Breaking News

ప్లీజ్‌..నో సప్లిమెంట్స్‌..!

Published on Sun, 05/18/2025 - 13:21

మీకు విటమిన్‌ ఇ లోపం ఉంది.. మీకు ప్రోటీన్స్‌ సరిపోవడం లేదు.. ఈ సప్లిమెంట్స్‌ తీసుకోండి.. అంటూ సూచించే వైద్యులు, పోషకాహార నిపుణులతో పాటు వాటిని వినియోగించే నగరవాసులూ పెరిగిపోయారు. ఈ నేపథ్యంలో సప్లిమెంట్స్‌ను అతిగా వినియోగించవద్దని హైదరాబాద్‌ నగరానికి చెందిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌(ఎన్‌ఐఎన్‌) ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధన ఫలితం ఆధారంగా సూచిస్తోంది. అధిక సప్లిమెంట్స్‌ వాడకం హానికరం అంటున్న ఎన్‌ఐఎన్‌.. దానికి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సూచిస్తోంది. 

బలవర్థకమైన ఆహారాల నుంచి దొరకని పోషకాలను సప్లిమెంట్లు/మాత్రలు/క్యాప్సూల్స్‌ అందిస్తాయి అనేది నిజమే అయినా కొన్ని పోషకాలను సప్లిమెంట్‌లుగా తీసుకోవడం వల్ల ఇతర పోషకాల సహజ శోషణకు ఆటంకం కలుగుతుందని ఎన్‌ఐఎన్‌ హెచ్చరిస్తోంది. రోజువారీ పోషకాహార అవసరాలను తీర్చడానికి సప్లిమెంట్లపై అధికంగా ఆధారపడటం ఆరోగ్యానికి హానికరం అని స్పష్టం చేస్తోంది. తాము సూచించిన ‘మై ప్లేట్‌ ఫర్‌ ది డే’లో సూచించిన సమతుల ఆహారం ద్వారా అందేవి మరే ఏ విటమిన్‌ లేదా మినరల్‌ సప్లిమెంట్లు అందించలేవని స్పష్టం చేస్తోంది. 

’మై ప్లేట్‌ ఫర్‌ ది డే’  
మన రోజువారీ అవసరాలకు అనుగుణంగా అన్ని పోషకాలు మన శరీరానికి అందేందుకు మై ప్లేట్‌ ఫర్‌ ది డే అనే ఆసక్తికరమైన మెనూను ఎన్‌ఐఎన్‌ రూపొందించింది. ఇది మన ఆహారంలో అవసరమైన పోషకాహార స్పష్టతను అందిస్తుంది. రోజువారీ ఆహారం కోసం వివిధ ఆహార సమూహాల ఖచ్చితమైన నిష్పత్తులను అర్థం చేసుకోవడానికి ఇది మార్గనిర్దేశం చేస్తుంది. ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులను ప్రోత్సహించడానికి ‘భారతీయుల పోషక అవసరాలు’ ఆధారంగా దీన్ని డిజైన్‌ చేశారు. 

రోజుకు 2వేల కేలరీలు.. అదే ఆరోగ్యానికి మేలు 
వ్యక్తులు(చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కాకుండా) తమ పోషక అవసరాలను తీర్చుకునేందుకు రోజుకి 2 వేల కిలో కేలరీలు/ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుందని ‘మై ప్లేట్‌ ఫర్‌ ది డే’ చెబుతోంది. అయితే ఇది కేవలం కేలరీలు అందించే ఆహారం మాత్రమే కాకూడదని, దీనిలో శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు, ఖనిజాలు, ప్రొటీన్లు, విటమిన్లు ఇతర బయోయాక్టివ్‌ సమ్మేళనాలు.. ఇలా ఆరోగ్యపరమైన అవసరాలను తీర్చడానికి సరైన నిష్పత్తిలో ఉండాలని సూచిస్తోంది.  

రోజుకి 2వేల కిలో కేలరీల ఆహారం కోసం.. 
కూరగాయలు ఆకు కూరలు: 400 గ్రాములు(ముడి బరువు), 
మిల్లెట్లతో సహా తృణధాన్యాలు: 260 గ్రాములు, 
పండ్లు: 100 గ్రాములు, 
పప్పులు/గుడ్లు/మాంసపు 
ఆహారాలు: 85 గ్రాములు, 
గింజలు విత్తనాలు: 30 గ్రాములు,  
కొవ్వులు నూనె: 27 గ్రాములు, 
పాలు/పెరుగు: 300 మి.లీ.

శోషించే ఆహారమే.. మేలు 
ఆరోగ్యకరమైన సహజ ఆహారాలను శరీరం బాగా గ్రహిస్తుంది. అంతేకాకుండా అవి ఎక్కువ జీవ లభ్యతను కలిగి ఉంటాయి. విటమిన్లు ఖనిజాల తీవ్రమైన కొరతతో బాధపడుతున్న వ్యక్తుల కోసం, అన్ని సూక్ష్మపోషకాలు, బయోయాక్టివ్‌ సమ్మేళనాలు, ఫంక్షనల్‌ ఫుడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు మొదలైన వాటిని తగినంతగా తీసుకోవడం మంచిదని ఎన్‌ఐఎన్‌ సూచిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని పోషకాలతో కూడిన ‘మై ప్లేట్‌ ఫర్‌ ది డే’ ఎలా ఉండాలో డిజైన్‌ చేసి అందిస్తోంది. 

స్నాక్స్‌.. ఆరోగ్యకరంగా.. 
అవసరమైన కేలరీలకు మించకుండా స్నాక్స్‌ తినడం వల్ల నష్టం లేదు. కొన్ని రకాల స్నాక్స్‌ బరువు తగ్గడానికి సహకరిస్తుంది అంటున్నారు పోషకాహార నిపుణులు డాక్టర్‌ రోహిణి పాటిల్‌. స్నాక్స్‌గా ఆయన గుప్పెడు కాలిఫోరి్నయా ఆల్మండ్స్‌ సూచిస్తున్నారు. ఈ బాదంలో ప్రోటీన్, మెగ్నీషియం, విటమిన్‌ ఇ జింక్‌ వంటి 15 ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. గుండె ఆరోగ్యం, చర్మ ఆరోగ్యం, బరువు నిర్వహణకు ఇవి బెస్ట్, అలాగే నూనె లేకుండా వండిన మూంగ్‌ దాల్‌ చిల్లా బరువు తగ్గడానికి అనుకూలమైన

మరొక చిరుతిండి. మూంగ్‌ దాల్‌(పెసర పప్పు)లో పొటాషీయం, మెగ్నీషియం, ఇనుము, రాగి పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం రెండింటికీ మంచిది. పెసర శనగల మొలకలతో తయారైన భేల్‌లో రుచికరమైన స్నాక్‌. దోసకాయ, టమోటాలు, పచ్చి మామిడి, నిమ్మరసంతో కలిపిన మొలకలు, భేల్‌ ఫైబర్, విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది. 

(చదవండి: చాయ్‌ చమక్కులు..! ఏమి'టీ' వింతలు!)

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)