Breaking News

ఫ్యాషన్‌ ప్రపంచంలో అత్తాకోడళ్ల ప్రభంజనం..! చిన్న బొటిక్ వెంచర్‌ కాస్తా..

Published on Mon, 06/23/2025 - 12:28

అత్తాకోడళ్లు అనగానే నూనె, ఉప్పులా ఉంటారనే భావనే కలుగుతుంది అందరిలో. అత్యంత అరుదుగా కొందరిలోనే సఖ్యత ఉంటుంది. చాలామటుకు..ఆ బంధం..కాస్త ఇబ్బందికరమైన వాతావరణంలానే కనిపిస్తుంది. కానీ ఈ అత్తాకోడళ్ల విషయంలో అందుకు విరుద్ధం. ఆ అత్తాకోడళ్లు తమ అభిరుచులతో ఒక వస్త వ్యాపారాన్ని ప్రారంభించి. ఫ్యాషన్‌కి సరికొత్త అర్థాన్ని ఇచ్చేలా మంచి సక్సెస్‌తో దూసుకుపోతున్నారు. చిన్న బొటిక్‌గా ప్రారంభించి.. నేడు ఫ్యాషన్‌లో ఒక బ్రాండ్‌గా అవతరించి మరీ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారిద్దరూ. ఆ అత్తకోడళ్ల విజయగాథ ఏంటో చూద్దామా..!.

ఫ్యాషన్‌కి సరికొత్త అర్థాన్నిస్తున్న ఆ అత్తకోడళ్లే సర్లా గుప్తా, శిల్పా గుప్తాలు. రెండు దశాబ్దాల క్రితం ఢిల్లీ నడిబొడ్డున చిన్న బోటిక్ వెంచర్‌గా తమ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. ఈ ఇద్దరికి భారతీయ వస్త్రధారణ పట్ల ఉన్న ఇష్టమే..ఈ వెంచర్‌ పెట్టేందుకు దారితీసింది. ఆ ఇరువురు లెహంగాలు, చుడీదార్‌లు నుంచి డ్రేప్డ్ చీరలు వరకు అన్నింటిలో తమ మార్క్‌ ఉండేలా సరొకొత్త విధానంలో డిజైన్‌ చేస్తారిద్దరూ. 

అత్తగారు సర్లా గుప్తా సంప్రదాయ, వారసత్వానికి పెద్దపీట వేస్తే..కోడలు శిల్పా గుప్తా ఆధునికతకు, సృజనాత్మకతకు ప్రాముఖ్యత ఇచ్చేలా డిజైన్‌ చేస్తుంది. వారి విలక్షణమైన డిజైన్‌ శైలి ఒక్కసారిగా ఫ్యాషన్‌ ప్రపంచంలో ఇండో-వెస్ట్రన్ శైలి ముఖచిత్రానే మార్చేసింది. అంతేగాదు ఈ అత్తాకోడళ్లు డైనమిక్‌గా నిర్ణయాలు తీసుకుని రూపొందించిన డిజైనర్‌వేర్‌లు ఈ జనరేషన్‌కు సులభంగా చేరువవ్వడమే గాక ఒక కొత్త ట్రెండ్‌ని సృష్టించాయి. 

అలా వారి చిన్న బొటిక్‌ వెంచర్‌ 'ఘున్‌ఘాట్' అనే ఫ్యాషన్‌ బ్రాండ్‌గా స్థిరపడి అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. బనారసి టిష్యూ చీరల నుంచి సమకాలీన అనార్కలి వరకు, ఘున్‌ఘాట్ కలెక్షన్‌లు కళా సౌందర్యానిక ప్రతీకలుగా నిలిచాయి. ఈ బ్రాండ్‌ డిజైనర్‌వేర్‌లను గుజరాత్, రాజస్థాన్, వారణాసి అంతట ఉన్న హస్తకళాకారులు తయారు చేస్తారు. 

ఇవన్నీ చేతితో రూపొందించిన డిజైనర్‌వేర్‌లు. దాదాపు 200పైగా కళాకారులతో ఈ డిజైనర్‌వేర్‌లు రూపొందుతాయి. ప్రతి లెహంగా లేదా పైథానీ చీర వెనుక హస్తకళాకారుల వారాల తరబడి కష్టం ఉంటుంది. పేయింటింగ్‌ దగ్గర నుంచి, ఎంబ్రాయిడరీ వంటి తుది ఫిట్టింగ్‌ల వరకు ఎక్కడ కూడా షార్ట్‌కట్‌లతో పూర్తి చేయరు. ప్రతీది కళాకారుల చేతుల నుంచి జాలువారే డిజైనర్‌వేర్‌లే కావడం విశేషం. 

కుటుంబంగా కస్టమర్‌లు..
ఘున్‌ఘాట్ బ్రాండ్‌ నుంచి దుస్తులు కొనుగోలు చేసే వ్యక్తుల ఆ బ్రాండ్‌ కుటుంబీకుల్లో ఒకరిగా మారిపోతారట. అంతలా ఆబ్రాండ్‌ వారిని ఆకట్టుకుంటుందట. తమ బ్రాండ్‌ కళకు ఫిదా అయ్యి కస్టమర్లే ప్రకటనదారులగా మారిపోతారట. ఇక ఈ ఏడాది ఘున్‌ఘాట్ "మోడరన్ మహారాణి" కలెక్షన్‌లను ప్రారంభించింది. పాతదనం, కొత్తదనాన్ని మిళితం చేసేలా డిజైన్‌ చేసింది. అంతేకాదండోయ్‌ ఆధునిక టైలరింగ్‌తో చేతితో నేసిన కళను వారధి చేసేలా రెడీ-టు-వేర్ ఫ్యూజన్ పటోలా దుస్తులను కూడా తీసుకురానుందట. 

చివరగా ఈ బ్రాండ్‌ అభివృద్ధి చెందతూ.. త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్యాషన్‌ ప్లాట్‌ఫామ్‌లపై ప్రదర్శనకు సిద్దం కానుంది. అంతేగాదు తమ బ్రాండ్‌ కళాకారుల సమూహంతో వర్క్‌షాప్‌లు కూడా ఏర్పాటు చేయనుంది. తద్వారా తర్వాత తరాలు ఈ సంప్రదాయ పద్ధతుల తెలుసుకునేలా రక్షిస్తోంది. అలా ఫ్యాషన్‌ వస్త్ర పరిశ్రమలో తమ బ్రాండ్‌తో ప్రభంజనం సృష్టించి.. మంచి గుర్తింపును, పేరుని తెచ్చకున్నారు ఈ అత్తాకోడళ్లు సర్లా గుప్తా, శిల్పా గుప్తాల ద్వయం. 

(చదవండి: అప్పుడు ఆర్మీ అధికారి.. కానీ ఇవాళ వీధుల్లో..)
 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)