Breaking News

చప్పట్లు కొడితే శబ్దం ఎందుకొస్తుందో తెలుసా..?

Published on Mon, 06/02/2025 - 15:38

చప్పట్లు కొట్టినప్పుడు శబ్దం ఎందుకొస్తుంది అని ఆలోచించారా ఎప్పుడైనా..?. వాట్‌ ఇదేం కామెడీ ప్రశ్న అనుకోకండి. ఎందుకంటే చప్పట్లు కొడితే శబ్దం ఆటోమేటిగ్గా  రాకుండా ఉండదు కదా అని చెప్పేయొద్దు. చూడటానికి గమ్మత్తుగా అనిపించే ఈ చిన్న విషయాన్ని కనుగొంటే.. శబ్దం ఎలా జనిస్తుందో అనే ప్రశ్నకు కచ్చితమైన సమాధానం దొరికినట్లువుతుంది. రెండు గట్టిపదార్థాలను ఒకదానికొకటి తాకిస్తే శబ్దం వస్తుది. అదే ప్లాస్టిక్‌, చెక్క వంటి వాటి నుంచి రాదుగా. మరీ రక్తం, కండరాలతో నిర్మితమైన చేతుల నుంచి ఎలా వచ్చేస్తోందన్న సందేహం కొందరి శాస్త్రవేత్తల బుర్రలను తొలిచింది. దాని పర్యవసానంగా..అవాక్కయ్యే విషయం వెలుగులోకి వచ్చింది

ఇన్నాళ్లుగా మనమంతా అనుకున్నట్లుగా..రెండు చేతుల దగ్గరకు చరచడం వల్ల కానేకాదట. ఒక చిన్న స్థలంలో గాలి కుదించబడి బయటకు నెట్టడం వల్ల వస్తుందని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. కుదించబడిన గాలి హెల్మ్‌హోల్ట్జ్ రెసొనేటర్ లాగా ప్రవర్తిస్తుందట. అందుకు ఉదాహరణే బాటిల్‌ గుండా గాలిని ఊదితే వచ్చే శబ్దమేనని వివరించారు. 

అరచేతులు ఒక కుహరాన్ని సృష్టిస్తాయి. అంటే ఒక చిన్న స్వరంగం మాదిరి అన్నమాట. ఇక్కడ బొటన వేలు, చూపుడు వేలు కారణంగా కుదించబడిన కుహరంలా(చిన్న బాటిల్‌ మూతిలా) ఏర్పడుతుందట. సరిగ్గా గాలి ఆ కుహరం నుంచే బయటకు నెట్టబడటంతో ధ్వని తరంగాలను సృష్టిస్తుందట. దాంతో టప టప అని సౌండ్‌ ఉత్ఫన్నమవుతుందని చెప్పుకొచ్చారు. 

చప్పట్ల వేగాన్ని అనుసరించే వచ్చే శబ్దాలపై అధ్యయనం చేయగా ఈ విషయం వెల్లడైందని అ‍న్నారు. అలాగే ప్రతి వ్యక్తి చప్పట్లు కుహరం ఆకారం, చర్మ స్థితిస్థాకత వంటి వాటిని బట్టి వచ్చే శబ్దం ప్రత్యేకంగా ఉంటుందని.. ఏ ఒక్కరిది ఒకేలా  ఉండదని తేల్చి చెప్పారు. ఇది మనకు మనషుల గుర్తింపులో ఉపయోగపడే మరో కొత్త అంశమని చెప్పుకొచ్చారు కార్నెల్ అండ్‌ మిస్సిస్సిప్పి​ విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఈ అధ్యయనం ఫిజికల్‌ రివ్యూ జర్నల్‌లో ప్రచురితమైంది. 

(చదవండి: Kerala Teacher: ఆ మాస్టార్‌ అంకితభావానికి మాటల్లేవ్‌ అంతే..! ఏకంగా 20 ఏళ్లుగా..)

 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)