ఆ అమ్మ చర్మం బిడ్డ బుగ్గలపై చిగురించింది..

Published on Tue, 07/29/2025 - 10:33

తల్లి తన బిడ్డల కోసం ఏ త్యాగం చేయడానికైనా సిద్ధపడుతుందనడానికి సిసలైన ఉదాహరణ ఇది. ఈ తల్లి ప్రమాదంలో చెంపలు కాలిపోయి అందవికారంగా తయారైన తన ఆరునెలల చిన్నారి కోసం తన చర్మాన్ని వొలిచి ఇచ్చింది. ఆ తల్లి త్యాగం ఫలించింది. ఇప్పుడా తల్లీ బిడ్డా ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో చక్కగా ఉన్నారు. తనకేం జరిగిందో తెలియకున్నా అమాయకంగా నవ్వుతూ బిడ్డ ధ్యాన్ష్‌... తన చర్మాన్నిచ్చి కాపాడుకున్నానన్న సంతోషంతో తల్లి మనీషా ఇద్దరూ ఫొటోకు పోజులిచ్చారు. 

గతనెల 12న అహమ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో విమానం కూలి మేఘనినగర్‌లోని బీజే మెడికల్‌ కాలేజీ హాస్టల్, నివాస గృహాలపై పడిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదం జరిగిన సమయంలో సివిల్‌ హాస్పిటల్‌లో యూరాలజీ నిపుణుడైన డాక్టర్‌ కపిల్‌ కచ్చాడియా భార్య మనీషా, వాళ్ల ఆరు నెలల కుమారుడు ధ్యాన్ష్‌ ఇంట్లో ఉన్నారు. 

విమాన శకలం నుంచి చెలరేగిన మంటల్లో మనీషా చేతులు ముఖంపై 25 శాతం కాలిన గాయాలు కాగా, ధ్యాన్ష్‌ ముఖం, రెండు చేతులు, ఉదరం, ఛాతీ కాలి, గాయాలు కావడంతో ఇద్దరినీ కేడీ ఆసుపత్రికి తరలించారు, అక్కడ ధ్యాన్ష్‌ ను పీడియాట్రిక్‌ ఐసియులో చేర్చి వెంటిలేటర్‌పై ఉంచారు. 36 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న ధ్యాన్స్‌కు అతని తల్లి ముప్ఫై ఏళ్ల మనీషా చర్మాన్ని తీసి స్కిన్‌ గ్రాఫ్టింగ్‌ ద్వారా అమర్చారు. 

ఫలితంగా ఎనిమిది నెలల పసివాడు ధ్యాన్ష్‌ ఇప్పుడు చక్కగా నవ్వుతున్నాడు, ప్రాణాంతక కాలిన గాయాల నుండి బయటపడిన అతని బుగ్గలు ఇప్పుడు నునుపుతేలి ఆరోగ్యంతో మెరుస్తున్నాయి. తన నుంచి తీసిన చర్మాన్ని పిల్లాడికి అమర్చి, అతడు కోలుకున్న తర్వాత ఆ బోసి నవ్వులు చూస్తూ మనీషా కూడా త్వరలోనే కోలుకుంది. తల్లి, బిడ్డ ఇద్దరూ జూన్‌ 12న జరిగిన ఏఐ 171 విమాన ప్రమాదం తర్వాత తీవ్రమైన కాలిన గాయాలకు ఐదు వారాల చికిత్స తర్వాత ఇటీవల డిశ్చార్జ్‌ అయినట్లుగా టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా నివేదించింది.

‘ఒక్క క్షణం అంతా నల్లగా అయిపోయింది, ఆపై వేడి మా ఇంటిని చుట్టుముట్టింది. నేను ధ్యాన్ష్‌ను పట్టుకుని దట్టమైన పొగ, మంటల గుండా పరిగెత్తాను. మేము బయటకు వచ్చి ప్రాణాలతో బయటపడగలమని అనుకోలేదు కానీ దేవుడి దయవల్ల, కేడీ హాస్పిటల్‌ వైద్యులు సకాలంలో స్పందించి చేసిన చికిత్స వల్ల ఇద్దరం ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాం. ఇప్పుడు నేను నా బిడ్డ అందమైన నవ్వును తిరిగి చూడగలుగుతున్నాను’’ అంటూ సంతోషం వెలిబుచ్చింది మనీషా. 

కేడీ హాస్పిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆదిత్‌ దేశాయ్‌ మాట్లాడుతూ, ‘ఆ తల్లి తన బిడ్డను కాపాడుకోవడానికి చూపిన  ధైర్యాన్ని, వైద్యులకు అందించిన సహకారాన్ని మాటలలో వర్ణించలేం. మా హాస్పిటల్‌లో ప్రతి విభాగం సమన్వయంతో పనిచేసి సాధ్యమైనంత ఉత్తమమైన ఫలితాలనిచ్చింది’’ అని పత్రికలవారికి తెలిపారు. ఈ సంఘటనలో గాయపడిన ఆరుగురు ప్రమాద బాధితులకు తమ ఆస్పత్రి మానవతా దృక్పథంతో ఉచిత సేవలందించినట్లు తెలిపారు.  

(చదవండి: రుచిని ఆస్వాదిస్తూనే హాయిగా తినొచ్చు ఇలా..! గ్యాస్‌, అధిక బరువు..)

#

Tags : 1

Videos

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)