Breaking News

Sonnalli Seygall Tips: గర్భం ధరించినప్పుడు.. ఇలా చేస్తే నార్మల్‌ డెలివరీ!

Published on Wed, 01/29/2025 - 13:55

ఇటీవల కాలంలో చాలామటుకు సీజేరియన్లే కానీ నార్మల్‌ డెలివరీ ఎవరికో గానీ అవ్వడం లేదు. ఎవరికైనా నార్మల్‌ డెలివరీ అయ్యిందంటే చాలు అవునా..! అని ఆశ్చర్యపోతున్న రోజులివి. చాలామంది కాబోయే తల్లులు సైతం సుఖ ప్రసవం అన్న ఆలోచనకే తావివ్వడం లేదు. ఎందుకంటే సాధారణ ప్రసవంలో ఉండే నొప్పులకు భయపడి సీజేరియన్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ సర్జరీల వల్ల ఎదురయ్యే దీర్ఘకాలిక సమస్యల గురించి ఆలోచించడం లేదని ఆరోగ్య నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. అయితే సెలబ్రిటీలు సైతం ప్రస్తుతం నార్మల్‌ డెలివరీకే ప్రాధన్యాత ఇస్తున్నారు. అందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల తోపాటు గర్భధారణ వ్యాయామాలు కూడా చేస్తున్నారు. ఇటీవలే ఒక బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడడ్‌ నటి సోనాలి సెగల్‌ సైతం నార్మల​ డెలివరీకే ప్రాధాన్యత ఇవ్వండి అని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆరోగ్య స్ప్రుహని కలిగిస్తోంది. తాను గర్భం ధరించినప్పుడూ చేసిన వ్యాయామాలు, తీసుకున్న జాగ్రత్తలు గురించి కూడా షేర్‌ చేశారు. అవేంటంటే..

బాలీవుడ్‌ ప్రముఖ నటి సోనాలి సెగల్‌(Sonnalli Seygall) ఆమె భర్త ఎల్‌ సజ్నాని దంపతులు నవంబర్‌27, 2024న షుకర్‌ అనే ఆడ శిశువుకి జన్మనిచ్చిన సంగతి తెలిసింది. ఆమె ఇన్‌స్టా వేదికగా కాబోయే తల్లలు గర్భం దాల్చినప్పటి నుంచే నార్మల్‌ డెలివరీ(Normal delivery)కి సిద్ధం అయ్యేలా దైనందిన దినచర్యలో మార్పులు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా ఆ టైంలో ప్రెగ్నెన్సీ(Pregnancy)కి అనుగుణమైన వ్యాయామాలు చేయడం మంచిదన్నారు. 

తాను కూడా గర్భం ధరించినప్పుడూ తొమ్మిదో నెల వరకు ప్రెగ్నెన్సీకి సంబంధించిన వ్యాయామాలు చేసినట్లు తెలిపింది. గర్భం చివరి దశ వరకు స్విస్‌ బాల్‌ వ్యాయామాలు(Swiss ball exercises) చేయాలని, అవి కోర్‌ బలం అందించి ప్రసవం తేలిగ్గా అయ్యేందుకు ఉపకరిస్తుందని చెబుతోంది. ఆ సమయంలో ఉండే నడుమ నొప్పులను నివారించడానికి ఈ వ్యాయామాలు తోడ్పడతాయని అన్నారు. ముఖ్యంగా తొమ్మిదో నెలలో డెలివరీకి సిద్ధం అయ్యేలా శరీరాన్ని రెడీ చేసేలా నిపుణలు సమక్షంలో  వ్యాయామాలు చేయడం మంచిదని సూచించింది. 

సీ సెక్షన్‌ రేటు పెరుగుతున్నందున తాను నార్మల్‌ డెలివరీకే మొగ్గు చూపినట్లు తెలిపారు. ఈస్విస్‌ బాల్‌తో చేసే ఎనిమిది దశల వ్యాయామాలు సాధారణ ప్రసవా అయ్యేలా కటి భాగాన్ని రెడీ చేస్తుందట. అదెలాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన వీడియోలో సోనాలి వివరించారు. అలాగే గర్భం చివరి దశలో శిశువు శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇచ్చేలా ఆరోగ్యంగా ఉండటం, సౌకర్యవంతమైన వర్కౌట్లు చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రసవం క్రిటికల్‌గా ఉందన్న సమయంలో తప్పించి, చాలామటుకు ప్రతి మహిళ నార్మల్‌ డెలివరీ అయ్యేలా తగిన జాగ్రత్తలు ముందు నుంచి తీసుకోవాని అంటోంది సోనాలి సెగల్‌. 

అదే మహిళ ఆరోగ్యానికి అన్ని విధాల మంచిదని చెబుతోంది. కాగా సోనాలి సెగల్‌.. ప్యార్‌ కా పంచనామా సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. వెడ్డింగ్‌ పులావ్‌, ప్యార్‌ కా పంచనామా 2, హైజాక్‌, జై మమ్మీదీ, జో తేరా హై వో మేరా హై చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె బ్లాక్‌ కరెన్సీ, నూరని చెహ్రా, బూండి రైతా సినిమాలతో బీజీగా ఉంది.

 

(చదవండి: పచ్చని పల్లెలో మెచ్చే సర్పంచులు..!)

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)