Breaking News

‘రాక్‌స్టార్’: 150 ఏళ్ల నాటి పియానోని ప్లే చేసిన సీఎం

Published on Sun, 08/17/2025 - 14:07

కళ వద్దకు వచ్చేటప్పటికీ..ఎంత అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తి అయినా చిన్నపిల్లవాడిలా మారిపోతారు. బహుశా ఆర్ట్‌కి ఉన్న శక్తి కాబోలు. ఇక్కడ అలానే ఒక రాష్ట్ర సీఎం పియానో చూడగానే ఆలపించాలనిపించిందో లేదా తన టాలెంట్‌ని చూపించాలనుకున్నారో గానీ అందరూ ఆశ్చర్యపోయేలా ప్లే చేయడమే గాక మైమరచిపోయేలా చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

రాజకీయాలకు అతీతంగా మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా తన సంగీత ప్రతిభతో మరోసారి ప్రజలను మంత్రముగ్దుల్ని చేశారు. ఆ వీడియోల ఆయన 150 ఏళ్ల నాటి పియానోపై బాలీవుడ్‌ ప్రసిద్ధ పాట షెహ్లో నషా పాటను ప్లే చేశారు. షిల్లాంగ్‌లోని రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి అలా ప్లే చేశారో లేదా ఒక్కసారిగా ప్రేక్షకులు చిరునవ్వులు చిందిస్తూ ఆస్వాదించారు. 

ఈ రాక్‌స్టార్‌ సీఎం సగ్మా ఆలసించిన శ్రావ్యమైన సంగీతాన్ని అక్కడున్న చాలామంది తన ఫోన్‌ రికార్డు చేశారు కూడా. ఇక గవర్నర్‌ సీహెచ్‌ విజయ్‌ శకంర్‌ అక్కడున్న ప్రేక్షకుల్లో భాగం కావడం విశేషం. సంగ్మా ఇలా సంగీత వాయిద్యాన్ని సీఎం సంగ్మా ప్లే చేయడం కొత్తేం కాదు. గతంలో కూడా ఇలానే పలు సందర్భాల్లో తన సంగీత ప్రతిభను చాటుకున్నారు కూడా. ఇక సంగ్మా ప్రస్తుం పియానోపై ఆలపించిన పాట 1992లో విడుదలైన అమీర్‌ఖాన్‌ మూవీ ‘జో జీతా వోహి సికందర్’లోనిది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి మరి.

 

(చదవండి: కుటుంబం దూరమై... శునకాలే కుటుంబమై!)

 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)