Breaking News

బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ మిరాకిల్‌ జ్యూస్‌ తాగితే..!

Published on Sat, 01/06/2024 - 15:18

ప్రస్తుత కాలంలో బరువు  తగ్గడం అనేది ఒక పెద్ద టాస్క్‌. క్రమం తప్పని  వ్యాయామం, కొన్ని ఆహార నియమాలు పాటిస్తే ఎలాంటి వారైనా బరువు తగ్గడం ఈజీనే.  ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించని పక్షంలో  సీనియర్‌ డైటీషియన్‌నిగానీ, వైద్యుణినిగానీ సంప్రదించడం ఉత్తమం. అయితే బరువు తగ్గే క్రమంలో ఈ మధ్య కాలంలో బాగా వినిస్తున్న పేరు ఏబీసీ జ్యూస్‌.  వెయిట్‌ లాస్‌కు ఇది అద్భుతంగా పనిచేస్తుందనేది  సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అయితే అసలేంటీ ఏబీసీ జ్యూస్‌. దీని లాభ నష్టాలేంటి ఒకసారి చూద్దాం.

ABC జ్యూస్‌ అంటే ఏమిటి?
ఈ అద్భుత పానీయం (సోషల్ మీడియాలో బాగా పాపులర్‌)  నిజానికి మూడింటి  రసాల మిశ్రమం.  యాపిల్‌(A) బీట్‌రూట్‌(B)  క్యారెట్ (C) అలా టోటల్‌గా ఇది  ABC జ్యూస్‌ అయిందన్నట్టు.  వీటిని ప్రయోజనాలను  విడివిడిగా చూస్తే.

యాపిల్స్
అధిక పోషకాలు, యాపిల్స్ చాలా పోషకమైనవి. గుండె జబ్బులు, మధుమేహం , క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే ఫైబర్ యాంటీఆక్సిడెంట్లు వీటిలో అధికంగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. 

బీట్‌రూట్
శక్తివంతమైన ,రుచికరమైన  వెజిటబుల్‌. శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించే లక్షణం ఇందులో ఉంది.  యాంటీఆక్సిడెంట్లు , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అలాగే  ఇన్ఫెక్షన్ల  నివారణలో బాగా ఉపయోడపడుతుంది. నైట్రేట్ కంటెంట్‌  ఎక్కువ. న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, నొప్పిని తగ్గించడానికి, బాడీ మెటబాలిజానికి ఉపయోగ పడుతుంది. 

క్యారెట్‌
పలు అధ్యయనాల ప్రకారం క్యారెట్‌లో బీటా-కెరోటిన్ విటమిన్ A ఎక్కువ  లభిస్తుంది. కెరోటినాయిడ్స్, విటమిన్లు , డైటరీ ఫైబర్‌ పుల్కంగా  ఉన్నాయి. క్యారెట్‌లో యాంటీఆక్సిడెంట్లు , మినరల్స్ కూడా ఉంటాయి.  శరీరంలోని  విషాన్ని తొలగిస్తుందని కూడా నమ్ముతారు.

ABC జ్యూస్ ఆరోగ్యకరమైనదేనా?
ఈ జ్యూస్‌లో వాడే పదార్థాలు ఆరోగ్యకరమైనవే అనేది మనకు అర్థం అవుతోంది. అయితే ఈ పండ్లు , కూరగాయల కలయిక  ఆరోగ్యకరమైన దేనా అన్నదే ప్రశ్న. ఇందులో అధిక పోషకాలు, విటమిన్లు , యాంటీఆక్సిడెంట్‌లతో నిండి ఉన్నాయి  అలాగే ఫైబర్‌ కూడా మెండుగా ఉంది కాబట్టి,  ABC డ్రింక్ చాలా ఆరోగ్యకరమైన జ్యూస్‌ అని న్యూట్రిషన్ అండ్ డైటీషయన్ల అభిప్రాయం. దీనికి తోడు ఇవి సులభంగా, చవకగా అందుబాటులో ఉంటాయంటున్నారు. ABC జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ అధికంగా ఉండటం వల్ల  గుండెకు మేలు చేస్తుంది. అలాగే, కొలెస్ట్రాల్, సోడియం తక్కువగా ఉన్న ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారంతో పాటు తీసుకుంటే, మరింత ప్రయోజనం ఉంటుంది. ఈ మూడింటిలోని నేచురల్‌ సుగర్‌ ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తుంది.

అయితే, బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది ఒక్కటే సరిపోతుందా అంటే కాదు. రోజంతా ఇదే  పానీయం తీసుకోవడం కాకుండా ABC జ్యూస్‌తో పాటు ఆరోగ్యకరమైన తక్కువ కార్బ్, తక్కువ కొవ్వు,  అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తినాలని  నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

ABC జ్యూస్‌  దుష్ప్రభావాలు
పొటాషియం నియంత్రణలో ఉన్న వ్యక్తులు, కిడ్నీ రోగులు లేదా తక్కువ FODMAP డైట్‌లో  ప్రేగు సిండ్రోమ్ ఉన్నవారు ABC జ్యూస్‌కు దూరంగా ఉండాలి. 

ఎలా చేసుకోవాలి
రెండు యాపిల్స్‌,  చిన్న క్యారెట్లు,  ఒక బీట్‌ రూట్‌ తీసుకోవాలి. వీటిని ముక్కలుగా కట్‌  చేసుకొని,  జ్యూసర్‌లో  బాగా మెత్తగా అయ్యాక, రసం తీసుకోవాలి.  దీన్ని వడపోసుకుని  తాగవచ్చు. కావాలంటే రుచికి నిమ్మరసం, చిన్న అల్లంముక్కను కూడా యాడ్‌  చేసుకోవచ్చు. 
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)