Breaking News

పెళ్లిలో గర్భిణీని అలా చూసి ‘నెత్తికెత్తుకున్నాడు’: తరువాత ఏమైందంటే..!

Published on Wed, 06/19/2024 - 11:14

పెళ్లిళ్లు, జాతర్లు, ఊరేగింపుల్లో బలిష్ఠమైన పురుషులు  పెద్ద పెద్ద విద్యుత్తు దీపాలను తలపై పెట్టుకుని మోస్తూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. చాలాసార్లు అలాంటి దృశ్యాలను అలా చూసి వెళ్లిపోతాం. చిన్న చిన్న పిల్లలు, ఆడవాళ్లు ఇలాంటి దీపాల్ని మోస్తున్నపుడు.. మహా అయితే... అయ్యో అనుకుంటాం. కూటి కోసం కోటి విద్యలు అనుకుంటాం. మరుక్షణం ఆ విషయాన్ని మర్చిపోతాం. ఇంతకుమించి పెద్దగా పట్టించుకోం. లేదంటే సాయానికి ముందు కెళ్లదామని అనిపించినా.. ఏదో తెలియని మొహమాటం వెంటాడుతుంది.. కదా. కానీ ఒక వ్యక్తి మాత్రం మానవత్వంతో ఆలోచించి, చురుగ్గా స్పందించారు. అంతేకాదు ఆయన చేసిన పని మరో నలుగురికి ఆదర్శప్రాయమైంది. విషయం ఏమిటంటే..

తన స్నేహితుడి కుమారుడి వివాహ వేడుకలో తలపై దీపాన్ని మోస్తున్న గర్భిణీని చూశారు తన్వీర్‌ మహ్మద్‌. అది చూడగానే ఆయనకు తల్లి గుర్తొచ్చిందో  ఏమో గానీ, వెంటనే స్పందించారు. ఆమె నెత్తిపై ఉన్న దీపాన్ని తన నెత్తిపైకి తీసుకున్నారు.

ఆగండి..ఆగండి..కథ ఇక్కడితో అయిపోలేదు..తన్వీర్‌ను చూసిన ఆయన స్నేహితులు కూడా ముందు కొచ్చారు. వంతుల వారీగా ఆమె బరువును తమ నెత్తికెత్తుకున్నారు.

అంతేకాదు స్నేహితులంతా కలిసి ఈ పనికోసం చెల్లించే దానికంటే రెండు రెట్లు  ఎక్కువ చెల్లించారట ఆ బృందానికి. ‘తల్లిని మించిన  హీరో లేరు’ అంటూ  తన్వీర్‌ ఈ విషయాన్ని వీడియోతోపాటు ఎక్స్‌లో షేర్‌ చేశారు. దీంతో పలువురు మంచి పని చేశారు భయ్యా అంటూ అభినందించారు. ఆయన ఆలోచనలు, భావాలతో విభేదించేవారు కూడా తన్వీర్‌  స్పందించిన తీరుపై ప్రశంసలు కురిపించడం విశేషం. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)