Breaking News

Mukesh Ambani Birthday ముఖేష్‌ అంబానీ బర్త్‌డే బాష్‌, ఇదే హైలైట్‌!

Published on Sun, 04/20/2025 - 17:40

భారతీయ వ్యాపార  దిగ్గజం అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు రిలయన్స్‌ సామ్రాజ్యాన్ని అప్రతిహతంగా విస్తరించిన ముఖేష్‌ అంబానీ (Mukesh Ambani. రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industties) చైర్మన్‌గా, దేశంలోనే  కాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరుగా ఎదిగారు. ఏప్రిల్‌ 19న 68వ ఏట ప్రవేశించారు.   ఈ సందర్భంగా ముఖేష్‌ అంబానీ కోసం నీతా అంబానీ (Nita Ambani) గ్రాండ్‌ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట సందడిగా మారింది.

ముఖేష్ అంబానీ  బర్త్‌డే (Ambani birthday) వేడుకలను  అంబానీ కుటుంబం అత్యంత ఘనంగా  నిర్వహించింది. అంబానీ అప్‌డేట్ అనే అభిమానుల పేజీ కొన్ని ఫోటోలను షేర్‌ చేసింది.  ఇందులో రంగోలి రంగులు ,పువ్వులతో తీర్చిదిద్దిన  అంబానీ జంట ఫోటోల ప్రత్యేకమైన రంగోలి హైలైట్‌గా నిలిచాయి. నీతా అంబానీ నారింజ రంగు చీరలో అందంగా కనిపించారు. వేడుకల్లో భాగంగా ముఖేష్‌, నీతా అంబానీ దంపతులు  దుర్గామాతకు ప్రత్యేక పూజలు  నిర్వహించారు.

 ప్రముఖ మెహందీ కళాకారిణి వీణా నగ్దా ఇన్‌స్టాగ్రామ్‌లో రిలయన్స్ బాస్‌కి    చక్కటి పుట్టినరోజు సందేశాన్ని పంచుకున్నారు.  ఆసియాలో అత్యంత ధనవంతుడైనప్పటికీ, అంబానీ ఎంత "ది డౌన్ టు ఎర్త్" ఉంటారంటూ ప్రశంసించింది. కొన్ని దశాబ్దాలుగా అంబానీ కుటుంబ వేడుకల్లో వీణా మెహిందీ ఉండాల్సిందే. 0 సంవత్సరాల క్రితం జరిగిన తన వివాహంలో ముఖేష్ అంబానీ సోదరి దీప్తి సల్గావ్‌కర్‌  మొదలు 2024లో, అనంత్-రాధికల గ్రాండ్ వెడ్డింగ్‌ వేడుకదాకా అందర్నీ మెహందీడిజైన్స్‌తో  అలంకరించింది. 

కాగా ముఖేష్ అంబానీ దివంగత ధీరూభాయ్ అంబానీ ,కోకిలాబెన్ అంబానీ దంపతుల పెద్ద కుమారుడు. 1957, ఏప్రిల్ 19,  యెమెన్‌లో జన్మించారు. 2002లో ధీరూభాయ్ అంబానీ మరణించిన తర్వాత, సోదరులు ముఖేష్,అనిల్ అంబానీ  మధ్య వైరం కారణంగా కుటుంబ సామ్రాజ్యం  చీలిపోయింది. తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన ముఖేష్‌ అంబానీ  రిలయన్స్‌ సామ్రాజ్యాన్ని అంచెలంచెలుగా వివిధ రంగాలకు విస్తరించారు.  ఆయిల్‌ నుంచి  జియో ద్వారా టెలికాం సేవలు, రిలయన్స్ రిటైల్‌ రంగ సేవలతో విప్లవాత్మక మార్పులతో ఆసియా బిలియనీర్‌గా ఎదిగారు. ముఖేష్‌  సంతానం ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్‌  అంబానీ కూడా  కుటుంబ  వ్యాపారంలో రాణిస్తున్న సంగతి తెలిసిందే.  2025 ఏప్రిల్ నాటికి ముఖేష్‌ అంబానీ  ఆస్తి విలువ. దాదాపు రూ. 7.1 లక్షల కోట్లు. ఫోర్బ్స్ ప్రకారం  ప్రపంచంలోని టాప్ 15 ధనవంతుల్లో ఒకరుగా అంబానీ ఉన్నారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)