అయోధ్య రామ మందిరాన్ని తలపించే వాచ్‌..ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

Published on Fri, 10/23/2026 - 13:58

ఆధ్యాత్మికత మనం ధరించే వస్తువుల్లో కూడా ఉండాలని చాలామంది భక్తులు భావిస్తారు. వారి కోరిక నెరవేరిలా ప్రముఖ లగ్జరీ బ్రాండ్‌ జాకబ్‌ అండ్‌ కో అయోధ్య రామ మందిరాన్ని తలపించేలా శ్రీరామచంద్ర వాచ్‌ని రూపొందించింది. ఈ బ్రాండ్‌ ఇటీవలే శ్రీరామచంద్ర లిమిటెడ్‌ ఎడిషన్‌ను ఆవిష్కరించింది .అందుకు సంబంధించిన విశేషల గురించి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఇలా పేర్కొంది. 

ఈ బ్రాండ్‌ జాకబ్‌ అండ్‌ కో ఆస్ట్రోనోమియా ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన బ్రాండ్‌. ఇది వాచ్‌పై సౌర కుటుంబాన్నే త్రీడీ రూపంలో ఆవిష్కరిస్తుంది. అలాంటి వాచ్‌ ఆధ్యాత్మికతకు చోటు ఇచ్చేలా శ్రీరామచంద్ర వాచ్‌ని రూపొందించడం విశేషం. ఇలాంటి వాచ్‌లు ప్రపంచంలో కేవలం మూడే మూడు ఉన్నాయంట. 

ప్రత్యేకతలు.. 
ఈ టైమ్‌పీస్‌లో దేవతామూర్తులు చిన్న విగ్రహాల రూపంలో ఉంటాయి. ఆరుగంటల స్థానంలో శ్రీరాముడు, తొమ్మిది గంటల స్థానంలో శ్రీహనుమంతుడు ఆసీనులై ఉంటారు. దాని అక్షం మీద తిరుగుతూ నిమిషానికి ఒక భ్రమణం పూర్తి చేసే నీలిరంగు లక్కపూత పూసిన భూమి ఒకటి ఉంటుంది. దానికి అద్దంలా  12 గంటల స్థానంలో ఒక నిమిషం పాటు తిరిగే ఫ్లయింగ్ టోర్బిలాన్ కేజ్ ఉంది. గంటలు, నిమిషాలు 5ఎన్‌ రోజ్‌గోల్డ్‌ ప్రదర్శితమవుతాయి. 

ఇవి ఆరెంజ్ ఫైర్ ఓపల్‌తో చేసిన ఆఫ్-సెంటర్‌డ్ డయల్‌కు అమర్చబడి ఉంటాయి. ఈ టైమ్‌పీస్ మధ్యలో కుంకుమపువ్వు కలర్‌లో రాయి ఒకటి ఉంది. ఇది సూర్యుడికి ప్రతీకగా నిలిచే జాకబ్-కట్ ఆరెంజ్ క్యూబిక్ జిర్కోనియా. అంతేగాదు అయోధ్య దేవాలయం అంశాలన్నీ మండల నమూనాతో కూడిన నీలిరంగు బేస్‌పై కనిపిస్తాయని సదరు బ్రాండ్‌ వివరించింది. దీంతోపాటు క్లిష్టమైన త్రీడీ నక్షత్ర రాశులు, చేతితో చెక్కిన డ్రాగన్‌లు, జాకబ్-కట్ రత్నాలు తదితరాలు ఉన్నాయి. 

అంతేగాదు దీన్ని 360-డిగ్రీల కోణంలో చూడొచ్చు. అలాగే ప్రతిఅంశం 18-క్యారెట్ల రోజ్ గోల్డ్ కేస్‌లో డిజైన్‌ చేశారు. చివరగా గుమ్మటం ఆకారంలో ఉన్న సఫైర్ క్రిస్టల్ గ్లాస్‌తో ఈ వాచ్‌ ప్రదర్శనను పూర్తి చేశారు. ఇక ఈ వాచ్‌ డయల్‌కి నీలం రంగు అలిగేటర్ లెదర్ స్ట్రాప్‌ని జత చేశారు. ఇంతకీ ఈ గడియారం ధర ఎంతో తెలుసా..అక్షరాల రూ. 4. 25 కోట్లు పలుకుతుందట.

 

ఇదీ చదవండి: రూ. 7 లాటరీ టికెట్‌తో..రూ.కోటి గెలుచుకుంది!

 

 

#

Tags : 1

Videos

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)