నందన్-రోహిణి నీలేకనిల ప్రేమ కథ: అలా మొదలైంది..!

Published on Wed, 07/29/2026 - 13:32

గత రెండు రోజులుగా నందన్‌ నీలేకని పేరు వార్తల్లో హాట్‌టాపిక్‌గా మారింది. యూఐడీఏఐ (ఆధార్) వ్యవస్థాపక ఛైర్మన్ అయిన నందన్ నీలేకని నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక హైపవర్డ్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయడంతో ఆయన పేరు వార్తలో మారుమ్రోగిపోతోంది. ఈ కమిటీ పోటీ పరీక్షలను మరింత పారదర్శకంగా, సురక్షితంగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించేందుకు పలు సిఫార్సులు చేయనుంది. ఈ నేపథ్యంలో ఆయనెవరు..ఆయన వ్యక్తిగత జీవితం గురించి సర్వత్ర చర్చలు మొదలయ్యాలయి. ఆయన భార్య సైతం దాతృత్వంలో మేటీ అని, పర్యావరణం, నీరు, విద్య కోసం పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చే గొప్య వ్యక్తి అంటూ వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అంతేగాదు వారిద్దరి క్యూట్‌ లవ్‌ స్టోరీ కూడా తెరపైకి వచ్చింది. ఆయనే స్వయంగా ఒక పాడ్‌కాస్ట్‌లో వెల్లడించిన స్టోరీ వెలుగులోకి వచ్చి ఆసక్తికరంగా మారింది.  మరి ఆ దంపతుల అందమైన ప్రేమ కథేంటో చూసేద్దామా.!.

నందన్‌ నీలేకని నీలేకని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడుచ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ కూడా. ఆయన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) - ఆధార్ వ్యవస్థకు మాజీ ఛైర్మన్, రూపకర్తగా ప్రసిద్ధి చెందారు.  ఆయన 'పీపుల్ బై WTF' అనే పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ తన భార్యను ఎలా కలిశాను, ఎలా తమ మధ్య ప్రేమ మొదలైందో పంచుకున్నారు. తాను 1977లో జరిగిన ఒక క్విజ్ పోటీలో రోహిణిని మొదటిసారి కలిసినట్లు తెలిపారు. ఆ పోటీలో ఆయన తన కళాశాల ఐఐటి బొంబాయికి, రోహిణి ఎల్ఫిన్‌స్టోన్ కాలేజీకి ప్రాతినిధ్యం వహించినట్లు తెలిపారు. 

అయితే ఆ క్విజ్‌లో తాను గెలిచాను కానే హృదయాన్ని కోల్పోయానని నవ్వుతూ చెప్పారు. ఆ తర్వాత తాము కొంతకాలం ప్రేమించుకుని, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నామని అన్నారు. ఇక తన భార్య రచయిత్రి, అత్యంత పరోపకారి అని చెప్పారు. ఆమె 2001లో అర్ఘ్యం ఫౌండేషన్‌ను స్థాపించిందని, అది నీరు, పారిశుధ్య సమస్యలపై పనిచస్తుందని అన్నారు. అలాగే అన్‌కామన్ గ్రౌండ్ (2011), ది హంగ్రీ లిటిల్ స్కై మాన్‌స్టర్ (2020), సమాజ్, సర్కార్, బజార్: ఎ సిటిజన్-ఫస్ట్ అప్రోచ్ (2022) వంటి అనేక పుస్తకాలను రాసినట్లు తెలిపారు. 

అయితే భావాల పరంగా తామిద్దరం పరస్పరం వ్యతిరేకంగా ఉంటామన్నారు. తనకూ, తన భార్యకూ మధ్య ఉన్న తేడాలు ఎంత భిన్నంగా ఉంటాయో కూడా వివరించారు. తననుతాను బోరింగ్‌ వ్యక్తిగా అభివర్ణించుకోగా, రోహిణి మ్రాతం ఆవేశపూరితమైన భావోద్వేగభరిత చంచల స్వభావం గల వ్యక్తి అని అన్నారు. అంతేగాదు ఆమె గురించి ఇంకా చెబుతూ..2017లో తనతో పాటు గివింగ్ ప్లెడ్జ్‌పై సంతకం చేయడం సహా, భారతదేశపు అతిపెద్ద పర్యావరణ దాతలలో ఆమె ఒకరని కూడా పేర్కొన్నారు.

కాగా, భారతదేశ పరీక్షా విధానాన్ని సమూలంగా మార్చేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. దీనికి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నాయకత్వం వహించనున్నట్లు తెలిపారు మోదీ. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. 

(చదవండి: నిశబ్ద నిస్వార్థ వీరుడు..! అతడి సాయానికి సెల్యూట్‌ చెప్పాల్సిందే..)
 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)