Breaking News

రైలుతో... ఆమె చెట్టపట్టాలు

Published on Wed, 10/15/2025 - 00:03

మోనిషా రాజేష్‌(Monisha Rajesh)... 42 ఏళ్ల ఈ ట్రావెల్‌ రైటర్‌కు గత 15 సంవత్సరాలుగా రైలే ఇల్లు. 2010లో ఆమె 80 రైళ్లలో దేశమంతా తిరిగి ‘అరౌండ్‌ ఇండియా ఇన్‌ 80 ట్రైన్స్‌’ పుస్తకం రాశారు. ఆ తర్వాత లోకమంతా 80 రైళ్లలో చుట్టేసి ‘అరౌండ్‌ ద వరల్డ్‌ ఇన్‌ 80 ట్రైన్స్‌’ రాసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు స్త్రీలు రాత్రిపూట చేసే రైలు ప్రయాణాలు ఎలా ఉంటాయో ప్రపంచమంతా తిరిగి ‘మూన్‌లైట్‌ ఎక్స్‌ప్రెస్‌’ వెలువరించారు. ఈ రైలు ప్రయాణాల ప్రేమికురాలి పరిచయం...

‘భారతదేశాన్ని చూడాలంటే రైలులోనే చూడాలి’ అంటారు మోనిషా రాజేష్‌. యు.కె.లో స్థిరపడ్డ ఈ మాజీ జర్నలిస్టు ఇప్పుడు పూర్తిగా ‘ట్రావెల్‌ రైటర్‌’గా మారారు. ఆశ్చర్యకరంగా ఆమె తన కెరీర్‌కు ‘రైలు’ను ఒక ఆధారంగా మలుచుకున్నారు. అంటే పుస్తకాలు అమ్ముడవగా వచ్చే డబ్బు ఆమెకు రైలు ద్వారా వస్తున్నట్టే. ‘హఠాత్తుగా నాకు ఏమర్థమైందంటే నా పుస్తకాలకు రైలు కంటే మించిన కథానాయకుడు లేడని’ అంటారామె నవ్వుతూ.

ఆమె తాజా పుస్తకం ‘మూన్‌లైట్‌ ఎక్స్‌ప్రెస్‌ – అరౌండ్‌ ద వరల్డ్‌ బై నైట్‌ ట్రైన్‌’ మార్కెట్‌లోకి వచ్చింది. ప్రపంచంలోని అనేక దేశాలలో రాత్రి జర్నీల ద్వారా ట్రైన్‌లలో సంచారం చేస్తూ తాను చూసిన ప్రపంచాన్ని పరిచయం చేశారు మోనిషా. ఇప్పటివరకూ ‘రైలు’ ప్రయాణాల ఆధారంగా ఆమెవి నాలుగు పుస్తకాలు వచ్చాయి.

మొదటిసారి రైలుతో ప్రేమ
మోనిషా తల్లిదండ్రులది చెన్నై. ఇద్దరూ డాక్టర్లు. అయితే యు.కెలోని నార్‌ఫోక్‌లో స్థిరపడ్డారు. మోనిషా అక్కడే పుట్టి పెరిగింది. ఆమెకు 9 ఏళ్లు ఉన్నప్పుడు తల్లిదండ్రులు రెండేళ్లపాటు వెనక్కు వచ్చి చెన్నైలో ఉన్నారు కాని ఆ సమయంలో మోనిషాకు దేశం గురించి  తెలుసుకునే అవకాశం రాలేదు. తర్వాత ఆమె చదువు సాగి, జర్నలిస్టుగా మారాక, 2010 లో మరోసారి ఇండియాకు వచ్చారు. ‘నా దేశాన్ని చూడాలి అని నేను అనుకున్నప్పుడు విమాన ప్రయాణం బడాయి వద్దనుకున్నాను. రోడ్డు సేఫ్‌ కాదు. అందుకే రైలు ప్రయాణం ఎంచుకున్నాను.

90 రోజుల పాస్‌ తీసుకుని రైళ్లలో తిరగడం మొదలైన రెండు నెలల్లోనే నాకు అర్థమై పోయింది భారతదేశంలో రైలు ప్రయాణం అద్భుతమని. అందుకే ఈసారి ఒక ప్లాన్‌తో వచ్చి 80 ట్రైన్లలో తిరిగి ‘అరౌండ్‌ ఇండియా ఇన్‌ 80 ట్రైన్స్‌’ పుస్తకం రాశాను. దానికి బోల్డంత పాఠకాదరణ, అవార్డులు లభించాయి. ఆ ఉత్సాహం నన్ను రైలులో ప్రపంచ యాత్ర చేసేలా చేసింది’ అని తెలిపారు మోనిషా. ఆమె ఇండియాలో తిరుగుతూ కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో భువనేశ్వర్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు.. మోనిషా రైలు మార్గం ఉన్న ప్రతి దేశంలో తిరుగుతూ ‘అరౌండ్‌ ద వరల్డ్‌ ఇన్‌ 80 ట్రైన్స్‌’ పుస్తకం రాశారు. ఇప్పుడు రాత్రి ప్రయాణాలు ఉన్న రైళ్లలో ప్రయాణించి ‘మూన్‌లైట్‌ ఎక్స్‌ప్రెస్‌’ పుస్తకం రాశారు.

ధన్యమయ్యే ప్రయాణం
‘నేను భారతదేశమంతా సెకండ్‌ క్లాస్‌ ట్రైన్‌లో తిరిగాను. భారతదేశం అర్థం కావాలంటే ట్రైను ప్రయాణం చేయాలి. అదీగాక మనుషులు విమాన ప్రయాణాలతో విసుగెత్తారు. కోవిడ్‌ వల్ల లాక్‌డౌన్‌ వచ్చి ముగిశాక ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు భ్రమణకాంక్ష పెరిగింది. లోకం చూద్దాం అనుకుంటున్నారు. దానికి గొప్ప మార్గం రైలే. యూరప్‌లో 2015 నాటికి రాత్రి ప్రయాణాలు ఉండే స్లీపర్‌ ట్రైన్‌లు బంద్‌ చేశారు. ఇప్పుడిప్పుడే అవి తిరిగి మొదలయ్యాయి. స్త్రీలు ఒంటరిగా రాత్రిళ్లు రైలు ప్రయాణాలు చేయడం, జీవితాన్ని ఆస్వాదించడంలో భాగమే’ అంటారు మోనిషా.

ప్రకృతి కన్నులు
‘టర్కీ నుంచి ఆర్మేనియా వరకూ 26 గంటల పాటు సాగే రైలు ప్రయాణం అద్భుతం. టర్కీ సౌందర్యం మొత్తం అక్కడ చూడొచ్చు. ఇక అత్యుత్తమ రైలు ప్రయాణమంటే నార్వే దేశానికి వెళ్లాలి. అక్కడ రైలు కంపార్ట్‌మెంట్లు ఇల్లంత సౌకర్యంగా ఉంటాయి. భోజనం ఏది కావాలంటే అది దొరుకుతుంది. అదొక్కటే కాదు రాత్రి మూడు గంటలకు రైలు అద్దాల్లో నుంచి సూర్యోదయం చూడొచ్చు. ఇలా మరెక్కడ సాధ్యం?’ అంటారు మోనిషా.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)