Breaking News

డిస్నీని తలపించేలా... సరికొత్త థీమ్‌ పార్క్‌

Published on Sat, 02/22/2025 - 15:24

సాక్షి, ముంబై: ముంబై, నవీ ముంబై నగరాల్లోని చిన్నారులకు త్వరలోనే ఒక గొప్ప వినోద అనుభవం లభించనుంది. మిక్కీ మౌస్, మిన్నీ మౌస్, డోనాల్డ్‌ డక్, గూఫీ వంటి ప్రసిద్ధ కార్టూన్‌ పాత్రలను ప్రత్యక్షంగా చూసే అవకాశంతో పాటు, థ్రిల్లింగ్‌ రైడ్‌లను ఆస్వాదించే అవకాశం కల్పించేందుకు కొత్త థీమ్‌ పార్క్‌ ఏర్పాటు కానుంది. ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌) గ్రోత్‌ హబ్‌’ప్రాజెక్టులో భాగంగా నవీ ముంబైలో 200 హెక్టార్ల విస్తీర్ణంలో ఒక భారీ థీమ్‌ పార్క్‌ నిర్మాణం కోసం ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎమ్మెమ్మార్డీఏ) ప్రణాళికలు రూపొందించింది.  

ఎంఎంఆర్‌లో పర్యాటక వృద్ధి కోసం... 
పరిశ్రమ, పర్యాటకం, విద్య, మౌలిక సదుపాయాలు, గృహనిర్మాణం, ఆరోగ్యం, ఓడరేవుల అభివృద్ధికి సంబంధించి ఎంఎంఆర్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెమ్మార్డీయే గ్రోత్‌ హబ్‌ ప్రాజెక్టుకింద పలు ప్రణాళికలను రూపొందించింది.ఇందులో భాగంగా పర్యాటక కేంద్రంగా అలీబాగ్‌ అభివృద్ధి, ముంబైలోని చారిత్రక కోటల పరిరక్షణతో పాటు దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు నవీ ముంబైలో డిస్నీల్యాండ్‌ తరహాలో భారీ థీమ్‌ పార్క్‌ను నిరి్మంచాలని ప్రతిపాదించింది.

ఇదీ చదవండి: వరుడి ముద్దు : రెడ్‌ లెహెంగాలో సిగ్గుల మొగ్గైన పెళ్లికూతురు

మొదటిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో... 
ప్రస్తుతం ముంబై, నవీ ముంబై, థానేలతో పాటు ఎంఎంఆర్‌ పరిధిలో అనేక రిసార్టులు, థీమ్‌ పార్కులు, వాటర్‌ పార్కులు ఉన్నాయి. అయితే మొట్టమొదటి సారిగా ప్రభుత్వం, ఎమ్మెమ్మార్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో ఆకర్షణీయమైన రిసార్టులు, యానిమేషన్‌ స్టూడియోలు, రైడ్‌ జోన్లు, వాటర్‌ పార్క్, ఇతర ఆధు నిక సదుపాయాలతో నిర్మిస్తున్న ఈ థీమ్‌ పార్కు రాష్ట్ర పర్యాటక రంగంలో పెద్ద మైలురాయి కాగలదని అధికారులు అంచనా వేస్తున్నారు.  (BirdFlu భయమేల చికెన్‌ను తలదన్నే గింజలు గుప్పెడు చాలు)

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)