ఖర్చు లేకుండా.. ప్రశాంతతను చేకూర్చే సహజ ఔషధం ఇదే..!

Published on Sat, 06/20/2026 - 09:41

ఎలాంటి ఖర్చు లేకుండా మనస్సుకు ప్రశాంతతను చేకూర్చే ఒక అద్భుతమైన సహజ ఔషధం మ్యూజిక్‌. కేవలం వినోద సాధనంగానే కాకుండా, శారీరక, మానసిక ఆరోగ్యానికి కూడా సంగీతం ఒక దివ్యౌషధంగా పనిచేస్తోందని పరిశోధనలు చెబుతున్నాయి.

  • శాస్త్రీయ సంగీతం మనస్సుకు ఎనలేని ప్రశాంతతను, నిశ్చలతను ఇస్తే, రాప్‌ సంగీతం జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు మానసిక బలాన్ని, ఉత్సాహాన్ని నింపుతుంది. అలాగే పక్షుల కిలకిలరావాలు, వాన జల్లుల చప్పుడు, సముద్రపు అలల ధ్వనులు గుండె వేగాన్ని నియంత్రించి, ఒత్తిడిని పూర్తిగా దూరం చేస్తాయి.

  • అందువల్ల మనకు నచ్చిన సంగీతాన్ని వినడం వల్ల మన మెదడులోని రసాయన ప్రక్రియల్లో సానుకూల మార్పులు వస్తాయి. ఇది ఒత్తిడిని కలిగించే హార్మోన్లను తగ్గించి, మూడ్‌ను మెరుగుపరుస్తుంది. ప్రతికూల ఆలోచనల నుంచి మనస్సును పక్కకు మళ్లించడానికి ఇది ఒక సులువైన మార్గం.

  • ఆఫీసులో ప్రతిరోజూ 30 నిమిషాల పాటు సంగీతం వినే ఉద్యోగుల్లో కేవలం నెల రోజుల్లోనే ఒత్తిడి స్థాయిలు భారీగా తగ్గినట్లు పరిశోధనల్లో గుర్తించారు.

  • అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు ఉత్సాహభరితమైన పాటలు వింటూ ఇల్లు లేదా డెస్క్‌ శుభ్రం చేసుకోవడం వల్ల అలసట తెలియదు. అలాగే, చదువుకునేటప్పుడు లేదా ఆఫీస్‌ పనులు చేసేటప్పుడు లిరిక్స్‌ లేని కేవలం ఇ¯Œ స్ట్రుమెంటల్‌ సంగీతాన్ని బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కాసేపు ప్రశాంతత కోసం హెడ్‌ఫోన్స్‌ తగిలించుకుని మీకు నచ్చిన సంగీత ప్రపంచంలోకి వెళ్ళిపోవడమే ఒత్తిడికి సరైన పరిష్కారం!  

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)