Breaking News

మిస్‌ యూనివర్స్‌కు మన తెలుగు తేజాలు

Published on Mon, 06/09/2025 - 04:20

త్వరలో థాయిలాండ్‌లో జరగనున్న మిస్‌ యూనివర్స్‌ 2025 కోసం భారత్‌ నుంచి మిస్‌ యూనివర్స్‌  ఇండియాను ఎంపిక చేయడానికి పోటీలు జరిగాయి. హైదరాబాద్‌ వేదికగా జరిగిన ఈ ఫైనలిస్టుల ఎంపికలో మిస్‌ యూనివర్స్‌ తెలంగాణగా కశ్వి, మిస్‌ యూనివర్స్‌  ఆంధ్రప్రదేశ్‌గా ప్రకృతి  ఎంపికయ్యారు.  ఈ సందర్భంగా వీరు  పంచుకున్న విశేషాలు..

సుస్మితాసేన్‌ స్ఫూర్తి
నేను మెడికల్‌ స్టూడెంట్‌ని. మోడల్‌ గా కూడా రాణిస్తున్నాను. శాస్త్రీయ నృత్యమూ నేర్చుకున్నాను. అందాల పోటీలు అంటే కేవలం బ్యూటీ గురించి మాత్రమే కాదు. మహిళా సాధికారత, ఆత్మవిశ్వాసం, సమాజానికి మంచి చేయాలనే ఆలోచన, జీవన నైపుణ్యాల వృద్ధి.. ఇలా అన్నింటిపై ఫోకస్‌ ఉంటుంది. అందుకే నేను దీనిమీద దృష్టి పెట్టాను. నేను పుట్టి పెరిగింది అమెరికాలో. మా అమ్మానాన్నలు తెలంగాణ వాసులు. మిస్‌ యూనివర్స్‌ సుస్మితాసేన్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆమెలా ఎదగాలన్నది నా డ్రీమ్‌. అందుకే నన్ను నేను నిరూపించుకోవడానికి హైదరాబాద్‌ వచ్చాను. 

ఈరోజుల్లో ప్రజల్లో మానసిక అనారోగ్యం బాగా పెరుగుతోంది. దీనిపై చైతన్యం కలిగించేందుకు కృషి చేస్తున్నాను. అలాగే గృహహింస పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాను. వీటితో పాటు మూగ, చెవిటి వారికి సహాయకారిగా ఉంటూ వారి వృద్ధికి కృషి చేస్తున్నాను. ఈ విషయాలు న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నాయి. తెలంగాణకు రావడానికి ముందే మా పేరెంట్స్‌ నుంచి, బుక్స్‌ నుంచి తెలంగాణ గొప్పతనం గురించి తెలుసుకున్నాను. ఇక్కడికి రావడం విజేతగా నిలవడం... చాలా సంతోషంగా ఉంది.
– కశ్వి, మిస్‌ యూనివర్స్‌  తెలంగాణ

కాన్ఫిడెన్స్  ముఖ్యం
కళ్ళు మూసినా, తెరిచినా కిరీటమే కళ్ళ ముందుండేది. ఫైనలిస్ట్‌గా ఎంపికయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. పోటీలో మన మాటల్లో, నడకలో, ప్రవర్తనలో కాన్ఫిడెన్స్ నే ప్రధానంగా చూస్తారు. ఫైనల్‌ రౌండ్‌లో... త్యాగం,  పాజిటివిటీ, నెగెటివిటీల గురించి అడిగారు. త్యాగం అనేది ఎప్పుడూ గొప్పదే. మన జీవితంలో చిన్న చిన్న త్యాగాలు  చేస్తుంటాం. కానీ, త్యాగం వల్ల మన సెల్ఫ్‌ హ్యాపీగా లేకపోతే చేయకూడదు అని నేను చెప్పడం న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. గత ఏడాది ఫెమినా మిస్‌ ఇండియా తెలంగాణ నుంచి పోటీ చేసి గెలు పొందాను. ఈ ఏడాది మిస్‌ యూనివర్స్‌ ఆంధ్రప్రదేశ్‌గా ఎంపికయ్యాను. ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామో ఆ రాష్ట్ర సంస్కృతి, చరిత్ర, భాష.. ఇలా అన్నింటి గురించి తెలిసుండాలి. 

అమ్మానాన్న బెంగళూరులో ఉంటారు. అమ్మ వర్కింగ్‌ విమెన్, అక్క ప్రేరణ నాకు బ్యాక్‌ బోన్‌ అని చెప్పవచ్చు. అంతగా ఎంకరేజ్‌ చేస్తారు. బీకామ్‌లో డిగ్రీ చేశాను. డాన్స్  అంటే ఇష్టంతో డాన్స్ కోర్సు చేశాను. బెంగళూరులో డాన్స్  స్టూడియో ఉంది. రియాలిటీ షో చేశాను, నేను నటించిన సినిమా త్వరలో రిలీజ్‌ కాబోతుంది. నన్ను ఆల్‌ రౌండర్‌ అని నా ఫ్రెండ్స్‌ అంటుంటారు.  బ్యూటీ అంటే ఫిజికల్‌గా కనిపించేదే కాదు.. మన సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్ . దానినే అన్నింటికన్నా భిన్నంగా చూపగలగాలి.
–ప్రకృతి కంబం, మిస్‌ యూనివర్స్‌ ఆంధ్రప్రదేశ్‌

– నిర్మలారెడ్డి
ఫొటోలు: ఎస్‌.ఎస్‌.ఠాకూర్‌
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)