Breaking News

హల్దీ ఫంక్షన్‌లో హను​మాన్‌ హల్‌చల్‌.. వైరల్‌ వీడియో

Published on Tue, 02/25/2025 - 14:58

పెళ్లిళ్లల్లో  ఎపుడు ఏం జరుగుతుందో తెలియదు.  మూడుముళ్లూ పడి, అమ్మాయి అత్తారింటికి వెళ్లేదాకా  వధువు తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. మర్యాదలకోసం అత్తింటివారు చేసే ఆగడాలు, పెళ్లి కొడుకు అలకలు, అబ్బో..ఇలాంటి వ్యవహారాలు చాలానే  ఉంటాయి. అందుకే పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్దలు.  కానీ ఒక షాదీలోకి  అనుకోని అతిధి వచ్చి గందరగోళం సృష్టించింది.   పూర్తి వివరాలు  తెలియాలంటే ఈ కథనం చివరిదాకా చదవాల్సిందే.!

పెళ్లి వారంతా హల్దీ వేడుకలో సందడిగా  ఉంటే, ఎక్కడినుంచి వచ్చిందో  ఒక మర్కటం నానా హంగామా చేసింది. సందు చూసుకొని  తన ప్లాన్‌ పక్కాగా అమలు చేసింది. దీనికి తోడు ఇంకో పిల్లకోతి కూడా చేరింది. అతిథుల చేతిలోని పళ్లను  చేతపట్టుకుని  గెంతులేస్తూ అక్కడున్న వారినందరినీ హడలెత్తించింది. దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాలో షేర్‌ అయింది. వధూవరుల హల్దీ సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. అతిథులంతా వధూవరులకు పసుపు పూస్తూ, నవ్వుతూ తుళ్లుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు.  ఉత్సాహంగా పూర్తిగా వేడుకల్లో మునిగిపోయారు. మరికొందరు ఫోటోలు క్లిక్ చేస్తూ బిజీ...బిజీగా ఉన్నారు. 

ఇంతలో, ఒక కొంటె కోతి, దాని పిల్ల ఎంట్రీ ఇచ్చాయి. పళ్లు,పళ్లాలతో  కొతి గెంతులు వేసింది. ఇంతటితో ఆగలేదు.. ఏకంగా పండ్లతో నిండిన పళ్లాన్ని పట్టుకుని కనిపించింది. ఓరి దేవుడా.. అని స్పందించేలోగానే అతిథుల చేతిలోని పండ్లను చేతబట్టుకొని ఇంకోచోటికి తుర్రుమంది. దీంతో  పెళ్లి కొడుకు సహా అందరూ ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.  ఆ తర్వాత మెల్లిగా అక్కడ్నించి జారుకుంది.  కాసేపటికి తేరుకున్న అందదూ నవ్వుల్లో మునిగి పోయారు. మనమూ కోతి నుంచే వచ్చాంగా అనుకున్నారో ఏమోగానీ మరింత అల్లరి చేశారు. దీంతో అప్పటిదాకా ఆందోళనగా ఉన్న  అక్కడి వాతావరణం మంకీ గలాటాతో నవ్వులతో నిండిపోయింది.

;

 

స్వయంగా హనమాన్‌జీ యే వచ్చాడు: నెటిజన్లు
ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హనుమాన్ జీ వివాహాన్ని ఆశీర్వదించడానికి వచ్చాడు" , ‍స్వయంగా హనుమంతుడే దిగివచ్చాడు అని కొందరు, ఏది జరిగినా మన మంచికే అని మరికొందరు, అయ్యో.. ఇంకొన్ని పళ్లు తీసుకుని వెళ్లాల్సి ఉందని  కొంతమంది నెటిజన్లు  సానుకూలంగా స్పందించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)