Breaking News

స్టైల్‌ ఐకాన్‌ నటాషా పూనావాలా గ్లాస్‌ మాదిరి పర్సు ధర ఎంతంటే..?

Published on Fri, 07/26/2024 - 11:26

అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి, స్టైల్‌కి ఐకాన్‌ అయిన నటాషా పూనావాల ఎప్పటికప్పుడూ సరికొత్త ఫ్యాషన్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటుంది. ఆమె స్వతహాగానే ఫ్యాషన్‌గా ఉంటుంది ఆమె ఆహార్యం. ఆమె ఎప్పటికప్పుడూ ట్రెండ్‌ని సెట్‌ చేసే సరికొత్త డిజైనర్‌ వర్‌ దుస్తులతో తుళ్లక్కుమంది. అలానే ఈసారి ఫ్రాన్స్‌లో జరిగిన సమ్మర్‌ గాలా 2024 కోసం క్రిస్టల్స్‌తో అలంకరించిన గౌనుని ధరించింది. ఈ గాలా ఈవెంట్‌లో నటాషా ధరించిన మార్టిన్‌ గ్లాస్‌ ఆకృతి పర్సు హైలెట్‌గా నిలిచింది. 

ఈ పర్సు వోడ్కా, జిన్‌, కాక్‌టెయిల్‌ వంటి జ్యూస్‌లనే సర్వ్‌ చేసే మార్టిన్‌ గ్లాస్‌ ఆకృతిలో ఉండటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అక్కడ ఉన్న ప్రేక్షకుల దృష్టిని ఈ పర్సు ఎక్కువగా ఆకర్షించింది. అంతేగాదు సోషల్‌ మీడియాలో సైతం అందుకు సంబంధించిన  ఫోటోల్లో కనిపించిన ఈ పర్సే అందరి దృష్టిని అట్రాక్ట్‌ చేసింది. ఇక్కడ నటాషా ముగ్ధమనోహరంగా ఉండేలా ట్రాన్స్‌పరేంట్‌ క్రిస్టల్‌ గౌనులో మెరిసిపోయింది. అందుకు తగ్గట్లు చేతికి ధరించిన పర్సు ఎవర్‌ గ్రీన్‌గా ఉంది. అంతేగాదు ఈ మార్టిన్‌ గాజు ఆకృతి పర్సుని క్రిస్టల్స్‌తో అలంకరించడంతో నటాషా దివి నుంచి భువి వచ్చిన దేవకన్యలా ధగ ధగ మెరిసిపోయింది. 

ఈ పర్సు ఓపెనింగ్‌ అద్దం మాదిరిగా ఉంటుంది. జుడిత్ లీబర్ బ్రాండ్‌కి చెందిన ఈ పర్సు ధర ఏకంగా రూ. 4.85 లక్షలు పైనే ఉంటుందట. నటాషా ఎప్పుడూ డిఫెరెంట్‌ ఫ్యాషన్‌ ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే ఈ సారి ఆమె ధరించి గ్లాస్‌ ఆకృతి పర్సు అందరి మనసులను దోచుకుంది. ముఖ్యంగా ఫ్యాషన్‌ ప్రియులను ఈ పర్సు ఎంతగానో ఆకట్టుకుంది. అంతా వాటే ఏ స్టైలిష్‌ పర్సు అని ప్రశంసిస్తున్నారు కూడా. 

ఎవరీ నటాషా?
భారతదేశంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో ఒకరైన అదార్‌ పూనావాలా భార్యే నటాషా పూనావాలా. ఆమె అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారుగా ప్రసిద్ధి చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌. 2023 నాటికి, సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా విలువ రూ. 1.92 లక్షల కోట్లుగా ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. 

అంతేగాదు ఆమె సైరస్ పూనావల్ల గ్రూప్‌లోని వివిధ కంపెనీల కోసం సృజనాత్మకతతో కూడిన వ్యాపార వ్యూహాలతో లాభాల బాట పట్టించడంలో నటాషా కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె తన అత్తగారి గౌరవార్థం 2012లో స్థాపించబడిన కుటుంబ ఫౌండేషన్ అయిన విల్లో పూనావల్లా ఫౌండేషన్‌కు చైర్‌పర్సన్‌గా కూడా పనిచేస్తుంది. అలాగే భారతదేశం కోసం బ్రిటీష్ ఆసియన్ చిల్డ్రన్స్ ప్రొటెక్షన్ ఫండ్‌కు చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తోంది. పైగా బ్రిటిష్ ఏషియన్ ట్రస్ట్‌కు ఇండియా అడ్వైజరీ కౌన్సిల్‌లో సభ్యురాలు కూడా.

(చదవండి: హీరోయిన్‌ కత్రినా అనుసరించే రెండుపూటల భోజనం, షట్పావళి డైట్‌ ప్లాన్‌ అంటే..?)

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)