Breaking News

బ్యూటీ విత్‌ పర్పస్‌..

Published on Wed, 05/07/2025 - 11:11

నగర వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్‌ వరల్డ్‌ పోటీల గురించి విధితమే. అయితే ప్రతి అంశానికి, కార్యక్రమానికి విధిగా నియమావళి ఉన్నట్లే మిస్‌ వరల్డ్‌ పోటీలకు సైతం నియమాలు, అర్హతలు, తదితర అంతర్జాతీయ అంశాలు ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్న మిస్‌ వరల్డ్‌ పోటీల నేపథ్యంలో ఈ పోటీలకు సంబంధించిన నియమాలు, పోటీల్లో పాల్గొనే వారి అర్హతలు తదితర అంశాల గురించి ఆరా తీస్తున్నారు. వీటికి సంబంధించిన వివరాల కోసం గూగుల్‌ను సైతం ఆశ్రయిస్తున్నారు. ఈ సందర్భంగా మిస్‌ వరల్డ్‌ పోటీలకు సంబంధించిన నియమావళి.  

ప్రపంచ వ్యాప్తంగా ప్రతిష్టాత్మక అందగత్తెల పోటీగా మిస్‌ వరల్డ్‌ పరిచయమైంది. మిస్‌ వరల్డ్‌ పోటీ అనేది కేవలం అందాన్ని ఆరాధించడమే కాక, వ్యక్తిత్వం, సామాజిక బాధ్యతలు, సామాజిక చైతన్యాన్ని కూడా ప్రోత్సహించే గొప్ప వేదిక. ఇది ప్రతి మహిళకూ తన ప్రతిభను ప్రపంచానికి చూపించేందుకు ఒక గొప్ప అవకాశం కలి్పస్తుంది. 1951లో ప్రారంభమైన ఈ పోటీ ద్వారా.. ప్రతి యేటా వివిధ దేశాల మహిళలు తమ అందం, ప్రతిభ, సామాజిక బాధ్యత, వ్యక్తిత్వం ఆధారంగా ప్రపంచానికి పరిచయమవుతారు. మిస్‌ వరల్డ్‌ పోటీని నిర్వహించే ప్రతిపాదనలు, నియమాలు, అర్హతలు, అంతర్జాతీయ అంశాలు విస్తృతంగా ఉంటాయి. 

నియమాలు, నిబంధనలు.. 
మిస్‌ వరల్డ్‌ పోటీలో పాల్గొనడానికి కొన్ని ముఖ్యమైన నియమాలు ఉంటాయి. మొత్తం 140కు పైగా దేశాలు ఈ పోటీలో ప్రతినిధులను పంపిస్తాయి. ఇందులో ప్రతి దేశం తమ దేశంలో ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తుంది, విజేతలు ఎంట్రీ పాసులు పొందుతారు. పోటీలో పాల్గొనడానికి మహిళలు వారి వయసు కనీసం 18 సంవత్సరాలు పూర్తయ్యి ఉండాలి. గరిష్ట వయస్సు 26 సంవత్సరాలు, అంటే 
27వ సంవత్సరంలోకి ప్రవేశించే వారు పోటీలో పాల్గొనలేరు.

ఇవే అర్హతలు.. 
జాతీయత : ప్రతి దేశం తన తరపున ఒక్క మహిళను పంపిస్తుంది. ఆ మహిళ ఆ దేశం సిటిజన్‌గా ఉండాలి. 
భాష : అభ్యర్థులు ఆంగ్ల భాషలో మాట్లాడగలిగితే అది వారి పోటీ కోసం అనుకూలంగా ఉంటాయి. 
విద్య, సామాజిక బాధ్యత : మహిళలకు సాధారణంగా మంచి విద్య ఉండాలి. అలాగే వారి సామాజిక బాధ్యతలు, సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ముఖ్యం.

అంతర్జాతీయ అంశాలు.. 
మిస్‌ వరల్డ్‌ పోటీ కేవలం అందం మాత్రమే కాక, సామాజిక, సాంస్కృతిక, శక్తివంతమైన అంశాలపై దృష్టి సారిస్తుంది. ప్రతి ఏడాది పోటీ ‘బ్యూటీ విత్‌ పర్పస్‌’ అనే థీమ్‌ ఆధారంగా నిర్వహించబడుతుంది. ఇందులో అభ్యర్థులు ప్రపంచవ్యాప్తంగా తమ కమ్యూనిటీలకు సహాయం చేసే విధంగా వనరులను ఉపయోగిస్తారు. వాటిలో విద్య, ఆరోగ్యం, మహిళల హక్కులు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలు ముఖ్యంగా ఉంటాయి.

ప్రత్యేక అంశాలు.. 
మిస్‌ వరల్డ్‌ పోటీలో పాల్గొనడం స్నేహపూర్వక పోటీ మాత్రమే కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా పరిచయమవ్వడానికి కూడా ఒక మార్గం. అభ్యర్థులు వివిధ ప్రదర్శనల్లో పాల్గొని, ప్రపంచంలోని వివిధ సాంస్కృతిక నేపథ్యాలను అంగీకరిస్తారు. ఇదే కాకుండా, వారు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని, సాంకేతికంగా కూడా సమాజానికి అవసరమైన మార్పు తీసుకురావడంలో శక్తిమంతంగా వ్యవహరిస్తారు.   

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు