Breaking News

మిల్లెట్స్‌తో ఆరోగ్యం మెరుగు: అమల

Published on Sun, 04/20/2025 - 12:33

 లెట్‌ సీ కమ్యూనిటీ ప్రారంభం 

మాదాపూర్‌: అందరూ ఆహారంలో మిల్లెట్స్‌ను భాగం చేసుకుంటే ఆరోగ్యం మెరుగవుతుందని సినీనటి, సామాజిక కార్యకర్త అమల అక్కినేని అన్నారు. మాదాపూర్‌లోని మినర్వా గ్రాండ్‌ హోటల్‌లో శనివారం లెట్‌ సీ (లివింగ్‌ త్రూ కమ్యూనిటీ)ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆహారం, ఆధ్యాతి్మకత, ఆరోగ్యం, ఉద్యమోన్యుఖత అనే నాలుగు అంశాలు మన జీవితంలో ముఖ్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ మిల్లెట్‌లను వాడుతూ ఆరోగ్యంగా, ఆర్థికంగా, ఆనందంగా ఉండాలని కోరారు. లెట్‌సీ ద్వారా ఫిజికల్‌ మీటింగ్స్, ఆన్‌లైన్‌ సమావేశాలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మధ్యతరగతి యువతను మిల్లెట్‌ పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే ప్రయత్నాన్ని ప్రశంసించారు. లెట్‌ సీ చైర్మన్‌ ప్రసన్న శ్రీనివాస్‌ శరకడం మాట్లాడుతూ టిపిన్స్, భోజనాల పోడులు, నూడుల్స్, పాస్తా, స్నాక్స్, మిఠాయిలు తదితర ఉత్పత్తుల గురించి వివరించారు. 50 మంది డాక్టర్లతో ఏర్పాటు చేసిన హెచ్‌ఎన్‌ఏ కౌన్సిల్‌ తరపున డాక్టర్‌ స్రవంతి మాట్లాడుతూ మండలాల వారీగా ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు డాక్టర్లు కృషి చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో అడ్వకేట్‌ గోషిక, సీఎ ప్రవీణ్‌కుమార్, మిల్లెట్‌ రైతులు, వినియోగదారులు, లెట్‌సీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

పెట్‌ ఫెస్ట్‌.. స్టైలిష్‌ డాగ్స్‌
విభిన్న జాతులు.. వివిధ రకాల పెంపుడు కుక్కలు సందడి చేశాయి. చూపరులను ఆకట్టుకున్నాయి. శనివారం బీ2ఎం వెట్‌కేర్‌ ఆసుపత్రిలో రెయిన్‌బో విస్టాస్‌ పెట్‌ లవర్స్‌ అసోసియేషన్‌ సహకారంతో పెట్‌ ఫెస్ట్‌ నిర్వహించారు. ఈ మెగా పెట్‌ ఫెస్ట్‌లో 40కిపైగా విభిన్నమైన జాతుల స్టైలిష్‌ డాగ్‌లు కనువిందు చేశాయి. పెంపుడు జంతువులను ఆకర్షించడం, వాటితో స్నేహం చేయడం, అనుభవాలను పంచుకోవడానికి పెద్ద సంఖ్యలో పెట్‌ లవర్స్‌ తరలి రావడంపై గర్వంగా ఉందని బీ2ఎం వెట్‌కేర్‌ వ్యవస్థాపకుడు సంతోష్‌నాయక్‌ అన్నారు. పెంపుడు జంతువుల సంరక్షణ చర్యలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి పెట్‌ ఒక ప్రత్యేకమైనదన్నారు. 
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)