Breaking News

ఎవరీమె? ఆమె స్పీచ్‌కి..పార్లమెంటే దద్దరిల్లింది!

Published on Fri, 01/05/2024 - 16:46

పార్లమెంట్‌లో ఒక మహిళా రాజకీయవేత్త అందర్నీ ఆశ్చర్యపరిచేలా శక్తిమంతంగా తన గళం వినిపించింది. అదికూడా స్థానిక భాషల కోసం పార్లమెంట్‌లో  చాలా ఉద్వేగభరితంగా మాట్లాడటం సంచలనంగా మారింది. చిన్న వయసులోనే పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎన్నికవ్వడమే గాక మాతృ భాషలో పార్లమెంటే దద్దరిల్లేలా మాట్లాడింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఎవరీమె? దేని గురించి అంతలా శివంగిలా మాట్లాడింది. 

ఈ ఘటన న్యూజిలాండ్‌లో చోటు చేసకుంది. ఆక్లాండ్‌, హామిల్టన్‌ మధ్య ఉన్న హంట్లీ అనే చిన్న పట్టణానికి చెందిన ఆమె పేరు హనా-రౌహితీ మైపి-క్లార్క్.  కేవలం 21 ఏళ్ల వయసులోనే పార్లమెంట్‌కి ఎన్నికై  రికార్డు సృష్టించింది. ఏకంగా 170 ఏళ్ల న్యూజిలాండ్‌ చరిత్రలో అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా ఎంపీగా నిలిచింది. గతేడాది అక్టోబర్‌లో పార్లమెంట్‌కి ఎన్నికయ్యారు. ఆమె న్యూజిలాండ్‌లోని మావోరి కమ్యూనిటీల హక్కుల కోసం పోరాడుతున్నారు. అంతేగాదు ఆ మావోరిల కమ్యునిటీ గార్డెన్‌ను కూడా మైపీ క్లార్క్‌ నడుపుతోంది

ఏం మాట్లాడారంటే..
ఆ ఉద్వేగభరిత ప్రసంగంలో..తాను ఓటర్లకు "మీ కోసమే బతుకుతాను", "మీ గురించే చనిపోతానని" వాగ్దానం చేశాను. మా మావోరి తెగ తరతరాలుగా చాలా వెనుకబడి ఉంది. వారంతా తమ మాతృభాష నేర్చుకోవడం కోసం ఆర్రులు చాచి చూస్తోన్నారు. కనీసం తమ గుర్తింపుని కూడా చెప్పుకోలేని దీన స్థితిలో ఉంది. ఇప్పటికీ తాము వెనకబడిపోయే ఉన్నాం. అంతేగాదు నన్ను నేను ఎప్పటికీ రాజకీయ నాయకురాలి చూడనని. కేవలం మావోరి భాష సంరక్షకురాలిగా భావిస్తాను ఎందుకంటే రాబోయే తరాలకు ఈ స్వరాన్ని వినిపించాల్సిన అవసరం ఎంతైన ఉంది.

నిజానికి ఈ పార్లమెంట్‌లో ప్రవేశించే ముందు కొన్ని సలహాలు ఇచ్చారు. వ్యక్తిగతంగా దేన్ని తీసుకోకూడదన్నారు. ​​కానీ నేను ఈ ఛాంబర్‌లో చెప్పిన ప్రతిదాన్ని వ్యక్తిగతం తీసుకోకుండా ఉండలేను. జస్ట్‌ రెండు వారాల్లో ఈ ప్రభుత్వం నా ప్రపంచం(మావోరి) మొత్తంపై దాడి చేసింది. ఎంతలా అంటే ఆరోగ్యం, పర్యావరణం, నీరు, వెన్యువా, సహజవనరులు, మావోరి వార్డులు, వారి భాష, ఉనికి అన్నింటిని లాగేసుకుంది. ఈ దేశంలో మాకైనా, మీకైనా ఒక దేశ పౌరులుగా అన్ని హక్కులను సద్వినియోగించుకునే హక్కు ఉంది కదా!  అంటూ తన మాతృ భాషలో పార్లమెంట్‌ని గడగడలాడించేలా మాట్లాడింది. దీంతో ఆమె ప్రసంగం వీడియో ఓ సంచలనంగా మారి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. కాగా, ఆమె తాతా తైతిము మైపి కూడా మావోరి కార్యకర్తే. 

(చదవండి: మహిళా భద్రతలో టాప్‌.... చెన్నై!! హైదరాబాద్‌ స్థానం...??)

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)