Breaking News

శోభితతో ప్రేమ గురించి తొలిసారి నోరు విప్పిన నాగ చైతన్య

Published on Tue, 12/17/2024 - 12:39

అక్కినేని అందగాడు హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ మూడుముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి  తెలిసిందే.   పెళ్లయి పక్షం రోజులు గడుస్తున్నా ఇంకా పెళ్లి ముచ్చట్టుసోషల్‌మీడియాలో సందడి చేస్తూనే  ఉన్నాయి. 

తాజాగా ఈ లవ్‌బర్డ్స్‌ని ఇంటర్వ్యూ  చేసి, వారి ప్రేమ ప్రయాణం  గురించి  ఆంగ్ల పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ ఒక కథనాన్ని ప్రచురించింది. దీన్ని నాగచైతన్య రెండో భార్య  శోభిత తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. అలాగే తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి కూడా కమెంట్‌ చేసింది.  దీంతో  న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం వైరల్‌గా మారింది.

ఈ ఇంటర్వ్యూలో  నాగ చైతన్య చాలా విషయాలను  పంచుకున్నాడు. ముఖ్యంగా  శోభితతో  తన ప్రేమ, ఆమెపై అభిమానాన్ని  పెంచుకోవడానికి గల కారణాలను షేర్‌ చేశాడు.  శోభిత నిజాయితీ తనకు బాగా నచ్చిందని కామెంట్‌ చేశాడు.  తాను పుట్టింది హైదరాబాదులోనే అయినా పెరిగింది మొత్తం చెన్నైలోనే అనీ, అందుకే తనకు తెలుగు సరిగ్గా రాదని చెప్పుకొచ్చాడు. శోభిత తెలుగు, తనను ఆమెకు మరింత దగ్గరి చేసిందని వెల్లడించాడు.  ఆమె స్వచ్ఛమైన తెలుగు, తనను మూలాల్లోకి తీసుకెళ్లిందని అదే ఆమెకు దగ్గరి చేసిందని తెలిపాడు. మాతృభాషలోని వెచ్చదనం తమ ఇద్దరి మధ్యా ప్రేమను చిగురింప చేసిందన్నాడు నాగ చైతన్య.

శోభితా ప్రేమలో ఎలా పడ్డాడో వివరిస్తూ ఆమె‘మేడ్ ఇన్ హెవెన్ స్టార్' ఆమె మాటలు చాలా లోతుగా ఉంటాయి అంటూ భార్యను పొగడ్తల్లో ముంచెత్తాడు. ఆమె నిజాయితీతో తాను ప్రేమలో పడిపోయానని వెల్లడించాడు. శోభిత సోషల్‌మీడియా పోస్ట్‌లు ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి అని పేర్కొన్నాడు. అంతేకాదు ఆమె పోస్ట్‌ చేసే బ్లర్‌ ఫోటోలే తనకిష్టం, అంతేకానీ,  గ్లామర్‌ కోసం, ప్రచారం కోసం  పీఆర్‌ టీం చేసే ఫోటోలు కాదంటూ వ్యాఖ్యానించాడు. 

సినిమా షూటింగ్‌లో ఉండగానే రెండు నెలల్లో తన పెళ్లిని ప్లాన్ చేసుకున్నట్లు శోభితా ధూళిపాళ వెల్లడించింది. ఇద్దరమూ మాట్లాడుకుని, ప్రధానంగా  చైతన్య కోరికమేరకు  సన్నిహితుల సమక్షంలో  చాలా సింపుల్‌గా, సంప్రదాయ బద్ధంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పింది.  తమ వివాహం ఆధ్మాత్మికంగా, దేవాలయం అంత పవిత్ర భావన కలిగిందంటూ తన పెళ్లి ముచ్చట్లను పంచుకుంది.  దీంతో నెటిజన్లు  విభిన్నంగా స్పందిస్తున్నారు. 

కాగా డిసెంబర్ 4 న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ   వివాహం వైభంగా జరిగింది. అంతకుముందు ఆగష్టు 8న నిశ్చితార్థం వేడుకతో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. శోభితతో పెళ్లికిముందు టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంతాను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య , ఆ తర్వాత ఆమెకు విడాకులిచ్చిన సంగతి తెలిసిందే.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)