ ఇంట జరిగిన విలాసవంతమైన వివాహ వేడుకలే అందుకు నిదర్శనం. గతేడాది చిన్న కుమారుడు అనంత్‌ రాధికల పెళ్లి వేడుక ఎంత విలాసవంతంగా జరిగిందో తెలిసిందే. అదీగాక చిన్న కోడలు రాధికా మర్చంట్‌కి అంబానీ కుటుంబం ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్‌లు కూడా హైలెట్‌గానే నిలిచాయి. తాజాగా నీతా అంబానీ తన అందమైన కోడలు రాధికాకు మరో అద్భుతమైన నెక్లెస్‌ని కానుకగా ఇచ్చింది. అది వారి కుటుంబ వారసత్వానికి సంబంధించిన నగ అట. మరీ ఆ నెక్లెస్‌ విశేషాలెంటో చూద్దామా..!

అంబానీలు కుటుంబ సంప్రదాయాలకు గొప్ప ప్రాముఖ్యతను ఇస్తారు. అందులో భాగంగానే తమ వారసత్వాన్ని సూచించే విలువైన వస్తువులను వారి కోడళ్లకు బహుమతులుగా ఇస్తుంటారు. అలానే చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ భార్య రాధిక మర్చంట్‌(Radhika Merchant)కి పచ్చలు, వజ్రాలతో పొదిగిన 'ఖందానీ హార్‌(khandani haar)'ని బహుమతిగా ఇచ్చారట నీతా అంబానీ(Nita Ambani ). 

దీని ఖరీదు రూ. 1.8 కోట్లు పైనే ఉంటుందట. ఈ నెక్లెస్‌ అంబానీల కుటుంబ వారసత్వం, భావోద్వేగాలతో ముడిపడి ఉన్న విలువైన నగ అట.  నీతా ఇంతకు మునుపు కూడా ఇలానే ముత్యాలు, వజ్రాలు పొదిగిన ఖరీదైన చోకర్‌ని బహుమతిగా ఇచ్చారు. నిజానికి కుటుంబ బంధంతో ముడిపడి ఉన్న నగలు విలువ వెలకట్టలేం. 

కాగా, నీతా ఇలా తన పెద్ద కోడలు శ్లోకా మెహతాకు కూడా అత్యంత ఖరీదైన మౌవాద్ ఎల్'ఇన్‌కంపారబుల్ నెక్‌పీస్ నగని బహుమతిగా ఇచ్చింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్రాలతో డిజైన్‌ చేసిన నగ ఇది. ఇలాంటి విలాసవంతమైన బహుమతులతో అంబానీ కుటుంబ సంప్రదాయాలు, వైభవం ఒకదానికొకటి గట్టిగా ముడిపడి ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.

(చదవండి: ఎవరీ విశ్వనాథ్‌ కార్తికే..? జస్ట్‌ 16 ఏళ్లకే అరుదైన ఘనత సాధించాడు!)

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)