Breaking News

కొత్తిమీరతో జస్ట్‌ 30 రోజుల్లోనే రూ. లక్ష లాభం!.. శెభాష్‌

Published on Thu, 11/20/2025 - 14:08

పంట పెట్టుబడి..తక్కువ అధిక అధాయం వస్తే ఏ రైతు అయినా సంతోషంతో ఎగిరిగంతేస్తాడు. అది కూడా సాదాసీదా చిన్న పంటగా వేసిందే ఊహించని రేంజ్‌లో లాభం వస్తే ఆ సంతోషానికి అవధులు ఉండవు కదా..!. అలాంటి ఆనందంతోనే తడిసిముద్దవుతోంది ఈ యువ రైతు శివానీ పవార్‌. మరి ఆమె ఈ సక్సెస్‌ ఎలా అందుకుందంటే..

మధ్యప్రదేశ్‌కి చెందిన యువ రైతు శివానీ తాను ఎలా చిన్న పంటతో తక్కువ టైంలో అధిక లాభం ఆర్జించిందో ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలో షేర్‌ చేసుకుంది. అది నెటిజన్ల దృష్టిని అమితంగా ఆకర్షించడమే గాక ఈవిషయం నెట్టింట వైరల్‌గా మారింది. తాను ఒక చిన్న కొత్తిమీర కట్టతో జస్ట్‌ 30 రోజుల్లోనే రూ. లక్ష రూపాయాలు లాభం అందుకున్నానని వీడియోలో పేర్కొంది. తన ఖర్చులు, పెట్టుబడి అన్నింటిని తీసేస్తే..9 టు 5 జాబ్‌ చేసే వారికంటే మెరుగైనా ఆదాయాన్ని ఆర్జించానని అంటోంది. 

తన చిన్న పొలంలో కొత్తిమీర పంట వేశానని, అది 30 రోజుల్లోనే కోతకు వచ్చిందని వివరించింది. ఆ తర్వాత అమ్మకాలు రూ. 1.25 లక్షలకు చేరాయని పేర్కొంది. తనకు ఈ పంటకు, విత్తనాలు, ఎరువు, కూలీ, నీటి పారుదల..ఇలా అన్నింటికి కలిపి మొత్తం రూ. 16,000లే ఖర్చు అయ్యాయని చెప్పుకొచ్చింది. రోజువారి వంటలో ఉపయోగించే కొత్తిమీరకు తక్కువ పెట్టుబడి అవుతుందని, అయితే స్వల్పకాలంలోనే అధిక టర్నోవర్‌ని ఇచ్చే పంట అని వెల్లడించింది. శీతాకాలంలో ఈ ఆకుకూరకు అధిక డిమాండ్‌ ఉంటుందని..అదే తాను క్యాష్‌ చేసకున్నట్లు పేర్కొంది. 

కొత్తిమీర సాగు..
నేల వాతావరణాన్ని బట్టి కొత్తిమీర సాధారణంగా 30 నుంచి 40 రోజుల్లో ఎకరానికి ఐదు నుంచి పది టన్నుల దిగుబడి వస్తుందట. ఇలాంటి పంటలు వేయాలనుకునే రైతులు ప్రధానంగా గుర్తించుకోవాల్సింది ఏంటంటే..నీటి పారుదల, సరైన విత్తనాలు, పంటను సరిగా నిర్వహించడం తదితరాల పట్ల కేర్‌గా ఉండాలని అంటోంది శివాని. 

తక్కువకాలంలో లాభం అందించే ఈ చక్ర వ్యవసాయం ప్రస్తుతం ట్రెండ్‌గా మారింది. చాలామంది యువ రైతులు ఈ చక్ర వ్యవసాయం ట్రెండ్‌నే అనుసరిస్తున్నారు. అలాంటి చక్ర వ్యవసాయం పంటలు ఏంటంటే..పచ్చి ఉల్లిపాయలు, పాలకూర, మెంతులు, త్వరితగతిన ఆదాయం ఇచ్చే పంటలట. ప్రస్తుతం ఈ చక్ర వ్యవసాయం అనేక రాష్ట్రాల్లో విస్తరిస్తోంది కూడా.

 

(చదవండి: ఒక చిత్రమే..రెండుగా రూపాంతరం..! ఈ టాలెంట్‌కి మాటల్లేవ్‌ అంతే..)

 

Videos

పాకిస్థాన్ కు డిజిటల్ షాక్... హ్యాక్ అవుతున్న ప్రభుత్వ వెబ్ సైట్లు

Varudu: అయ్యో..ఏపీకి చివరి ర్యాంక్..! పోలీసుల పరువు తీసిన అనిత

తెలంగాణ DGP ముందు లొంగిపోనున్న మావోయిస్టు అగ్రనేతలు

జమ్మలమడుగులో ఎవరికి టికెట్ ఇచ్చినా YSRCPని గెలిపిస్తాం: సుధీర్రెడ్డి

టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డికి మాజీ మంత్రి కాకాణి సవాల్

Baba Vanga: మరి కొన్ని రోజుల్లో మరో తీవ్ర సౌర తుఫాను

మావోయిస్టు నేత హిడ్మా ఎన్ కౌంటర్ తరువాత బాడ్సె దేవాపై పోలీసుల ఫోకస్

Chittoor: ATM నగదు చోరీ కేసు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

ఏపీ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా

తెలంగాణ పంచాయతీరాజ్ జీవో విడుదల

Photos

+5

ప్రీమియర్ నైట్.. అందంగా ముస్తాబైన రాశీ ఖన్నా (ఫొటోలు)

+5

తెలుగు యాక్టర్స్ జోడీ మాలధారణ.. పుణ్యక్షేత్రాల సందర్శన (ఫొటోలు)

+5

‘3 రోజెస్’ సీజన్ 2 టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ HD మూవీ స్టిల్స్

+5

హైదరాబాద్ లో శబరిమల అయ్యప్ప ఆలయం..ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిత్రం సక్సెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

తెలంగాణ బిడ్డగా మెప్పించిన గోదావరి అమ్మాయి (ఫోటోలు)

+5

బాలయ్య ‘అఖండ-2 ’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హైటెక్స్ లో 'తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్' చిత్రోత్సవం (ఫొటోలు)

+5

వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)