Breaking News

Met Gala 2024: హైదరాబాదీ సుధారెడ్డి డైమండ్‌ నెక్లెస్‌ విశేషం ఏంటో తెలుసా?

Published on Wed, 05/08/2024 - 12:04

ప్రతిష్టాత్మక మెట్‌ గాలా 2024లో భారతీయ బిలియనీర్‌ సుధారెడ్డి అత్యంత విలువైన ‘అమోర్‌ ఎటర్నో’డైమండ్‌ నెక్లెస్‌ ధరించి తళుక్కు మన్నారు. భారతీయ వ్యాపారవేత్త, మేఘా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమి టెడ్‌ (ఎంఈఐఎల్‌) గ్రూప్‌ డైరెక్టర్‌ సుధారెడ్డి మెట్‌ గాలా 2024లో రెడ్‌కార్పెట్‌ను అలంకరించారు. ఈ వేదికగా భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా అద్భుతమైన దుస్తులతోపాటు 180 క్యారెట్ల డైమండ్‌ నెక్లెస్‌తో పాల్గొని అందరి చూపులను తన వైపు తిప్పుకున్నారు.  

ఈ నెక్లెస్‌, ఇతర అందమైన ఆభరణాల తయారీకి 100 గంటలు పట్టిందట. ముఖ్యంగా ఇందులో కృష్ణ, సుధ ప్రేమకు గుర్తుగా  ప్రధాన భాగంలో నాలుగు పెద్ద, గుండె ఆకారంలో వజరాలను పొదిగారు. సింబాలిక్‌గా కుటుంబ వృక్షం కూడా ఉంది. అతిపెద్ద వజ్రం, 25 క్యారెట్ల కింగ్ ఆఫ్ హార్ట్స్, భర్త కృష్ణనుకు ప్రతీకగా, క్వీన్ ఆఫ్ హార్ట్స్, 20 క్యారెట్ల  హార్ట్‌షేప్డ్‌ వజ్రంతో, సుధా రెడ్డిని  సూచిస్తూ, ఇంకా ప్రిన్స్ ఆఫ్ నాలెడ్జ్ , ప్రిన్స్ ఆఫ్ ట్రెజర్స్ అని పిలువబడే రెండు  20-క్యారెట్  డైమండ్స్‌  కుమారులు ప్రణవ్,మానస్‌లను  ప్రతిబింబిస్తూ దీన్ని తయారు చేశారు.  

ఇంకా 23 క్యారెట్ల యెల్లో  డైమండ్‌ రింగ్‌,  రెడ్డీస్ స్వరోవ్స్కీ, పూల చేతులు, బ్యాగ్‌ ఇలా అన్ని  స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. 

ఈసందర్బంగా  సుధారెడ్డి మాట్లాడుతూ రెడ్‌కార్పెట్‌పై నడిచి మన నగరానికి, దేశానికి గుర్తింపు తీసుకురావడం గర్వంగా ఉందని తెలిపారు. 
 

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)