Breaking News

నానా పటేకర్‌ ఫిట్‌నెస్‌ డెడీకేషన్‌కి ఫిదా అవ్వాల్సిందే..!

Published on Thu, 10/08/2026 - 11:46

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, చిత్ర నిర్మాత నానా పటేకర్‌ గోవాలో తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన నటుడిగా విలక్షణమైన పాత్రలతో మెప్పించి అశేష అభిమానులను సంపాదించుకున్నారు. దాతృత్వంలోనూ రియల్‌ హీరో అనిపించుకునేలా సేవలందించాడు. చివరికి ఫిట్‌నెస్‌లో సాహో నానా అని అందరిచేత ప్రశంసలందుకున్నారు. హెల్త్‌ పరంగా ఆయన ఎంత చురుగ్గా ఉంటాడనేందుకు గత నెలలో నెట్టింట వైరల్‌ అయిన ఈ వీడియోనే ఉదాహరణ

ఆయన తన మరణానికి కొన్ని నెలల ముందు'గంఛా'తో వర్కౌట్లు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఏడు పదుల వయసులో కూడా ఎంతో సునాయాసంగా వ్యాయామాలు చేస్తూ ఆరోగ్య స్ప్రుహని కలిగించే యత్రం చేశారు. 70 ఏళ్ల వయసులో కూడా చురుకుగా ఉంటూ ఫిట్‌నెస్‌ని కాపాడుకోవడం విశేషం. ఈ వీడియోని ఫోటోగ్రాఫర్‌ కాస్బేకర్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో పంచుకున్నారు. ఆ వీడియోలో నానాపటేకర్‌ చాలా సులభంగా  ట్రైసెప్ డిప్స్ చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. 

వ్యాయామం పూర్తయ్యాక కెమెరా వైపు చూస్తూ చిరునవ్వు చిందించారు. తెల్లని బనియన్‌, టాన్‌రంగు షార్ట్స్‌ ధరించి మెడలో ఎరుపు రంగు తువాలు వేసుకుని కనిపించారు. ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకర్షించింది. 75 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌నెస్‌ పట్ల ఆయనకున్న అమిత అంకితభావం, బలాన్ని చూసి విస్తుపోయారు. ఆ వీడియోకి "అహో నానా సాహెబ్...!!! నా ఫిట్‌నెస్ లక్ష్యాలను మళ్లీ కొత్తగా నిర్దేశించుకునేలా చేశారు!!!అనే క్యాప్షన్‌ జోడించి మరి పోస్ట్‌ చేశారు ఫోటోగ్రాఫర్‌ కాస్బేకర్‌. అంత ఏజ్‌లో కూడా ఎంత సునాయాసంగా నానాజీ బార్లపై సులభంగా ట్రైసెప్‌ డిప్స్‌ చేస్తున్నారు అని రాసుకొచ్చారు పోస్ట్‌లో. 

అంతేగాదు ఆయన  రోజుకు దాదాపు 2 గంటల పాటు జిమ్‌లో గడుపుతారు. ఇందులో భాగంగా బెంచ్ ప్రెస్, బైసెప్ కర్ల్స్, స్క్వాట్స్ వంటి వెయిట్ ట్రైనింగ్ వ్యాయామాలు అన్ని చేస్తారు. ఎప్పటికీ చురగ్గా ఉండేలా వర్కౌట్లు చేసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారట నానా. 

కాగా,  ఆయన ఫిట్‌నెస్‌ దినచర్యను చూసి ప్రముఖ బాలీవుడ్‌ సెలబ్రిటీలు శిల్పాశెట్టి, షారుక్‌ ఖాన్‌ తదితర దిగ్గజ నటులు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. అంతేగాదు ఆయన వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని తన వర్కౌట్లతో అద్భుతంగా చెప్పారని అన్నారు. 

 

ఇదీ చదవండి: ‘నానా’ను బలిగొన్న కార్డియాక్‌ అరెస్ట్‌.. ఆ కీలక నిమిషాల్లో ఏం చేయాలంటే..
 

Videos

తాడేపల్లి YSRCP పార్టీ ఆఫీస్ కూల్చివేత అంబటి స్టాంగ్ వార్నింగ్

జనసేన MLA చిర్రి బాలరాజు సన్నిహితురాలు సంచలన వీడియో

డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే..! ఫౌజీ నుంచి 3 నిమిషాల టీజర్..

ఏపీలో స్థానిక ఎన్నికలకు SEC రెడీ

Viral: చెన్నైలో షాకింగ్ ఘటన.. రోడ్డుపై భారీ గుంతలోకి దూసుకెళ్లిన కారు

జగ్గారెడ్డి దీక్ష.. రాజీనామా చేసే వరకు నా పోరాటం ఆగదు

సునీత కుటుంబానికి పదవులు? చంద్రబాబు ను కలవడానికి కారణం కూడా.. షాకింగ్ నిజాలు

YSRCP ఎమ్మెల్యే విరుపాక్షికి బెయిల్‌

వెనక్కి తగ్గిన కేంద్రం.. UPI చార్జీలు వాయిదా

YS జగన్ దృష్టిలో BC అంటే బ్యాక్ బోన్ క్లాసెస్

Photos

+5

రణబాలి మూవీ ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌లో స్పెషల్ మూమెంట్స్.. (ఫోటోలు)

+5

శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

జిమ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ దివి కసరత్తులు చూశారా?.. (ఫోటోలు)

+5

ది ప్యారడైజ్‌ ఏషనాగుల కట్టమీద సాంగ్‌ వర్కింగ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫోటోలు

+5

విజయవాడ : విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

తల్లికి బంగారు పతకం, తండ్రి, కుమార్తెకు పీజీ డిగ్రీలు (ఫొటోలు)

+5

తెరపై చూసిన నానా కాదు.. ఈ విలక్షణ ఫొటోలు చూడండి!

+5

హైదరాబాద్ : భళా..సరస్‌ మేళా (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)