రామప్ప ఆలయాన్ని సందర్శించనున్న సుందరీమణులు

Published on Tue, 05/13/2025 - 10:36

మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనే సుందరీమణులు బుధవారం యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి వస్తుండడంతో ప్రభుత్వం, టూరిజం శాఖ అధికారులు ఆ బృందానికి స్వాగతం పలుకుతూ విస్తృత ప్రచారం చేపడుతున్నారు. ఇటీవల మిస్‌ ఇండియా నందిని గుప్తా రామప్ప ఆలయాన్ని సందర్శించి ఫొటో షూట్‌ చేశారు. ఆమె ఆలయం చుట్టూ తిరుగుతూ శిల్పాకళా సంపదను తనివితీరా చూస్తున్న దృశ్యాలను చిత్రీకరించారు. నిమిషం నిడివి ఉన్న ఒక వీడియో, 38 సెకన్లు ఉన్న మరో వీడియోను రూపొందించి విడుదల చేశారు. 

ఆలయ శిల్ప కళా సంపద, చరిత్రను వివరిస్తూ ప్రపంచ సుందరీమణులకు స్వాగతం పలుకుతూ చేసిన ఈ ఆహ్వాన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. కాగా, హైదరాబాద్‌నుంచి సుందరీమణులు మన బ్రాండ్‌ ప్రపంచమంతా తెలిసేలా ‘తెలంగాణ జరూర్‌ ఆనా’ పేరుతో ఉన్న ఏసీ బస్సులో రానున్నారు.

3డీ మ్యాపింగ్‌ ప్రొజెక్షన్, హై –రెజల్యూషన్‌ ప్రొజెక్టర్లు
ప్రపంచ సుందరీమణులు రాక సందర్భంగా ఖిలావరంగల్‌ కోటలోని కట్టడాలు, శిల్ప కళా సంపద విద్యుత్‌ దీపాల వెలుగుల్లో మెరిసిపోతున్నాయి. కట్టడాలు మరింత ఆకర్శణీయంగా కనిపించేందుకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సంస్థ 3డీ మ్యాపింగ్‌ ప్రొజెక్షన్, హై –రెజల్యూషన్‌ ప్రొజెక్టర్లు, లేజర్‌ లైట్లు, మూవింగ్‌ హెడ్స్‌ వంటి అధునాతన సాంకేతికతను వినియోగించారు. బంగారు, తెలుపు వర్ణం కాంతుల్లో శిల్పాలు మెరిసిపోతున్నాయి. దీనికితోడు ఫ్లడ్‌లైట్లు, ఎల్‌ఈడీ(వామ్‌) లైట్ల వెలుగులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

 

(చదవండి: ఒత్తిడిని దూరం చేసే చిట్టిపొట్టి చేపలు..!)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)