Breaking News

దోమకుట్టినట్టైనా లేదు

Published on Mon, 05/26/2025 - 14:55

జనావాసాల్లో ఖాళీ స్థలాలు మురుగు నీటితో గుంతలుగా మారి కంపు కొడుతున్నాయి. ఓనర్ల నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజలకు పాట్లు తప్పడం లేదు. ఇటీవలి వర్షాలతో నగరంతో పాటు శివారు మేడ్చల్‌– మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలలోని పురపాలికల్లో మురుగు సమస్య తీవ్రంగా పరిణమిచ్చింది. ఖాళీ స్థలాల్లో చెత్తా చెదారం, మురుగు నీరు పేరుకుపోయి దోమలు విజృంభిస్తున్నాయి. కాలనీల వాసులు అనారోగ్యం బారిన పడుతున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం గమనార్హం. – సాక్షి, సిటీబ్యూరో

అపరిశుభ్రతకు నిలయాలుగా.. 
పురపాలిక చట్టం ప్రకారం ఖాళీ స్థలాల్లో ఎలాంటి ముళ్ల పొదలు పెరగకుండా, అపరిశుభ్రత లేకుండా స్థల (ప్లాట్ల) ఓనర్లు చూసుకోవాలి. లేదంటే పుర అధికారులు స్థలం యజమానికి నోటీసులు ఇచ్చి శుభ్రం చేయించాలి. కానీ.. శివారు జిల్లాల పరిధిలోని జీహెచ్‌ఎంసీ సర్కిళ్లతో సహా 29 పురపాలికల్లోని పలు కాలనీల్లో ఖాళీ ప్లాట్లు అపరిశుభ్రతకు నిలయంగా మారాయి. భావి అవసరాల దృష్ట్యా కొందరు ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసి అలాగే ఖాళీగా వదిలేస్తున్నారు.  

ఆయా కాలనీల్లో గృహ నిర్మాణాలు ఊపందుకుని, ప్లాట్లకు విలువ పెరిగిన తర్వాత చూద్దాంలే అనుకొని ఏళ్ల తరబడి వదిలేయడంతో చెత్త, ముళ్లకంప చెట్లు పెరిగి దోమలకు నిలయాలుగా మారుతున్నాయి. నగర శివారు జిల్లాల్లోని మేడ్చల్, మల్కాజిగిరి, అల్వాల్, కుత్బుల్లాపూర్‌ తదితర మున్సిపల్‌ సర్కిళ్లతో పాటు జవహర్‌నగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, పోచారం, ఘట్కేసర్, నాగారం, దమ్మాయిగూడ, గుండ్లపోచంపల్లి, తూముకుంట తదితర 29 పురపాలక సంఘాల్లో ఇటీవల కురిసిన వర్షం జల్లులతో కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచి దోమలు పెరగడంతో డెంగీ, మలేరియా, టైఫాయిడ్, వైరల్‌  జ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 

ప్రభుత్వ స్థలాల్లోనూ..  
ప్రైవేటు ప్లాట్ల సంగతి ఇలా ఉంటే.. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు,డంపింగ్‌ యార్డులు  అంతర్గత, ప్రధాన రహదారుల వెంట ఉన్న గ్రీన్‌ బెల్టు తదితర స్థలాలు చెత్తకుండీలుగా, మురుగునీటి నిలయాలుగా మారుతున్నాయి. పందులు, కుక్కలకు ఆవాసాలుగా మారుతున్నాయి. నిర్మాణ వ్యర్ధాలను, భోజన, ప్లాస్టిక్‌ వ్యర్థాలను డంపు చేస్తున్నారు. ప్రతి ఏటా పట్టణ ప్రగతి, ఇతర ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల అమలు సందర్భంగా వీటిని శుభ్రం చేసేందుకు రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. 

కరువైన పర్యవేక్షణ.. 
స్థల యజమానులు తమ ప్లాట్లలో మురుగు, వర్షం నీరు నిలవకుండా, పిచ్చి మొక్కలు పెరగకుండా, ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాల్సిన్నప్పటికీ, పట్టించుకోవటం లేదు. దీన్ని పర్యవేక్షించాల్సిన పురపాలిక అధికారులు.. అటువైటు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో ఆ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగి.. చెత్తాచెదారంతో ఖాళీ ప్లాట్లు మురుగు కూపాలుగా మారుతున్నాయి. సంబంధిత ఓనర్లకు పురపాలక సంఘాలు అడపాదడపా నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకొంటున్నాయి. కొందరి పాట్ల  ఓనర్ల వివరాలు తెలియక నోటీసులు కూడా ఇవ్వకపోవడం గమనార్హం.        

Videos

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

DSC స్కామ్ బట్టబయలు లోకేష్ కి ఇచ్చిపడేసిన వరుదు కళ్యాణి

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ఎంత పెరిగిందంటే..!

కొండా రాజీనామా! కొండా సురేఖ సంచలన నిర్ణయం

ఏ క్యారెట్ బంగారం కొంటే లాభం? పెరుగుతున్న బంగారం ధరలు

ఖర్చుకు భయపడి హైదరాబాద్ లో స్పిరిట్ షూటింగ్.. ఎక్కడంటే..?

ప్రారంభం రోజే పగుళ్లు.. పోలవరంపై పెను ప్రశ్నలు?

ఒక్క Rolex Watch తయారీకి ఎంత సమయం పడుతుంది?

అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టేసిన బాబు

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)