Breaking News

వరల్డ్ టాప్ ఫుడ్ సిటీస్‌ : టాప్‌-5లో ముంబై, అయ్యో హైదరాబాద్!

Published on Thu, 12/12/2024 - 15:39

ప్రపంచంలోనే అత్యుత్తమ ఆహారం నగరం జాబితాలో  వాణిజ్య రాజధాని  టాప్‌ -5లో చోటు దక్కించుకుంది.ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్, టేస్ట్ అట్లాస్  2024-25 సంవత్సరానికి సంబంధించిన తాజా లిస్టును ప్రకటించింది.  వాటిలో అనేక స్థానాల్లో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది. అయితే గత ఏడాదితో పోలిస్తే ముంబై నగరం టాప్‌ప్లేస్‌కి  ఎగబాకగా హైదరాబాద్‌, 50వ స్థానానికి పడిపోయింది.

ముంబై ప్రపంచంలో 5వ అత్యుత్తమ ఆహార నగరంగా నిలిచింది. టేస్ట్ అట్లాస్ అవార్డ్స్ 2024-25లో భాగంగా, ఫుడ్ గైడ్ వివిధ వర్గాలలో ర్యాంకింగ్‌లను విడుదల చేసింది.

"ప్రపంచంలోని 100 ఉత్తమ ఆహార నగరాల" జాబితాలో ముంబై 5వ స్థానంలో నిలిచింది.తొలి నాలుగు స్థానాలకు ఇటలీలోని నగరాలు  చోటు  సంపాదించాయి. నేపుల్స్, మిలన్, బోలోగ్నా, ఫ్లోరెన్స్. ముంబై తర్వాత రోమ్, పారిస్, వియన్నా, టురిన్ , ఒసాకా టాప్ 10లో ఉన్న నగరాలుగా ఉన్నాయి. అయితే ఈ జాబితాలో ఇతర భారతీయ నగరాలు కూడా చోటు దక్కించుకున్నాయి, వాటిలో మూడు ముంబైతో పాటు టాప్ 50లోకి వచ్చాయి. అమృత్‌సర్ 43వ స్థానంలో, న్యూఢిల్లీ 45వ స్థానంలో, హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా 50వ స్థానంలో నిలిచాయి. కోల్‌కతా 71వ స్థానంలో ఉండగా, చెన్నై 75వ స్థానంలో నిలిచింది. 

 అలాగే టేస్ట్ అట్లాస్ అవార్డ్స్ 2024-25లో భాగంగా, ప్రపంచంలోని అత్యుత్తమ వంటకాల ర్యాంకింగ్‌ను కూడా ప్రకటించింది. భారత్ టాప్ 10లో చోటు దక్కించుకోలేకపోయినప్పటికీ  మెరుగ్గానే ఉందని తెలిపింది. కాగా గత ఏడాది  ఈ జాబితాలో ముంబై35, హైదరాబాద్  39వ స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీ 56వ స్థానంలోనూ, చెన్నై, లక్నో 65, 92 స్థానాల్లోనూ నిలిచాయి. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)