Breaking News

బాధ్యతను గుర్తుచేసేలా.. అబ్బురపరుస్తున్న వన్యప్రాణుల చిత్రాలు..!

Published on Fri, 05/30/2025 - 09:41

వన్య ప్రాణులను సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని, బాధ్యతలను గుర్తుచేస్తూ తెలంగాణ రాష్ట్రం బేగంపేట ప్రకాశ్‌నగర్‌ ఫ్లైఓవర్‌ పిల్లర్స్‌ను వన్యప్రాణుల చిత్రాలతో ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఆ మార్గంలో వెళ్లే వాహనదారులను వన్య ప్రాణుల బొమ్మలు కట్టిపడేస్తున్నాయి. జీవకళ ఉట్టిపడే రీతిలో చిత్రకారులు గీసిన బొమ్మలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 

చిరుతలు, పులులు, ఏనుగులు, ఎగులుబంట్లు, జాతీయ పక్షి నెమళ్లు, జింకలు, సింహాలు.. ఇలా రకరకాల వన్యప్రాణుల చిత్రాలు చూస్తే వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యతను అటుగా వెళ్లే ప్రయాణికులకు గుర్తుచేస్తున్నాయి. భారత జులాజికల్‌ సర్వే(జెడ్‌ఎస్‌ఐ) ప్రకారం దేశంలో మొత్తం 89 వేలకు పైగా జంతు జాతులు ఉన్నాయి. 

వీటిలో కూడా అనేకం అంతరించిపోయే ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి. అలాంటి వన్య ప్రాణులను సంరక్షించుకోవడం ద్వారా అటవీ సంపదను కాపాడిన వారమవుతామని, దీని ద్వారా పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుందని ప్రభుత్వాలు, ఎన్జీవోలు, పర్యావరణ వేత్తలు నిత్యం పలు రూపాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే వస్తున్నారు. 

ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ నగర వ్యాప్తంగా ఉన్న ఫ్లైఓవర్ల సుందరీకరణలో భాగంగా బేగంపేట ప్రకాష్‌నగర్‌(ఎయిర్‌పోర్ట్‌ ఎదురుగా) ఫ్లైఓవర్‌ పిల్లర్స్‌కు వేసిన చిత్రాలను చూస్తే అద్భుతమనిపిస్తోంది. సందేశాత్మక థీమ్‌తో అబ్బురపడేలా వేసిన చిత్రాలు ఒక దానికి మించి మరొకటి ఉంది.  

(చదవండి: డీఎన్‌డీ మోడ్‌..! ఈజీగా నోటిఫికేషన్స్‌, ఫోన్‌కాల్స్‌ మ్యూట్‌ చెయ్యొచ్చు..)

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)