Breaking News

ముఖేష్‌ అంబానీ: ఏ వర్కౌట్స్‌ లేకుండానే 15 కిలోలు తగ్గాడట, ఎలా?

Published on Fri, 04/19/2024 - 16:21

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్  అధినేత  ముఖేష్ అంబానీ ఈ  రోజు 67వ ఏట అడుగుపెట్టాడు.  బిజినెస్ మాగ్నెట్, ఆసియాకుబేరుడు ముఖేష్‌ అంబానీ,  ధీరూభాయ్ అంబానీ, కోకిలా బెన్‌ దంపతులకు 1957 ఏప్రిల్ 19న  యెమెన్‌లో పుట్టాడు.  వ్యాపార కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ, కెమికల్ ఇంజనీరింగ్‌ చదివిన అంబానీ తన సామర్థ్యం, కృషితో రిలయన్స్‌ను ప్రపంచంలోనే ప్రముఖ వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించాడు. భారతదేశంలోనే కాదు ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా,  ప్రపంచంలోని టాప్ బిలియనీర్ల జాబితాలో 11వ స్థానంలో  నిలవడం విశేషం.

రిలయన్స్‌ వ్యాపార సామ్రాజ్య బాధ్యతలను తన వారసులు, ఇషా అంబానీ పిరమల్, ఆకాష్ అంబానీ,  అనంత్ అంబానీలకు  పంచి ఇచ్చినప్పటికీ 67 ఏళ్ల  వయసులో కూడా వ్యాపార దక్షతలో చురుగ్గా ఉంటాడు. అటు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో కీలకమైన వ్యాపార నిర్ణయాలతోపాటు ఇటు కుటుంబ బాధ్యతలను కూడా దిగ్విజయంగా నిర్వరిస్తున్నాడు. అంతేకాదు తన ఆరోగ్యాన్ని, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంలో కూడా దిట్ట. ఆయన పాటించే ఆహారం నియమాల గురించి ఎవరికీ పెద్దగా తెలియనప్పటికీ, ఎలాంటి వర్కవుట్ లేకుండానే ముఖేష్ అంబానీ 15 కిలోలు తగ్గారట. ఈ సందర్బంగా ఆయన డైట్‌ , జీవన శైలి  ఏంటి  అనేది చర్చలో నిలిచింది.  (యూట్యూబర్‌ ఓవర్‌ యాక్షన్‌.. దిమ్మతిరిగే షాక్‌!)

కఠినమైన ఆహార నియమాలతోనే ముఖేష్ అంబానీ ఈ అద్భుత ఫలితాన్ని సాధించారని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.  ప్రపంచంలోని  ఇతర సక్సెస్‌ఫుల్‌ వ్యక్తుల మాదిరిగానే  ముఖేష్ అంబానీ యోగా, ధ్యానంతో  రోజు  ప్రారంభిస్తాడు. ఉదయం 5:30 గంటలకు మేల్కొంటాడు. యోగా, ధ్యానం సూర్య నమస్కారాలు, వాకింగ్‌ కోసం బయటికి కూడా వెళ్తాడు. ఎంత బిజీషెడ్యూల్‌ ఉన్నా ఈ  ఉదయపు దినచర్యను  మాత్రం ఎప్పుడూ దాటవేయడు. (మోడ్రనే కానీ, నాకు అలా బిడ్డను కనే ధైర్యం లేదు : మసాబా వ్యాఖ్యలు వైరల్‌)

బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌ డిన్నర్‌ ఇలా..
అంబానీ స్ట్రిక్ట్ వెజిటేరియన్ డైట్‌ని ఫాలో అవుతారు. ఆల్కహాల్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటాడు.  ఇక రోజులోని అంబానీ తొలి భోజనం విషయానికి వస్తే అల్పాహారంలో తాజా పండ్లు, జ్యూస్, ఇడ్లీ-సాంబార్ తీసుకుంటాడు. లంచ్‌, డిన్నర్‌ కూడా సాంప్రదాయ భారతీయ ఆహారాలతో చాలా  సింపుల్‌గా కానిచ్చేస్తారట. గుజరాతీ తరహాలో దాల్, సబ్జీ, అన్నం, సూప్‌లు , సలాడ్‌లను ఇష్టపడతాడు. అది కూడా  ఇంట్లో వండిన భోజనం మాత్రమే. 

కాగా ముఖేష్‌ అంబానీ భార్య నీతా అంబానీ  రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్‌పర్సన్, వ్యవస్థాపకురాలిగా ఐపీఎల్‌ జట్టుకు ఓనర్‌గా ఉన్నారు. నీతా, అంబానీ దంపతులు ఇప్పటికేపెద్ద కుమారుడు ఆకాష్‌​ అంబానీకి, కుమార్తె ఇషా అంబానీకి వివాహాలు జరపించారు.  నలుగురు మనవలు కూడా ఉన్నారు. ఇక చిన్న కొడుకు అనంత్‌ అంబానీ పెళ్లి ఈ ఏడాది జూన్‌లో జరగనుంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)