Breaking News

వజ్రాల నెక్లెస్‌, బెనారస్‌ సిల్క్ చీరలో నీతా అంబానీ స్టన్నింగ్‌ లుక్‌..!

Published on Fri, 05/02/2025 - 14:37

నీతా అంబానీ వ్యాపారవేత్తగా, ఫ్యాషన్‌ ఐకాన్‌గా తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటారు. ఎప్పటికప్పడూ సరికొత్త లుక్‌తో అందర్నీ ఆశ్యర్యపరుస్తుంటారు. మరోసారి తాజాగా అలాంటి మెస్మరైజ్‌ లుక్‌తో మెరిశారు. ఆ విశేషాలేంటో చూద్దామా..!.

నీతా కేవలం వ్యాపార దిగ్గజం మాత్రమే కాదు, భారతదేశ గొప్ప హస్తకళను ప్రదర్శించే ఫ్యాషన్‌ ఐకాన్‌. ఆమె సదా విశాలమైన బంగారు అంచులతో కూడిన చీరలతో మన సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంటారు . కేవలం ప్రతిభాపాటవాలే కాదు, అప్పడప్పుడూ మన డ్రెస్‌ సెన్స్‌ కూడా మన అభివృద్ధికి తోడ్పడుతుందని తన స్టైలిష్ ‌ఫ్యాషన్‌వేర్‌లతో చెబుతూనే ఉంటారామె. ఈసారి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన WAVES 2025 సమ్మిట్‌లో అద్బుతమైన లుక్‌తో ఆకర్షించారు. 

చీరలంటే అమితంగా ఇష్టపడే నీతాని ఈ వేడుకలో బెనారస్‌ సిల్క్‌ చీరలో తళుక్కుమన్నారు. సంక్లిష్టమైన బహుళ వర్ణ పూల ఎంబ్రాయిడరీ డిజైన్‌తో చీర హైలెట్‌గా నిలిచింది. ఆ చీర లుక్‌కి సరిపోయే మ్యాచింగ్‌ బ్లౌజ్‌ జత చేశారు. ఆ చీరకు తగ్గట్టు స్టేట్మెంట్ డైమండ్ స్టడ్ చెవిపోగులు, ప్రకాశవంతమైన ఎరుపు మాణిక్యాలతో పొదగబడిన డైమండ్ నెక్లెస్‌తో ఆకాశంలో మెరిసే నక్షత్రంలా కాంతివంతమైన లుక్‌లో కనిపించారామె. 

అందుకు తగ్గ మేకప్‌, స్టైలిష్‌ హెయిర్‌ స్లైల్‌తో రాజరికానికి అద్దం పట్టేలా ఆమె ఆహార్యం అదిరిపోయింది. కాగా, వేవ్స్‌ 2025(WAVES 2025)  వరల్డ్ ఆడియో విజువల్ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ ఈ నెల మే 1 నుంచి 4 వరకు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ఈ కార్యక్రమంలో పరిశ్రమ నాయకులు, క్రియేటర్లు, విధాన రూపకర్తలతో సహా 90కి పైగా దేశాల నుంచి సుమారు పదివేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారు.

 

(చదవండి: భారత్‌.. నాకెన్నో పాఠాలు నేర్పింది.. కానీ ఇక్కడే ఉండలేను కదా!’)

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)