Breaking News

76 ఏళ్ల వయసులో జోరుగా ట్రైసెప్ డిప్స్ : ఈ యాక్టర్‌కి ఫ్యాన్స్‌ ఫిదా!

Published on Fri, 05/01/2026 - 11:52

ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తన ఫిట్‌నెస్‌ మంత్రాతో అందర్నీ అశ్చర్య పరుస్తున్నారు. 76 ఏళ్ల వయసులో కూడా చాలా సునాయాసంగా ట్రైసెప్ డిప్స్ (Tricep Dips)  చేస్తూ అటు ఫిట్నెస్‌ ఇండస్ట్రీని, ఇటు ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు. దీనికి వీడియో ఒకటి వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది

ప్రముఖ ఫోటోగ్రాఫర్ అండ్‌  ప్రొడ్యూసర్ అతుల్ కస్బేకర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. "నానా సాహెబ్.. మీరు నా ఫిట్‌నెస్ లక్ష్యాలను మార్చుకునేలా చేశారు. ఆయన వయసు 76 ఏళ్లు. ఆయన 15 రెప్స్ చేశారు, నేను రికార్డింగ్ ఆలస్యంగా మొదలుపెట్టాను" అంటూ  అతుల్  ఈవీడియోను పోస్ట్‌ చేశారు. ఈ వీడియోలో నానా పటేకర్ తెల్లటి బనియన్, షార్ట్స్ ధరించి, మెడలో గమ్చా వేసుకుని బార్‌పై ఎంతో అలవోకగా ఎక్సర్‌సైజ్ చేస్తూ కనిపించారు. దీనిపై నటీమణులు శిల్పా శెట్టి, రాహుల్ దేవ్ వంటి సినీ ప్రముఖులు కూడా ఈ వీడియోను చూసి ప్రశంసలు కురిపించడం విశేషం.

నెటిజన్లు ఫిదా
ఈ వయసులో కూడా నానా పటేకర్ తన క్రమశిక్షణ, ఫిట్‌నెస్‌, పవర్‌  చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. "నానా సార్.. మీరు ఒక స్ఫూర్తి" అని కొందరు, "నిజమైన బలం అంటే ఇదే" అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.వయసు కేవలం సంఖ్య మాత్రమేనని, క్రమశిక్షణ ఉంటే ఏ వయసులోనైనా ఫిట్‌గా ఉండవచ్చని నానా పటేకర్ మరోసారి నిరూపించారు.

ఇక నానా పటేకర్‌ వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే.. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన 'ఓ రోమియో' (O'Romeo) సినిమాలో నానా పటేకర్ కనిపించారు. షాహిద్ కపూర్, తృప్తి దిమ్రి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో ఆయన ఒక పోలీసు అధికారి పాత్రను పోషించారు.

Videos

ట్రంప్ పై దాడి Live వీడియో.. ఇలా వచ్చాడు.. అలా కాల్చాడు

వివాదంలో పంజాబ్ సీఎం.. మద్యం సేవించి అసెంబ్లీకి..?

పాలకొల్లులో అరుదైన ఘటన.. పది ఫలితాల్లో తల్లీకొడుకులు ఒకే సారి పాస్

ఆరుగురితో కాదు 36 మందితో చాటింగ్.. సీతారాం పెన్ డ్రైవ్ లో సంచలనాలు..

భార్య పాపులారిటీ తట్టుకోలేక నరికి చంపిన భర్త

బాలీవుడ్ హీరోతో పూజా హెగ్డే ప్రేమ..?

ఖమ్మం రాము మర్డర్ కేసులో వీడని మిస్టరీ

వేధింపుల్లో బాబు కొత్త ట్రెండ్

మన్యం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

EVMల టాంపరింగ్.. బెంగాల్లో షాకింగ్ వీడియో

Photos

+5

ప్రెగ్నెన్సీతో మ్యాడ్ స్క్వేర్‌ బ్యూటీ రెబా మోనికా జాన్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటి మీనా వాసు మ్యారేజ్ డే.. భర్తకు స్పెషల్ విషెస్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో వరలక్ష‍్మి శరత్‌కుమార్‌ (ఫొటోలు)

+5

గ్లామర్ ఓవర్‌లోడెడ్.. మెరిసిపోతున్న కియారా (ఫొటోలు)

+5

సెలబ్రేషన్స్, డివోషనల్ ట్రిప్స్.. అల్లు స్నేహ ఏప్రిల్ గడిచిందిలా (ఫొటోలు)

+5

కూవాగంలో హిజ్రాల పెళ్లి సందడి..ఎందుకో తెలుసా? (ఫొటోలు)

+5

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి HD ఫొటోలు

+5

భారీ వర్షం : బెంగళూరు అతలాకుతలం (ఫొటోలు)

+5

తిరుచానూరు : వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు (ఫోటోలు)

+5

మల్లెపూల దండలతో సురేఖవాణి బర్త్ డే వేడుక.. ఢిఫరెంట్‌ లుక్‌లో కనిపించిన నటి (ఫోటోలు)