Breaking News

ఏఐతో... ఆటలొద్దు!

Published on Thu, 03/26/2026 - 04:52

పిల్లలు ఏడుస్తారు, నవ్వుతారు, బుంగమూతి పెట్టి అలుగుతారు... వారికంటూ స్నేహితులు ఉంటారు. వారితో తమదైన భాషలో మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఆ పిల్లల ప్రపంచంలోకి ఏఐ టాయ్స్‌ వచ్చాయి. ఫ్రెండ్‌తో మాట్లాడినట్లే పిల్లలు వాటితో మాట్లాడుతున్నారు. నవ్వుతున్నారు. తమకు ఏమనిపిస్తుందో చెబుతున్నారు... 
వినడానికి ఇది బాగానే ఉంది కానీ... ఏ.ఐ. బొమ్మల ప్రభావం పిల్లలపై మంచిది కాదని చెబుతున్నారు పరిశోధకులు. సహజమైన బాల్యాన్ని, భావోద్వేగాలను ‘ఏఐ బొమ్మలు’ హరించకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు...

ఫ్రెండ్‌లాగా సంభాషించడం నుంచి భావోద్వేగాలు గ్రహించడం వరకు ఏఐ బొమ్మలు పిల్లలకు చేరువ అవుతున్నాయి. ఏఐ–ఆధారిత బొమ్మలు వినగలవు. అర్థం చేసుకోగలవు. ఏదైనా అడిగితే సమాధానాలు ఇవ్వగలవు. దీంతో అవి అపురూపంగా అనిపిస్తాయి.

అయితే పిల్లలపై ఏఐ బొమ్మల ప్రభావం ఏ రకంగా ఉంటుంది అనే దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ప్రతికూలతల గురించి చెప్పుకోవాలంటే....
పిల్లల భావోద్వేగాలకు సంబంధించి ఏఐ బొమ్మలు అతిగా స్పందిస్తుంటాయి. మితిమీరిన సానుభూతి చూపుతుంటాయి. ఒక నిమిషం విచారంగా, మరు నిమిషం సంతోషంగా ఉండగలిగే పిల్లలకు ఇది అవసరం లేదు అంటున్నారు నిపుణులు.

సహజత్వం లేకుండా....
‘పిల్లలకు ఏఐ బొమ్మలు తోడుగా ఉండే మాట వాస్తవమే అయినా, వివిధ సందర్భాలలో స్పందించడానికి సంబంధించి వాటి ఉద్దేశాలను అర్థం చేసుకోవడం కష్టం’ అంటున్నారు నిపుణులు.
‘ఏఐ ఆధారిత బొమ్మల కొత్త ట్రెండ్‌ ఆందోళన కలిగిస్తోంది’ అంటుంది లండన్‌లోని డిజైన్‌ కంపెనీ ‘మోరమా’ వ్యవస్థాపకురాలు, యూకే డిజైన్‌ కౌన్సిల్‌ సభ్యురాలు జో బర్నార్డ్‌.
మానవ సంబంధాలకు భిన్నంగా ఏఐ బొమ్మ ఫ్రెండ్స్‌ ఎప్పుడూ సహనంగా, స్నేహంగా ఉండేలా డిజైన్‌ చేశారు.
‘ఏఐ బొమ్మలలో సహజ స్పందన లేక΄ోవడం వల్ల, వాస్తవ ప్రపంచాన్ని పిల్లలు అర్థం చేసుకోలేరు. మీరు ఒక చాట్‌బాట్‌తో ఎంత దారుణంగా ప్రవర్తించినా, అది మిమ్మల్ని అభిమానిస్తుంది. కాని వాస్తవ ప్రపంచంలో అలా ఉండదు కదా!’ అంటుంది జో బర్నార్డ్‌.

ఇలా అయితే... చాలా కష్టం
సహజత్వం లోపించిన సంభాషణల వల్ల పిల్లలకు భావోద్వేగపరమైన నష్టాలతో΄ాటు, మేధోవికాసం (కాగ్నెటివ్‌ ఎఫర్ట్‌)పై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. నిరంతరం పిల్లలతో సంభాషించేలా ఏఐ టాయ్స్‌ను రూ΄÷ందించారు. దీనివల్ల పిల్లలలో ఆధారపడే తత్త్వం పెరిగే ప్రమాదం ఉంది. దాని బారి నుండి వారిని బయటికి తీసుకురావడం చాలా కష్టం అవుతుంది.

