ఫుల్‌స్టాప్‌ ఉండకూడదు

Published on Thu, 05/29/2025 - 06:30

72వ మిస్‌ వరల్డ్‌ కాంటెస్ట్‌కు హాజరైన మిస్‌ వరల్డ్‌ 2024 క్రిస్టినా పిస్కోవా బుధవారం హైదరాబాద్‌లోని ట్రైడెంట్‌ హోటల్‌లో  బ్యూటీ విత్‌ ఎ పర్పస్‌ చారిటీ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్టినా యువతకు  స్ఫూర్తినిచ్చేలా మాట్లాడారు.

కిందటేడాది మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని గెలుచుకున్న క్రిస్టినా బ్యూటీ విత్‌ ఎ పర్పస్‌ అంబాసిడర్‌గా ప్రపంచమంతా పర్యటించింది. క్రిస్టినా పిస్కోవా ఫౌండేషన్‌ స్థాపించి దానిద్వారా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు చదువు దూరం కాకూడదన్న సంకల్పంతో టాంజానియాలో స్కూల్‌ను ప్రారంభించింది. సోంటా ఫౌండేషన్‌ ద్వారా చెక్‌ రిపబ్లిక్‌లోని వికలాంగులకు మద్దతు ఇస్తుంది. 

   చెక్‌ రిపబ్లిక్‌ దేశంలోని ట్రినెక్‌ నగరంలో పుట్టింది క్రిస్టినా. ఆ తర్వాత వారి కుటుంబం దేశ రాజధాని ప్రాగ్‌లో స్థిరపడింది. న్యాయశాస్త్రంలో, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పూర్తి చేసిన క్రిస్టినా మోడలింగ్‌పై ఆసక్తి ఉండటంతో అటుగా అడుగులు వేసింది. స్థానిక భాషతోపాటు ఇంగ్లిష్, పోలిష్, స్లోవాక్, జర్మనీ భాషల్లో ప్రావీణ్యం సాధించింది. లండన్‌లోని ఎలైట్‌ మోడల్‌ మేనేజ్‌మెంట్‌లో చేరి, అందాల పోటీలో పాల్గొనడానికి శిక్షణ తీసుకుంది. మిస్‌ చెక్‌ రిపబ్లిక్‌ పోటీల్లో పాల్గొని, తొలిప్రయత్నంలోనే కిరీటం దక్కించుకుంది.

సాధించగలం అనే నమ్మకం
మ్యూజిక్, ఫ్యాషన్, ఆర్ట్‌ అంటే ఇష్టపడే క్రిస్టినా తన సక్సెస్‌ గురించి వివరిస్తూ –‘‘జీవితంలో పుల్‌స్టాప్‌ అనేది ఎప్పుడూ ఉండకూడదు. అన్నీ కామాలే ఉంచాలి. నేను మ్యూజిక్‌ నేర్చుకున్నా, ఆర్ట్‌ ఫామ్స్‌ నేర్చుకున్నా, మోడలింగ్‌ చేసినా... ఏ లక్ష్యం కోసం పనిచేసినా దానికి సంబంధించి సమస్యలు, ఒత్తిళ్లు వస్తూనే ఉండేవి. ఆర్థిక సవాళ్లను కూడా ఎదుర్కొన్నాను. నేను ఈ స్టేజీకి రావడం వెనకాల పెద్ద పోరాటమే చేశాను. కానీ, కలలను సాధించే క్రమంలో చేసే ప్రయత్నాలు, ఆ తర్వాత పొందిన ఫలితాలతో చాలా ఆనందాన్ని పొందాను. మార్పు అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు. ఏడాది పొడవునా శ్రమిస్తూనే ఉండాలి. ఏ లక్ష్యం కోసం పాటుపడుతున్నామో దానిని వదిలిపెట్టకూడదు. ఇతర భాషౖలపెనా పట్టు సాధించాలి.

మంచి మార్పుకు ఉదాహరణగా! 
అందాల పోటీ అత్యుత్తమమైనది. ప్రపంచవ్యాప్తం గా అవసరంలో ఉన్న పిల్లలకు ఆశను, ఆనందాన్ని కలిగించే శక్తిని ఇస్తుంది. ఇది ఎంత ఛాలెంజింగో అంత పెద్ద బాధ్యత కూడా. మంచి మార్పుకు ఉదాహరణగా, ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా, ముఖ్యమైన అంశాలపై అవగాహన తీసుకువచ్చేలా ఉండాలి. ఏదైనా సాధించాలంటే ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి.

మరచిపోలేని అద్భుతం
తెలంగాణలో అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో పాటు ఉత్సాహభరితమైన సంస్కృతి ఎంతో ఆకట్టుకుంది. యాదగిరిగుట్ట టెంపుల్‌ ఆర్కిటెక్చర్, రాజరికపు వారసత్వానికి ఆభరణంగా నిలిచిన చౌమహల్లా ΄్యాలెస్, తెలంగాణ వంటకాలు, ఇక్కడి సంప్రదాయం.. ఇదంతా ఒక అద్భుత ప్రయాణంగా మారిపోయింది. విక్టోరియా మెమోరియల్‌ హోమ్‌ను సందర్శించి లైబ్రరీ, కంప్యూటర్‌ ల్యాబ్‌ ప్రారంభించాం. ముఖ్యంగా పిల్లలతో సమయం గడపడం, వారి కథలు వినడంతో వారితో కలిసి ఆనంద క్షణాలను పంచుకున్నాం’’ అని తెలిపారు క్రిస్టినా. 

– నిర్మలారెడ్డి 
ఫొటోల: ఎస్‌. ఎస్‌. ఠాకూర్‌

 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)