Breaking News

చిట్టి లవంగం : గట్టి లాభాలు, బరువు కూడా తగ్గొచ్చు!

Published on Thu, 12/26/2024 - 16:08

లవంగం అనగానేపురాతన కాలం నుంచి వంటలలో వాడే మసాలాగా మాత్రమే గుర్తొస్తుంది.  అలాగే పంటినొప్పులకు వాడే లవంగ తైలం గురొస్తుంది.   వాస్తవానికి మసాలా దినుసు లవంగాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఔషధ గుణాలున్న లవంగ మొగ్గను ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా చలి విపరీతంగా ఉన్న ప్రస్తుతం తరుణంలో లవంగాలు చాలా కీలకంగా పనిచేస్తాయి.

ఆహారానికి మంచి రుచి, వాసన ఇచ్చే లవంగాలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా చలికాలంలో వచ్చే అనేక రోగాల బారి నుండి కాపాడుకునేందుకు లవంగాలు ఉపయోపడతాయి. ఫ్రీ రాడికల్స్‌ను నివారిస్తాయి.  లవంగాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది.   రోజుకి రెండు  లవంగాలను  నమలడం వల్ల బరువును  కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు.

ప్రధాన ప్రయోజనాలు

 

  • లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ

  • ముఖ్యమైన పోషకాలూ లభిస్తాయి

  • కడుపులోని అల్సర్‌లను తగ్గిస్తుంది.

  • కాలేయ ఆరోగ్యాన్ని  కాపాడతాయి.

  • క్యాన్సర్ నుండి రక్షించడంలో సహాయపడతాయి.

  • చెడు బ్యాక్టీరియాను మన దరి చేరకుండా కాపాడుతుంది.

  • రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సాయపడుతుంది. 

  • ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

శీతాకాలంలో 
లవంగాలలో ఉండే విటమిన్ ‘సి’ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.  జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులను లవంగం దూరం చేస్తుంది. శీతాకాలంలో లవంగాల  తయారు చేసిన టీ తాగితే జలుబు, గొంతునొప్పి, శ్వాసకోస సమస్యలు, దగ్గ  లాంటివాటికి  ఉపశమనం లభిస్తుంది. వీటిల్లో యాంటీ మైక్రోబియల్, యాంటీసెప్టిక్ లక్షణాలు ఇన్ఫెక్షన్లు దరి చేర నీయవు. 

ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ గుణాలు పొడిదగ్గు, కఫంతో బాధపడే వారికి చాలామంచిది.  కఫం సమస్య బాగా తగ్గుతుంది. ఎసిడిటీ, మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. లవంగాలు శరీరంలోని టాక్సిన్లను తొలగించి చర్మం మృదువుగా ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి.

లవంగాలలో యుజైనాల్ అనే మూలకం యాంటీసెప్టిక్ లా పనిచేస్తుంది. పళ్ళ చిగుళ్ళను కాపాడుతుంది, పంటి సమస్యల నివారణలో పనిచేస్తుంది.   లవంగాలను నమలడం వల్ల పంటినొప్పి తగ్గడంతో పాటు నోటి దుర్వాసన కూడా దూరం అవుతుంది.

ఇతర నొప్పుల నివారణలో కూడా ఇది మెరుగ్గా  పనిచేస్తుంది.  ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు రెగ్యులర్‌గా లవంగాలను వాడడం వల్ల ఉపశమనం కలుగుతుంది. లవంగాలు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.  ముఖ్యంగా టైప్ 2 మధుమేహాన్ని తగ్గిస్తుంది.

చర్మ దురదలను తగ్గించడంలో పెట్రోలియం జెల్లీ, ప్లేసిబో కంటే లవంగం నూనె బాగా పనిచేస్తుందని ఒక అధ్యయనం కనుగొంది.
 

ఇదీ చదవండి: భార్య కోసమే వీఆర్ఎస్, భర్త గుండె పగిలిన వైనం, వీడియో వైరల్‌


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)