వికటిస్తుందా?
ఒక వస్తువును ఎలా డిజైన్‌ చేస్తారనే దానిపైనే మనం దానితో ఎలా వ్యవహరిస్తామనేది ఆధారపడి ఉంటుంది. ఈ తరానికి సంబంధించి ఏఐ బొమ్మల కంపెనీలు ‘ఆకర్షణీయత’కే పెద్ద పీట వేశాయి. అయితే ఆ ఆకర్షణీయ విధానం పిల్లల అవసరాలకు విరుద్ధంగా ఉంటుంది.
ఏఐ బొమ్మల మార్కెట్‌ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, కంపెనీలు మరిన్ని ఫీచర్‌లు, సామర్థ్యాలను జోడించడానికి ΄ోటీ పడుతున్నప్పటికీ, అది వికటించే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు.

గాబో గందరగోళం!
మూడేళ్ల పిల్లల కోసం ఎన్నో ఏఐ బొమ్మలు మార్కెట్‌లో ఉన్నాయి. అయితే ప్రీ–స్కూల్‌ పిల్లలపై ఏఐ సాంకేతిక ప్రభావం గురించి చాలా తక్కువ పరిశోధన జరిగింది. తాజా విషయానికి వస్తే...అయిదేళ్ల లోపు పిల్లలపై ఏఐ బొమ్మల ప్రభావం ఎంత ఉంటుంది అనే దానిపై తొలిసారిగా ఒక అధ్యయనం నిర్వహించింది కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయ బృందం. ఈ నేపథ్యంలో పిల్లల కోసం రూ΄÷ందించిన ఏఐ–ఆధారిత బొమ్మలకు సంబంధించి కఠినమైన నియంత్రణ అవసరం అని చెబుతున్నారు పరిశోధకులు.

తమ అధ్యయనంలో భాగంగా మూడు నుండి అయిదు సంవత్సరాల వయస్సు గల కొద్దిమంది పిల్లలు ‘గాబో’ అనే ఏఐ బొమ్మతో ఎలా వ్యవహరిస్తారో పరిశీలించారు. ‘గాబో’ అనేది వాయిస్‌–యాక్టివేటెడ్‌ ఏఐ చాట్‌బాట్‌. ప్రీ–స్కూలు పిల్లలు దానితో మాట్లాడేలా, ఆటలు ఆడే విధంగా రూ΄÷ందించారు. తమ అధ్యయనంలో భాగంగా ‘గాబో’ భాష, సంభాషణలకు సంబంధించిన  నైపుణ్యాలను పరీక్షించారు. పిల్లలు ‘గాబో’తో మాట్లాడడానికి తరచుగా ఇబ్బందిపడడాన్ని గమనించారు. పిల్లలు, పెద్దవారి గొంతుల మధ్య తేడాని ‘గాబో’ గుర్తించలేక΄ోయింది. ఒక పిల్లవాడు బొమ్మతో ‘నువ్వంటే నాకు ఇష్టం’ అని చెప్పినప్పుడు అది అర్థం లేని సమాధానం ఇచ్చింది.
పిల్లవాడి మాటకు ‘థ్యాంక్యూ’ లేదా ‘నాకు కూడా నువ్వంటే ఇష్టం’లాంటి మాటలేవో వాడాలి. అలా కాకుండా...‘మీరు ఎలా ముందుకు వెళ్లాలనుకుంటున్నారో నాకు తెలియజేయండి’ అని స్పందించింది ఆ  ఏఐ బొమ్మ. మూడేళ్ల చిన్నారి ‘నాకు బాధగా ఉంది’ అనే భావం వ్యక్తీకరించే మాట మాట్లాడినప్పుడు...
‘నేను సంతోషంగా ఉండే చిన్న రోబోట్‌ని. ఈ సరదాను కొనసాగిద్దాం. మనం తర్వాత దేని గురించి మాట్లాడుకుందాం?’ అని ఆ చిన్నారిని అడిగింది బొమ్మ.

