Breaking News

క్యాన్సర్‌ను జయించొచ్చు

Published on Thu, 11/07/2024 - 12:23

క్యాన్సర్‌(రాచపుండు)కు ఇప్పుడు అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉంది. ముందే గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. తగు జాగ్రత్తలతో ముందుకు సాగితే క్యాన్సర్‌ను జయించడం కష్టమేమీ కాదని స్పష్టం చేస్తున్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2014 నుంచి ఏటా నవంబర్‌ 7న జాతీయ క్యాన్సర్‌ అవగాహన దినం నిర్వహిస్తున్నారు. క్యాన్సర్‌ చికిత్సలో కీలకమైన రేడియంను కనిపెట్టిన పోలాండ్‌ దేశానికి చెందిన మేడం క్యూరీ పుట్టిన రోజునే అవగాహన దినంగా నిర్వహించడం గమనార్హం.

గుర్తించడం ఎలా?
మానకుండా ఉన్న పుండ్లు, శరీరంలోని ఏ భాగంలోనైనా ఎదుగుతున్న గడ్డలు, కణుతులు, అసహజమైన రక్తస్రావం, పెరుగుతున్న పుట్టుమచ్చలు, పులిపిరి కాయలు, మింగటం కష్టంగా ఉండటం, గొంతు బొంగురుపోయి తగ్గకుండా ఉండటం, చాలా రోజులుగా ఉన్న అజీర్ణవ్యాధి తదితర లక్షణాలు ఉంటే తక్షణమే క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.

కారకాలు
సిగిరెట్‌ పొగలో 400 రకాల హానికారక రసాయనాలు ఉంటాయి. వీటితోపాటు గుట్కా పాన్‌, మసాలాలు, వేపుళ్లు, నిల్వ ఉన్న పచ్చళ్లు, బేకరీ పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల నోటి, పేగు, కిడ్నీ క్యాన్సర్‌లు వస్తాయి. ఊబకాయుల్లో మూత్రాశయ, గర్భాశయ, పేగు క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది, పాంక్రియాటిక్‌ క్యాన్సర్లూ వస్తాయి. పారిశ్రామిక వ్యర్థాలు, ఫ్యాక్టరీలు వదిలే పొగల వల్ల క్యాన్సర్‌ వచ్చే రిస్క్‌ 3 నుంచి 4 శాతం ఉంటుంది.

మాంసాహారాల్లో క్యాన్సర్‌ కణాలు
తాజా కూరగాయలు, ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి. వీటిల్లో క్యాన్సర్‌ కారకాలతో పోరాడే యాంటిజెంట్స్‌ ఉంటాయి. మాంసాహారాల్లో క్యాన్సర్‌ కణాలు అధికంగా ఉంటాయి. ఇవి తినేవారు తప్పనిసరిగా వెజిటబుల్‌ లేదా ఫ్రూట్‌ సలాడ్‌ తినాలి. దీనివల్ల మాంసాహారంలో ఉండే క్యాన్సర్‌ కణాలతో సలాడ్‌లోని యాంటీజెంట్స్‌ పోరాడతాయి. కొవ్వుశాతం తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తక్కువ. భోజనంతో తాజా పండును రోజూ తీసుకోవాలి. రోజూ కనీసం అరగంటసేపు వ్యాయామం చేయాలి. స్మోకింగ్‌, మద్యం, పాన్‌, గుట్కా లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి.

మహిళల్లో రొమ్ము, సర్వైకల్‌ క్యాన్సర్‌
నాన్‌కమ్యూనకబుల్‌ డిసీజ్‌ ప్రోగ్రాంలో గత ఏడాది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించగా జిల్లాలో 2,54,636 మంది రొమ్ము, సర్వైకల్‌, ఓరల్‌ క్యాన్సర్‌లతో బాధపడుతున్నట్లు గుర్తించారు. జిల్లాల్లో 40 మంది క్యాన్సర్‌ వైద్య నిపుణులు ఉండగా రోజూ వీరి వద్ద 30 నుంచి 50 మంది వరకు రోగులు వైద్యసేవలు పొందుతున్నారు.

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)