ఈ సమయంలో కరెక్ట్‌ కాదు
‘పిల్లలు సామాజిక విషయాలను తెలుసుకునే అభివృద్ధి దశలో జనరేటివ్‌ ఏఐ అవుట్‌పుట్‌ గందరగోళంగా ఉంటోంది’ అంటున్నారు పరిశోధకులు. ‘గాబో వంటి బొమ్మలు పిల్లల మాటలు, భావాలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు’ అంటున్నారు అధ్యయన సహ రచయిత డాక్టర్‌ ఎమిలీ.
సంవత్సర కాలం ΄ాటు ఏఐ బొమ్మల పనితీరును, పిల్లలపై వాటి ప్రభావాన్ని అధ్యయనం చేసిన తరువాత...‘అయిదేళ్ల లోపు పిల్లల కోసం విక్రయించే ఏఐ బొమ్మలు సైకలాజికల్‌ సేఫ్టీని అందిస్తున్నాయని నిర్ధారించడానికి నియంత్రణ సంస్థలు వెంటనే చర్యలు తీసుకోవాలి’ అని కోరుతున్నారు పరిశోధకులు.
‘ఏఐ బొమ్మలను తల్లిదండ్రులు పర్యవేక్షించడానికి వీలుగా, అందరికీ కనిపించే ప్రదేశాలలో ఉంచాలి. గోప్యతా విధానాలను (ప్రైవసీ ΄ాలసీ) జాగ్రత్తగా చదవాలి’ అని స్టడీ రి΄ోర్ట్‌ తల్లిదండ్రులకు సూచించింది.
 

నిజ ప్రపంచం వర్సెస్‌ సాంకేతిక ప్రపంచం
పిల్లల ఆలోచన విధానంపై ఏఐ ప్రభావం ఆందోళన కలిగిస్తుంది. ఏఐ సాధనాలపై అతిగా ఆధారపడడం వల్ల మేధోపరమైన కృషి తగ్గుతుంది అంటున్నారు విశ్లేషకులు.
‘ఏఐ బొమ్మలపై అతిగా ఆధారపడితే పిల్లల మెదడులోని భాగాలు అభివృద్ధి చెందడం ఆగి΄ోతాయి’ అని హెచ్చరిస్తున్నారు.

నిజ ప్రపంచం సంక్లిష్టమైనది, అనూహ్యమైనది. మనుషులు తమ జీవితానుభవాల ద్వారా ఎలా మసలుకోవాలో నేర్చుకుంటారు. దీనికి విరుద్ధంగా ఏఐ పరిమితమైన సమాచారంతో పనిచేస్తుంది.

‘ఒక పిల్లవాడి చుట్టూ ఉన్న అన్ని రకాల భావోద్వేగాలను ఏఐ బొమ్మలు అందుకోలేవు. దాని ప్రతిస్పందనలు అసంపూర్ణంగా, అనుచితంగా ఉంటాయి. ఇది తప్పుడు మార్గదర్శకత్వానికి దారి తీయడమే కాకుండా సృజనాత్మకంగా ఆలోచించడాన్ని తగ్గించవచ్చు, స్వతంత్రంగా సమస్య పరిష్కారానికి ఆలోచించే అవకాశాలను తగ్గించవచ్చు’ అంటుంది జో బర్నార్డ్‌. 

Videos

బ్లడీ బాస్టర్డ్.. సామాన్యుడిపై TDP ఎమ్మెల్యే బూతు పురాణం

అడ్డంగా నరికేస్తా.. యూజ్ లెస్ ఫెలో ఆదిరెడ్డికి ధమ్కీ ఇచ్చిన వ్యాపారి

మార్కాపురం ఘోర రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందంటే?

శవాన్ని తీసుకెళ్తుంటే 100 మంది దాడి చేశారు.. డిప్యూటీ సీఎంకి ఒకటే ప్రశ్న.

ఇన్వెస్టర్లకు జాక్పాట్ 1100% డివిడెండ్ ఇచ్చిన మైనింగ్ కంపెనీ

ఇన్వెస్టర్లకు పండగే లక్ష పెడితే 12 లక్షలు...ఒకటి కొంటే ఒకటి ఫ్రీ

YS జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు

అమరావతిలో బాబు అవినీతి యజ్ఞం

4 గంటల్లోనే బంగారం ధరలు భారీగా పెరిగాయి..

దొరకాలి నా కొడుకు.. పెట్రోల్ పోసి తగలబెడతా

Photos

+5

కూతురితో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో బైకర్ మూవీ టీమ్ (ఫోటోలు)

+5

జూ.ఎన్టీఆర్‌ సతీమణి ప్ర‌ణ‌తి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : ఒక చేయి.. ఆపన్నహస్తాలెన్నో! ఈ ఫోటోలు చూడండి

+5

నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)

+5

డిఫరెంట్ లుక్స్‌తో షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

వావ్ అనేలా మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఫొటోలు

+5

IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)

+5

హనీమూన్ కాదు బడ్డీమూన్.. రష్మిక-విజయ్ ఇలా (ఫొటోలు)

+5

ఇదేం బిల్డప్‌ చంద్రబాబూ.. క్రెడిట్ చోరీ ఆగదా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)